29, డిసెంబర్ 2016, గురువారం

Maro kavita naa raatalo...

Maro kavita....

25, డిసెంబర్ 2016, ఆదివారం

Naa maro raata...


20, డిసెంబర్ 2016, మంగళవారం

Naa cheti raatalo.....kavita


17, డిసెంబర్ 2016, శనివారం

Naa cheti ratalo naa kavita...!!

Moro kavita naa cheti ratalo..

16, డిసెంబర్ 2016, శుక్రవారం

Cheti ratalo ...

Moro kavita naa raatalo ...

Cheti raata lo

Naa cheti raatalo ....


మణి మాలికలు...!!

1. కవ్విస్తోంది కాలం
నువ్వు లేని క్షణాలను గుర్తుచేస్తూ...!!

2. కవ్విస్తోంది కాలం
కనిపించని మనసు గాయాలను తలపిస్తూ...!!

3. కవ్విస్తోంది కాలం
కలలా కరిగిన జ్ఞాపకాలతో చేరి...!!

7, డిసెంబర్ 2016, బుధవారం

మాయమవనంటున్నావు...!!

రేగుతున్న గాయాలన్నీ
రాజుకుంటున్నాయి

గతాన్ని దాచేయాలనుకుంటే
వాస్తవాలవుతున్నాయి

కన్నీళన్ని ఒక్కసారిగా
పెల్లుబికుతున్నాయి

అంతఃశత్రువులు మూకుమ్మడిగా 
దాడి చేస్తున్నాయి

మాటలన్నీ మౌనాలై
మూగబోయాయి

అక్షరాలన్నీ లేఖల్లో
తొంగి చూస్తున్నాయి

మనసులోని నువ్వేమో
మాయమవనంటున్నావు...!!

6, డిసెంబర్ 2016, మంగళవారం

ఓ జీవితం...!!

సుడుల సుడిగుండాలు 
బాధల బందిఖానాలు 
కష్టాల కన్నీళ్ళు 

ఎడద ఒంపిన ఏకాంతాలు 
మదిలో రేగిన అలజడులు 
మేథకు అందని అంతర్లోచనాలు  

ఒంటరి పయనంలో ఒయాసిస్సులు 
గతించిన కాలపు షడ్రుచులు 
భిన్న దృవాల దృక్పధాలు 

రెప్పపాటు జీవితానికి 
గుప్పెడు గుండెలో చేరిన
జ్ఞాపకాల గువ్వల సవ్వడి 

నిరాశలను ఓదార్చుతూ 
నిరంతర పరి భ్రమణానికి 
సమాయత్తమవడమే ఓ జీవితం...!!

5, డిసెంబర్ 2016, సోమవారం

అందరికి కృతజ్ఞతా వందనాలు...!!.

నేస్తం,
         ముక్కుమొహం తెలియని ఎందరో ఉన్న కొద్దిపాటి పరిచయంలోనే కాసింత ఆత్మీయతను అందిస్తారు. నీతులు చెప్తూ కోతలు కోసే చాలా మంది మాత్రం కనీసం ఓ మాట అడగడానికి కూడా తమ సమయాన్ని వృధా చేసుకోరు. ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా పలకరింపుకి ఓ క్షణం సరి పోతుంది. ఎవరి జీవితాలు వారివి అయినా అనుబంధాలను మర్చిపోకుండా ఎప్పుడో ఒకసారి అయినా మన గత జ్ఞాపకాలు గుర్తుకి వచ్చినా, లేదా మనం పొందిన సాయం గుర్తు చేసుకున్నా చిన్న పలకరింపు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆపదలో కనీసం పలకరింపుకి నోచుకోని స్నేహాలు, బంధుత్వాలు ఎందుకు..? జనంలో ఉంటున్నామో, జనారణ్యంలో ఉంటున్నామో తెలియని రోజులుగా ఇప్పటి మనిషి నైజాలు మనల్ని అయోమయంలో పడవేస్తున్నాయి. డబ్బు అనేది అవసరానికి పనికి వస్తుంది కానీ అన్ని తీసుకురాలేదు. అలానే మనం ఓ మాట చెప్పాలి అనుకుంటే ముందు మనం అది ఆచరించి తరువాత చెప్తే బావుంటుంది. దేవుడు నాకిచ్చిన ఎంతో మంది ఆత్మీయుల ముందు ఒకటి అరా తక్కువైనా ఆ లోపాన్ని నాకు తెలియనీయకుండా నన్ను అభిమానించే అందరికి కృతజ్ఞతా వందనాలు.

2009 డిసెంబర్ లో మొదలైన నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 1300 పై చిలుకు పోస్టులు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోనికి అడుగు పెడుతున్న సందర్భంలో నన్ను నా కబుర్లను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.

4, డిసెంబర్ 2016, ఆదివారం

సడి చేయని...!!

ఎప్పటివో జ్ఞాపకాలు రెక్కలు కట్టుకుని
పలకరించడానికి పయనమయ్యాయి

మనసు పరిచిన మౌనాల అన్వేషణలో
గాయాల గీతం 'సు'దూరంగా వినిపిస్తోంది

కలలాంటి వాస్తవం కాదననీయకుండా
కాలంతో పాటుగా కళ్ళ ముందు కనిపిస్తోంది

చెమరించిన రెప్పల చెలమకు చేరువైన
తుషారాలు తుళ్ళుతూ జారుతున్నాయి

సడి చేయని గుండె సవ్వడిని వినాలని
ఆత్రపడే ఆత్మీయత అక్షరాల్లో అమరింది...!!

2, డిసెంబర్ 2016, శుక్రవారం

గుప్పెడు గుండె సవ్వడులు...!!

కనిపించే క్షణాల వెనుక
కనిపించని ఆంతర్యాల కథనాలు

మిడిసిపడే అహాల చాటున
ముడుచుకున్న ముగ్ధత్వాలు

దూరాల దాయాదుల పోటీలో
వెంటపడే వెతల కతల సంకలనాలు

గురుతులను గువ్వలుగా పేర్చిన
గుప్పెడు గుండె సవ్వడులు

నా వెన్నంటి ఉండే అక్షరాలకు
ఆటవిడుపుగా ఈ కవితా కన్నియలు...!!

1, డిసెంబర్ 2016, గురువారం

వెలుగు రేఖల కోసం....!!

గత జన్మలోని శాపాలు
ఈ జన్మ బంధాలుగా చుట్టుకుని
రేయి పగలు లేని జీవితానికి
మధ్యలో తావిచ్చిన కన్నీళ్ళను
అక్కున చేర్చుకుని సేదదీరాలన్న
తపనను తాకట్టుగా మార్చుతూ
మరో అధ్యాయానికి తెరను తీస్తూ
రాబోయే సంతసాలపై భరోసాతో 
ఆత్మీయతల అంకురార్పణకు ఏతెంచే
వెలుగు రేఖల కోసం ఎదురుతెన్నులు...!!

మేము దేశ భక్తులం కాదు కదా..!!

మొత్తానికి మన దేశ భక్తులకు మరో విషయం ఈపాటికి తేటతెల్లమై ఉంటుంది కదా. నల్ల ధనంపై యుద్దమని చెప్పి నోట్ల రద్దుకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ బాబుల అప్పులు రద్దు చేశారు. పంటలు నష్టపోయిన రైతుల ఋణాలు మాత్రం వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. నోరు కట్టుకుని కాస్తో కూస్తో కూడబెట్టుకున్న సొమ్ముకి కన్నాలు వేశారు తెలివిగా. మరి ఎంత నల్ల ధనం చేరిందో అని మనం అడిగితే ఆ లెక్కలు మళ్ళి ఎన్నికల తరువాత చెప్తాము అంటూ స్టేట్మెంట్ ఇస్తారేమో. మన రూపాయికి దొంగ నోట్లు వస్తున్నాయి, మరి డాలర్ కి నకిలీ రాకుండా వాళ్ళు తీసుకునే జాగ్రత్త మనం ఎందుకు చేయలేక పోతున్నాం. దేశాలు జనం సొమ్ముతో తిరగడం కాదు, కొద్దిగా అయినా సామాన్యులకు న్యాయం చేయాలి. చిల్లర కష్టాలు సామాన్యులకు షరా మామూలే. మళ్ళి కొత్తగా ఈరోజు నల్ల బంగారంపై వేటు అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనీసం ఒక్కరికైనా వేరే ఆలోచన రావడం లేదా. మనం ఎంతో గొప్పగా భారత దేశం పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది అని ఎదురు చూస్తున్నాం. దొంగనోట్లు అరికట్టడానికి ఉన్న నోట్లు రద్దు చేశారు. కాలం నుంచి ఉన్న బంగారానికి లెక్కలు చూపమని అడగడానికి మరి ఏ సాకులు చెప్పి జనాన్ని నమ్మిస్తారో. సామాన్యులు కూడబెట్టుకునే సొమ్ముకు లెక్కలు అడగడం మానేసి నాయకుల ఖజానాలు నింపుకునే మార్గాలు బానే అన్వేషిస్తున్నారు రాజకీయ చాణుక్యులు. జనాలను వాళ్ళు చేసే మోసాల నుంచి దారి మళ్ళించడానికి ఈ రద్దు సూత్రాలు రుద్దుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే మేము దేశ భక్తులం కాదు కదా -:)
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner