29, డిసెంబర్ 2016, గురువారం

Maro kavita naa raatalo...

Maro kavita....

25, డిసెంబర్ 2016, ఆదివారం

Naa maro raata...


20, డిసెంబర్ 2016, మంగళవారం

Naa cheti raatalo.....kavita


17, డిసెంబర్ 2016, శనివారం

Naa cheti ratalo naa kavita...!!

Moro kavita naa cheti ratalo..

16, డిసెంబర్ 2016, శుక్రవారం

Cheti ratalo ...

Moro kavita naa raatalo ...

Cheti raata lo

Naa cheti raatalo ....


మణి మాలికలు...!!

1. కవ్విస్తోంది కాలం
నువ్వు లేని క్షణాలను గుర్తుచేస్తూ...!!

2. కవ్విస్తోంది కాలం
కనిపించని మనసు గాయాలను తలపిస్తూ...!!

3. కవ్విస్తోంది కాలం
కలలా కరిగిన జ్ఞాపకాలతో చేరి...!!

7, డిసెంబర్ 2016, బుధవారం

మాయమవనంటున్నావు...!!

రేగుతున్న గాయాలన్నీ
రాజుకుంటున్నాయి

గతాన్ని దాచేయాలనుకుంటే
వాస్తవాలవుతున్నాయి

కన్నీళన్ని ఒక్కసారిగా
పెల్లుబికుతున్నాయి

అంతఃశత్రువులు మూకుమ్మడిగా 
దాడి చేస్తున్నాయి

మాటలన్నీ మౌనాలై
మూగబోయాయి

అక్షరాలన్నీ లేఖల్లో
తొంగి చూస్తున్నాయి

మనసులోని నువ్వేమో
మాయమవనంటున్నావు...!!

6, డిసెంబర్ 2016, మంగళవారం

ఓ జీవితం...!!

సుడుల సుడిగుండాలు 
బాధల బందిఖానాలు 
కష్టాల కన్నీళ్ళు 

ఎడద ఒంపిన ఏకాంతాలు 
మదిలో రేగిన అలజడులు 
మేథకు అందని అంతర్లోచనాలు  

ఒంటరి పయనంలో ఒయాసిస్సులు 
గతించిన కాలపు షడ్రుచులు 
భిన్న దృవాల దృక్పధాలు 

రెప్పపాటు జీవితానికి 
గుప్పెడు గుండెలో చేరిన
జ్ఞాపకాల గువ్వల సవ్వడి 

నిరాశలను ఓదార్చుతూ 
నిరంతర పరి భ్రమణానికి 
సమాయత్తమవడమే ఓ జీవితం...!!

5, డిసెంబర్ 2016, సోమవారం

అందరికి కృతజ్ఞతా వందనాలు...!!.

నేస్తం,
         ముక్కుమొహం తెలియని ఎందరో ఉన్న కొద్దిపాటి పరిచయంలోనే కాసింత ఆత్మీయతను అందిస్తారు. నీతులు చెప్తూ కోతలు కోసే చాలా మంది మాత్రం కనీసం ఓ మాట అడగడానికి కూడా తమ సమయాన్ని వృధా చేసుకోరు. ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా పలకరింపుకి ఓ క్షణం సరి పోతుంది. ఎవరి జీవితాలు వారివి అయినా అనుబంధాలను మర్చిపోకుండా ఎప్పుడో ఒకసారి అయినా మన గత జ్ఞాపకాలు గుర్తుకి వచ్చినా, లేదా మనం పొందిన సాయం గుర్తు చేసుకున్నా చిన్న పలకరింపు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆపదలో కనీసం పలకరింపుకి నోచుకోని స్నేహాలు, బంధుత్వాలు ఎందుకు..? జనంలో ఉంటున్నామో, జనారణ్యంలో ఉంటున్నామో తెలియని రోజులుగా ఇప్పటి మనిషి నైజాలు మనల్ని అయోమయంలో పడవేస్తున్నాయి. డబ్బు అనేది అవసరానికి పనికి వస్తుంది కానీ అన్ని తీసుకురాలేదు. అలానే మనం ఓ మాట చెప్పాలి అనుకుంటే ముందు మనం అది ఆచరించి తరువాత చెప్తే బావుంటుంది. దేవుడు నాకిచ్చిన ఎంతో మంది ఆత్మీయుల ముందు ఒకటి అరా తక్కువైనా ఆ లోపాన్ని నాకు తెలియనీయకుండా నన్ను అభిమానించే అందరికి కృతజ్ఞతా వందనాలు.

2009 డిసెంబర్ లో మొదలైన నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 1300 పై చిలుకు పోస్టులు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోనికి అడుగు పెడుతున్న సందర్భంలో నన్ను నా కబుర్లను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.

4, డిసెంబర్ 2016, ఆదివారం

సడి చేయని...!!

ఎప్పటివో జ్ఞాపకాలు రెక్కలు కట్టుకుని
పలకరించడానికి పయనమయ్యాయి

మనసు పరిచిన మౌనాల అన్వేషణలో
గాయాల గీతం 'సు'దూరంగా వినిపిస్తోంది

కలలాంటి వాస్తవం కాదననీయకుండా
కాలంతో పాటుగా కళ్ళ ముందు కనిపిస్తోంది

చెమరించిన రెప్పల చెలమకు చేరువైన
తుషారాలు తుళ్ళుతూ జారుతున్నాయి

సడి చేయని గుండె సవ్వడిని వినాలని
ఆత్రపడే ఆత్మీయత అక్షరాల్లో అమరింది...!!

2, డిసెంబర్ 2016, శుక్రవారం

గుప్పెడు గుండె సవ్వడులు...!!

కనిపించే క్షణాల వెనుక
కనిపించని ఆంతర్యాల కథనాలు

మిడిసిపడే అహాల చాటున
ముడుచుకున్న ముగ్ధత్వాలు

దూరాల దాయాదుల పోటీలో
వెంటపడే వెతల కతల సంకలనాలు

గురుతులను గువ్వలుగా పేర్చిన
గుప్పెడు గుండె సవ్వడులు

నా వెన్నంటి ఉండే అక్షరాలకు
ఆటవిడుపుగా ఈ కవితా కన్నియలు...!!

1, డిసెంబర్ 2016, గురువారం

వెలుగు రేఖల కోసం....!!

గత జన్మలోని శాపాలు
ఈ జన్మ బంధాలుగా చుట్టుకుని
రేయి పగలు లేని జీవితానికి
మధ్యలో తావిచ్చిన కన్నీళ్ళను
అక్కున చేర్చుకుని సేదదీరాలన్న
తపనను తాకట్టుగా మార్చుతూ
మరో అధ్యాయానికి తెరను తీస్తూ
రాబోయే సంతసాలపై భరోసాతో 
ఆత్మీయతల అంకురార్పణకు ఏతెంచే
వెలుగు రేఖల కోసం ఎదురుతెన్నులు...!!

మేము దేశ భక్తులం కాదు కదా..!!

మొత్తానికి మన దేశ భక్తులకు మరో విషయం ఈపాటికి తేటతెల్లమై ఉంటుంది కదా. నల్ల ధనంపై యుద్దమని చెప్పి నోట్ల రద్దుకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ బాబుల అప్పులు రద్దు చేశారు. పంటలు నష్టపోయిన రైతుల ఋణాలు మాత్రం వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. నోరు కట్టుకుని కాస్తో కూస్తో కూడబెట్టుకున్న సొమ్ముకి కన్నాలు వేశారు తెలివిగా. మరి ఎంత నల్ల ధనం చేరిందో అని మనం అడిగితే ఆ లెక్కలు మళ్ళి ఎన్నికల తరువాత చెప్తాము అంటూ స్టేట్మెంట్ ఇస్తారేమో. మన రూపాయికి దొంగ నోట్లు వస్తున్నాయి, మరి డాలర్ కి నకిలీ రాకుండా వాళ్ళు తీసుకునే జాగ్రత్త మనం ఎందుకు చేయలేక పోతున్నాం. దేశాలు జనం సొమ్ముతో తిరగడం కాదు, కొద్దిగా అయినా సామాన్యులకు న్యాయం చేయాలి. చిల్లర కష్టాలు సామాన్యులకు షరా మామూలే. మళ్ళి కొత్తగా ఈరోజు నల్ల బంగారంపై వేటు అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనీసం ఒక్కరికైనా వేరే ఆలోచన రావడం లేదా. మనం ఎంతో గొప్పగా భారత దేశం పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది అని ఎదురు చూస్తున్నాం. దొంగనోట్లు అరికట్టడానికి ఉన్న నోట్లు రద్దు చేశారు. కాలం నుంచి ఉన్న బంగారానికి లెక్కలు చూపమని అడగడానికి మరి ఏ సాకులు చెప్పి జనాన్ని నమ్మిస్తారో. సామాన్యులు కూడబెట్టుకునే సొమ్ముకు లెక్కలు అడగడం మానేసి నాయకుల ఖజానాలు నింపుకునే మార్గాలు బానే అన్వేషిస్తున్నారు రాజకీయ చాణుక్యులు. జనాలను వాళ్ళు చేసే మోసాల నుంచి దారి మళ్ళించడానికి ఈ రద్దు సూత్రాలు రుద్దుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే మేము దేశ భక్తులం కాదు కదా -:)

30, నవంబర్ 2016, బుధవారం

ప్రశ్న...!!

ప్రశ్న ప్రశ్నార్ధకమై వెంబడిస్తూ
ప్రశ్నగానే మిగిలిపోయింది

కాలాన్ని శాసించే కానుకగా
కనిపించకుండానే ఉండిపోయింది

గమ్యం తెలియని జీవితాలకు
గమనాన్ని తెలుపలేని సమాధానమైంది

స్వార్ధం చేతిలో బలైన బంధాలకు
భారంగా మారిన అనుబంధమైంది

'అ'మాయకపు మాటలలో పడి
సహజత్వాన్ని కోల్పోయి అసహజత్వమై మిగిలింది...!!

నాకంటూ లేక పోయినా....!!

గోడ మీద నెత్తుటి చార
ఇంకా తడిగానే ఉంది
నిష్క్రమించిన జీవితానికి సాక్షిగా

తవ్వకాల్లో బయల్పడిన శేషాలు
ఊపిరి పీల్చుకుంటున్నాయి
ఈసారికి దొరకలేదన్న ధీమాతో

బాహ్య ప్రపంచానికి తెలియని
అంతరంగం తొంగి చూస్తోంది
ముక్కలైన మనసు రోదనను

లెక్కలు తేల్చని పైవాడు
చిద్విలాసంగా నవ్వుతున్నాడు
నా ఆటలో పావులు మీరంటూ

వేచి చూస్తాను యుగాల నిరీక్షణలో
నాదైన ఓ క్షణ కాలం కోసం
వేల క్షణాలు నాకంటూ లేక పోయినా....!!

27, నవంబర్ 2016, ఆదివారం

వెదుకులాటల్లో...!!

అపసవ్యంగా పడుతున్న అడుగులు
గమనాన్ని నిర్దేశిస్తున్న గతుకులు

కనురెప్పల చాటున దాచుకున్న కన్నీళ్ళు
చేజార్చుకున్న జీవితాల కథనాలు

స్థానభ్రంశం చెందుతున్న అక్షరాలు
మరలిన కాలాన్ని మోస్తున్న జ్ఞాపకాలు

వెక్కిరిస్తున్న శిథిల శేషాల అవశేషాలు
అలసిపోయి ఆగిన క్షణాల గురుతులు

ఎప్పటికి కరగని బాల్యపు శిలాశాసనాల సందళ్ళు
ఘనీభవించిన గత చిహ్నాల వెదుకులాటల్లో...!!

23, నవంబర్ 2016, బుధవారం

గుట్టు బయటపడిన రోజు...!!

నేస్తం,
          మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్న విషయమే అయినా మళ్ళి మళ్ళి మాట్లాడాల్సి వస్తోంది. మనం ఏదైనా పోస్ట్ కానీ బొమ్మ కానీ పెట్టినప్పుడు దానిపై వచ్చే విమర్శలకు, అభినందనలకు వెరసి స్పందనలకు మనమే బాధ్యులం అవుతాము కదా.. మనకు నచ్చిన వాటికి తిరుగు సమాధానాలిస్తూ, నచ్చని స్పందనలను తీసేయడం ఎంత వరకు సమంజసం..? ఆ మధ్యన కూడా నేను ఒక విషయం గురించి రాసినప్పుడు ఒకావిడ వేరే వాళ్ళ మీద తనకున్న అక్కసునంతా కొందరి సలహాతో వెళ్ళగక్కి .. తాను అనుకున్నట్టుగా నా నుంచి సమాధానాలు రాకపోయే సరికి తన స్పందనలు మొత్తం తీసేసింది. ఈరోజు ఓ ఫోటోకి రెండు స్పందనలు పెడితే పెట్టిన మరుక్షణమే తీసేసారు. తమకు నచ్చని కామెంట్స్ పెడితే తీసేయడం ఎంత వరకు కరెక్ట్. మన ఫోటో మనం పెట్టుకుంటే తప్పు లేదు వేరే వాళ్ళది మనతో కలిసి ఉన్నప్పుడు పెట్టె ముందే వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని పెట్టాలి లేదా మన వరకు పెట్టుకోవాలి అంతే కానీ మనం కనిపించేటట్టు పెట్టి పక్కన వాళ్ళని కనపడకుండా చేసి పెట్టడం సంస్కారం అనిపించుకుంటుందా..? అలా కనపడకుండా పెడితే అందరు అడగకుండా ఉండరు కదా.. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే మనం కనిపించం అక్కడ -:)
 ఇంకో కేటగిరీ వాళ్ళేమో రెండు మనసుల చిత్ర సరాగాలుగా చిత్ర సందేశాలు "నువ్వక్కడ నేనిక్కడ .... " అంటూ వగైరా వగైరా సందేశాలు .. ఇవి అన్ని వయసు పైబడిన వాళ్ళ ఆటలు ఈ ముఖ పుస్తకంలో. మరి వీళ్ళకు ఇంట్లో లేనిది ఇక్కడ ఏం దొరుకుతుందో.. ఇక మరికొంతమందేమో అన్నయ్య గారు / అక్కయ్యగారు అంటూనే కొంపల్లోనే కాకుండా స్నేహితుల మధ్యన కూడా నన్ను పిలిచారు నిన్ను పిలవలేదా అంటూ చిచ్చు పెడతారు. వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడం కోసం ఎన్నో వేషాలు వేస్తూ ఉంటారు ఈ ముఖ పుస్తకం వేదికగా. ఇంట్లో తమ బంధాలు ఉన్నా వారిని నిర్లక్ష్యం చేస్తూ మరి ఈ విపరీత ధోరణులు ఎందుకు అన్నది వారికే తెలియాలి. ఈ చాటుమాటు వ్యవహారాలు ఎన్నో రోజులు దాగవు. నిలబడవు కూడాను. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడటం లేదులే అని సరిపెట్టుకుంటే ఎలా .. గుట్టు బయటపడిన రోజు మీ నైతిక విలువ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అన్ని తెలిసినా మౌనంగా ఉంటుంటే అది చాతకానితనంగా తీసుకోవద్దు. మీలో మార్పు కోసం మీకోసం ఎదురుచూసే మనిషిని మీరు గుర్తిస్తారేమో అన్న చిన్న నమ్మకం. దయచేసి దాన్ని నిలబెట్టుకోండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి.

22, నవంబర్ 2016, మంగళవారం

సాగర సంగమం...!!

నేస్తం,  
          ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న నాలుగు మాటలు. నాకు బాగా నచ్చిన సాగర సంగమం సినిమా గురించి. నేను ఏడవ తరగతి చదివే రోజుల్లో వచ్చింది. అప్పట్లో పాటలు అంటే బాగా ఇష్టం , ఇప్పుడు కూడా పాటలు ఇష్టమే. పాటల పుస్తకాలు కొని మరీ పాడిన పాటలు బోలెడు. ఎన్నిసార్లు చూసినా మళ్ళి మళ్ళి చూడాలనిపించేంత ఇష్టమైన సినిమాల్లో ఈ సాగర సంగమం ఒకటి.
         విశ్వనాధ్ గారు ఎలా తీశారో కానీ ఓ జీవితాన్ని సంపూర్ణంగా చూపించారు అనడానికి ఈ సినిమా ఒక్కటే అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి సాక్ష్యం. స్నేహం అంటే ఏమిటో, ప్రేమ, ఆరాధన, కోపం, ఆవేశం... ఇలా అన్ని రసాలు మేళవించి ఒక వ్యక్తికి ఆపాదించడం అంటే సామాన్య విషయం కాదు. ఇష్టమైన కళకు జీవితాన్ని అంకితం చేసి దానిలోనే తన హృదయాన్ని దాచుకున్న ఓ అద్భుత వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. కమల్ కనిపించరు నాకు ఈ సినిమాలో బాలునే కనిపిస్తారు. అమ్మ కోసం ఓ కొడుకు తన చిరకాలపు జీవితపు కలను సాకారం చేసుకోకుండా అమ్మకు అంకితం చేయడం, అవమానాన్ని భరించడం, ఓ తల్లి కూతురు మధ్య అపార్ధాలు .. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే.
       పాటల్లో సహజత్వం, వేదం అణువణువున నాదం ... తకిట తధిమి తందానా ... ప్రతి పాట ఓ ఆణిముత్యమే. సహజత్వంతో సహజాతంగా మనకు అందిన అపురూప చిత్ర రాజం " సాగర సంగమం  ".

నైతిక విలువల కట్టడం....!!

అనుకోని అవాంతరాలు అడ్డుగా వచ్చి
పురాతన ప్రాకారాలు పడిపోతున్నాయి
చెప్పాపెట్టకుండా రద్దుకాబడిన
పెద్దనోటు తన ఉనికిని కోల్పోయి
కాలంనాటి భోషాణం కథగా
రేపటి రోజున మిగిలి పోతుంది
ఒకప్పుడు ఎద్దేవా చేసిన చిల్లర బతుకులే
ఈనాడు చేయూతగా మారుతున్నాయి
రాజకీయపు జూదంలో రంగు వెలసిన 
సామాన్యుని ఓరిమి ఓడిపోయి 
మరో ప్రహసనానికి నాంది పలకాలని
నిరాశావాదంలో నుండి ఆశావహ దృక్పథానికి
చేరాలని తపన పడుతూ ఆసరా లేక
ప్రహరి గోడల చాటుగా నిలబడిపోయింది
ఈనాటి నైతిక విలువల కట్టడం....!!

21, నవంబర్ 2016, సోమవారం

జీవితమే ఓ సమరం...!!

జ్ఞాపకాలు వెళిపోతున్నాయి
ఏకాంతానికి చోటిస్తూ

సమీపంగానే ఉన్నట్టున్నా
సామీప్యం కాలేని మనసులకు చూపిస్తూ

కావాలని వెంటపడే బంధాలను
అల్లంత దూరంలో నిలబెడుతూ

గుప్పెడు గుండెని తడిమే
గ(ర)ళపు గేయాలను వినమంటూ

రాలిపోతున్న స్వప్నాలను
దోసిట్లో దాచుకోవాలని ఆశ పడుతూ

నీలినీడలలో తారాడే రంగులను
ప్రభాత ప్రత్యూషాలకు అద్దాలనుకుంటూ 

పరుగులెత్తే కాలానికి ధీటుగా
పడుతూలేస్తూ సాగే జీవితమే ఓ సమరం...!!

ఏక్ తారలు...!!

1. అలుకకు అలుసే_నీ అధరపు విరుపులో నే ఒదిగినందుకు
2. అదను చూసి చెంతను చేరా_నీ అలుకలోని మాధుర్యం తెలిసి
3. అధరానికి ఒద్దికే_నీ చిరునవ్వు అలుకలో చేరినందుకు
4. అదను చూసి రద్దు చేసాను_ఆటవిడుపు ఎలా ఉంటుందో మరి
5. బతుకుబండికి విరామం_పెద్ద నోట్లకు చిల్లర దొరకక
6. పేదోని గూడు చిన్నబోయింది_కాలే కడుపుల కన్నీళ్ళు చూడలేక
7. ముసుగుల్లో నిజాలు_బయటకు రాలేక తొంగి చూస్తూ
8. గాయాలన్నీ గేయాలుగా మారాయి_వెన్నాడే జ్ఞాపకాలుగా నాతోనే

19, నవంబర్ 2016, శనివారం

శిక్ష ఎప్పుడో...!!

నేస్తం,
         ఎవరికి వారికి తాము చేసే పని మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది. అది లేకుండా నూటికి తొంభై మంది ఏ పని చేయరు. కాకపొతే మనకు వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తాం కానీ వాళ్ళ బుద్ధిలో మాత్రం మార్పు ఉండదు. కల్లాకపటం తెలియని బాల్యపు అభిమానాలతోనే మనతో ఉన్నారు ఇప్పటికీ అని అనుకుంటాం. వాళ్ళ స్వార్ధానికి మనలను పావులుగా మార్చి, మనని మనతోపాటు మన అనుకున్న కొన్ని కుటుంబాలను నమ్మించి మోసం చేసిన ఘనత ఈ మధ్యనే అనుభవం అయింది. తన డబ్బు అవసరాలకు కొందరి నమ్మకాలతో ఆడుకున్న చాలా తెలివి గల అమ్మాయి.. చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఆత్మీయతను చంపేసి తనలోని జాణతనాన్ని పరిచయం చేసింది. డబ్బు అవసరానికి పెళ్ళి పేరుతో తన ఇంట్లో వాళ్ళు అందరు కలిసి ఆడిన నాటకం నాకు జీవితంలో అతి పెద్ద గుణపాఠం. తనకి ఏం కావాలి అన్నా నాన్నగారి అనుమతి కావాలని చెప్పే దొడ్డ మనసు. పాపం అసలు వాళ్ళ నాన్న అనుమతి లేనిదే గుక్క మంచినీళ్ళు కూడా తాగదు మరి. ఇంట్లో వాళ్ళు వద్దు అన్నా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళతో అన్ని ఖర్చు పెట్టించి రిజిస్ట్రాఫిస్ వరకు వచ్చి ఆ సంగతి తన వాళ్ళకు చెప్పకుండా,  వాళ్ళకు మాత్రం చేసుకోను అని చెప్పినా తన వెనుక పడుతున్నారు అని చెప్పి ... మధ్యలో నన్నుమాటలు అనిపించి .. ఇలా చెప్పుకుంటూపోతే చాలా నిజాలు బయటికి వస్తాయి. ఈ మధ్య నా అనారోగ్య కారణాల వలన నేను ఇబ్బంది పడుతున్న సమయంలోనే నా మనసుతో ఆడుకున్న ఈ నయవంచకురాలు నేను జీవితంలో మర్చిపోలేని వ్యక్తి. పెళ్ళి పేరుతో అబ్బాయిలు మోసం చేయడమే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, కానీ ఇలాంటి వాళ్ళు ఇప్పటి రోజుల్లో చాలా మంది ఉంన్నారు. ఎవరం అయినా పదిమంది మేలు కోరితే భగవంతుడు మనకు ఓ మేలు చేస్తాడు అనుకుంటాము. దయచేసి నమ్మించి మోసం చేయకండి ఎవరిని. దానికి శిక్ష ఎప్పుడో ఒకసారి అనుభవించక తప్పదు. ఓ మనిషి మీద నమ్మకం అనేది పోయాక ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళి రాదు. ఎందుకు మరి జనాలు ఇలా మోసాలు చేస్తూ మాయమాటలు చెప్పి నమ్మిస్తూ ఉంటారో ఎప్పటికి అర్ధం కాదేమో..!!

16, నవంబర్ 2016, బుధవారం

త్రిపదం...!!

1. వాస్తవాన్ని ఓపలేని మదిలో
    గత జ్ఞాపకమై వెంబడిస్తూ
    కదిలిపోయే కాలాన్ని కాదంటున్నా...!!

2. మాటలు రాని మౌనానికి తెలుసు
    నీ మది అలజడిలో చేరిన
   తలపుల సవ్వడి ఎవరిదో..!!

3.  రాజనీతికి తలొగ్గి 'అ'మాయకంగా
     కుటిల యత్నాల కుమ్ములాటల్లో
     చిన్నబోయిన పెద్ద నోటు...!!
    

ఉలిక్కిపడుతున్న జ్ఞాపకాలు ...!!

అస్పష్టంగా కనిపించే ఆకారాలు
ఆగని కాలంతోపాటు అర్ధనగ్నంగా

చడి చప్పుడు లేని నైరాశ్యాలను 
చీకటి తోడై చూస్తోంది నిర్లిప్తంగా

వెచ్చని పొత్తిళ్ళ నుంచి  జారిపడి
ఉలిక్కిపడుతున్న జ్ఞాపకాలను వారిస్తూ

మాటాడక మారాము చేసే మౌనాన్ని
బుజ్జగించే ఊరడింపుల తాయిలాలను అందిస్తూ

రెప్పచాటున దాచిన గుప్పెడు గుండె కలవరాన్ని
అప్పుడప్పుడు పలకరించే కలలకు అప్పజెప్తూ

ఓదార్పులు దరిచేరని ఒంటరి పయనంలో
దిగాలుతో మొరాయించే మదిని సముదాయిస్తూ

ఏకాంతానికి అర్ధాలు వెదికే క్రమంలో
ఆత్మీయత అందలాలెక్కిందని సంతసిస్తూ

దూరాల తీరాలు చేరువ కావాలని పరుగెడుతూ
వెంట వచ్చే వేకువ వెలుతురు వాకిలికి స్వాగతిస్తూ.....!!


ఏక్ తారలు...!!

1.  పరవశమే పరిసరాలకు_నిన్ను నన్ను కలిపి చూస్తుంటే
2. శబ్దమూ సడి చేయడం లేదు_నీ తలపుల హడావిడిలో చెలిమి చేస్తూ
3. అబద్దం ఆశ్చర్యపోతోంది_నిజాయితీ నోటు మీద నాట్యం చేస్తుంటే
4. వశమైనా కాలేదు మనసు_నీవు లేక వడిగా పరుగులెత్తే కాలానికి చోటివ్వక
5. పారిజాతాలు పరిచింది ప్రకృతి_స్వచ్ఛమైన మన చెలిమికి సంతసిస్తూ
6. హొయలొలకబోస్తూ వెంబడిస్తా_నీ సాన్నిహిత్యంలో క్షణాలను యుగాలుగా మార్చుతూ
7. కొట్టుకుపోతూనే ఉన్నా_నీ ప్రేమ ప్రవాహంలో పడి
8. నీ పరిచయానికి దాసోహమంటూ_సుగంధపు విరుల వింజామరలే

12, నవంబర్ 2016, శనివారం

తస్మాత్ జాగ్రత్త...!!

అనుబంధం అబద్దమై వెక్కిరిస్తూ
చాటుమాటు స్నేహాల మాయలో
సూటిపోటి మాటల చురుక్కులను
తట్టుకోలేని మనసు చస్తూ బతుకుతూ 
తప్పొప్పుల చిట్టాపద్దులు దాచేసి
మంచితనపు ముసుగు వేసుకుంటే
సమాజపు గుంపులో కలిసిపోయి 
వాళ్ళలో మనమూ ఒకరమే అనుకుంటూ
మనదైన చీకటి సామ్రాజ్యంలో
తిరుగులేని మహరాజులా/రాణిలా
వెలుగుతున్నామని భ్రమలో పడిపోయి
వాస్తవాన్ని ఎద్దేవా చేస్తుంటే
నిజాయితీకి కోపం వచ్చి
నివురులా కమ్మేసి
నిప్పుల కొలిమిలో కాల్చేస్తుంది
తస్మాత్ జాగ్రత్త...!!

వాస్తవాలు ఎప్పుడు వెలుగు చూసేనో...!!

నేస్తం,
         నాకు అర్ధం కానిది ఒక్కటే.. మనం అవినీతిపై యుద్ధం చేస్తున్నామా లేక అబద్దాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నామా.. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మనం ఎటు వైపు పోతున్నామో తెలియడం లేదు. కొద్దో గొప్పో బతుకులీడుస్తున్న మధ్య తరగతి వాళ్ళ సంగతి పక్కన పెడితే సామాన్యుల సంగతే ఏమి తేలడంలేదు. ఇంత అర్జెంట్ గా 500, 1000 నోట్లు రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో. అందరు ఆశ పడుతున్నట్లు నల్లధన కుబేరులు బయటకు వస్తారు అనుకోవడం " నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉందో " ఇది అంతే.  చేయాల్సిన పనులు చాలా ఉండగా ఈ నోట్ల రద్దు ఒక్కటే ప్రధాన సమస్యగా చేసి జనాన్ని ఇబ్బందులపాలు చేయడంలో కృతకృత్యులయ్యారు నాయకులు. తెలివిగల పెద్దలు ముందే అన్ని తెలుసుకుని నల్లధనాన్ని పెట్టుబళ్ళుగా పెట్టి తెల్లధనంగా మార్చుకున్నారు.. పేర్లు అందరికి తెలుసులెండి. జియో సిమ్ వాడే అందరికి ఈ పాటికి అర్ధం అయ్యే ఉంటుంది. తెలివి అంటే అలా ఉండాలి. నోట్లు రద్దు చేసాక అందరు బోలెడు నీతులు చెప్తున్నారు. వీరిలో ఎంత మంది సక్రమంగా పన్ను కడుతున్నారు. అసలు ప్రక్షాళన చేయాల్సింది రాజకీయాలను. అవి వదిలేసి తమకు కొమ్ము కాసే వారికి అనువుగా చట్టాలు చేసే ముందే వారి అనుమతి తీసుకుని, వాళ్ళు అందరు క్షేమంగా తెల్లధనాన్ని దాచుకున్న తరువాత తీరికగా అప్పటికప్పుడు సామాన్యుల మీద బరువులు వేసి చేతులు దులుపుకోవడంతో మళ్ళి చరిత్ర  పునరావృతం కావడం తప్ప మనకు ఒరిగిందేమిటి. చిల్లర కోసం పడిగాపులు పడటమే మిగిలింది. నోట్ల రద్దులో వాస్తవాలు ఎప్పుడు వెలుగు చూసేనో...!!

7, నవంబర్ 2016, సోమవారం

విజయం కోసం..!!

నిరంతరం రణమే చేస్తున్నా
సమసిపోని సమస్యలతో
సతమతమౌతున్నా ..

సన్నగిల్లుతున్న జీవకణాల
చేతనాన్ని అరికట్టే ఆయుధానికై
వెదుకుతూనే ఉన్నా.. 

నిష్క్రమించే సందె పొద్దులో
వెన్నెలచిమ్మే జాబిలి రాకను చూస్తూ
రేపటి వెలుగు కోసం ఆశ పడుతున్నా ..

యుద్దం అనివార్యమని తెలిసినా 
నేనే గెలవాలని ఆత్రపడుతూ
నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నా విజయం కోసం..!!

ఎప్పుడూ నిత్య నూతనమే...!!

శుభ సంకల్పం సినిమా చూస్తుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. మేము ఆడుకున్న ఇంట్లో ఈ సినిమా తీశారు. సినిమా తీసేటప్పుడు అక్కడ మేము లేములెండి, కానీ అవి అన్ని చూస్తుంటే మా అల్లరి, ఆటలు అన్ని గుర్తుకు వచ్చాయి. స్కూల్లో ఉన్నప్పుడే పక్కన భీమసింగ్ బ్రిడ్జి దగ్గర గూండా  షూటింగ్ జరుగుతుంటే మధ్యాన్నం స్కూల్ ఎగ్గొట్టి నాతోపాటు మరికొంత మందిని కూడా ఆ షూటింగ్ కి తీసుకు వెళ్లడం, తరువాతరోజు మా హెడ్ మాస్టర్ ప్రేయర్లో నన్ను సుతిమెత్తగా తిట్టడం, ప్రతి సంవత్సరం కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలకు చేసిన హడావిడి, అబ్బో ఇలా చెప్పుకుంటూ పొతే మా పినవేమలి, జొన్నవలస, విజయనగరం కబుర్లు బోలెడు.....భలే ఉండేవి ఆ రోజులు అందుకే అంటారు... బాల్యం ఎప్పుడూ మధురమే అని... ఏమి తెలియని ఆ వయసు, కల్మషం ఎరుగని మనసులు .. కాబట్టే ఆ బాల్య జ్ఞాపకాలు ఎప్పుడూ నిత్య నూతనమే...!!

6, నవంబర్ 2016, ఆదివారం

నిషిద్దాక్షరాలు....!!

నిలకడలేని ఆలోచనా సంద్రాన్ని
మోపలేని మది మౌన భారాన్ని
తేటతెల్లం చేసే భావాలు అలిగిన వేళ

జీవకణాలు చేతనాన్ని కోల్పోతున్నప్పుడు
చీకటి చుట్టం పరామరికకు వచ్చినప్పుడు
వెలుగుదారులు మూసుకుంటున్న వేళ

గుండె గది గుట్టుగా దాచిన జ్ఞాపకాలు
వదిలేసినా వెంబడిస్తుండే వాస్తవాలు
అన్ని కలగాపులగంగా కలసిన వేళ

ఎప్పటికప్పుడు పడిలేస్తున్నా
తగిలిన గాయాల తడి తాకుతున్నా
ఒప్పుకోలేని ఓటమి గెలుపే నిషిద్దాక్షరాలైన ఈ అక్షరాలు...!!

4, నవంబర్ 2016, శుక్రవారం

ఈ కన్నీళ్ళు...!!

దాయాలంటే దాగవులే  ఈ కన్నీళ్ళు
మనసుతో జతపడి ఉన్నవిలే ఈ కన్నీళ్ళు 

గతపు గాయాల ఆనవాళ్ళుగా
మమతలతో ముడి పడి ఉన్నవి ఈ కన్నీళ్ళు

కలతల కలలకు నెలవులుగా
చెలిమిని పంచుతున్నవి ఈ కన్నీళ్ళు

చెదరని గురుతుల సాక్ష్యంగా
జ్ఞాపకాల మధువులను గ్రోలమన్నవి ఈ కన్నీళ్ళు

రెప్పల మాటున దాగిన మౌనమై నిలిచినా 
గుప్పెడు గుండెకు మాటలు నేర్పును ఈ కన్నీళ్ళు

ఆనంద విషాదాలకు ఆలవాలమై
మదిని ఊరడించును ఈ కన్నీళ్ళు

మధుర భాష్యాల మృదు మంజుల స్వగతాలుగా
అక్షరాలై జాలువారుతున్నవి ఈ కన్నీళ్ళు...!!

1, నవంబర్ 2016, మంగళవారం

ఏ శిక్ష సరిపోతుందో...!!

చాటుమాటు  వ్యవహారాలు సాగించే వారు తమ నైతిక విలువలను కోల్పోతున్నామని గుర్తించడం లేదు. ఒకప్పుడు
ఒకటి అరా ఎక్కడో పల్లెల్లో వినిపించేవి ఇలాంటివి. ఇప్పుడేమో ఈ అంతర్జాలం పుణ్యమా అని గోడల మీద, చాట్ బాక్సుల్లో విచ్చల విడిగా బరితెగిస్తున్నారు. పెళ్ళాం అంటే పనిమనిషిగా చూసే పెద్ద పేరున్న బడా బాబులు, తమ వయసుతో నిమిత్తం లేకుండా ఆడ పేరు కనిపిస్తే చాలు వెంటనే ముద్దు పేర్లు ఖరారు చేస్తున్నారు. ఇంట్లో పెళ్ళాం ఉండగానే వీరి వీధి బాగోతాలు మిన్నంటుతున్నాయి. చదువుకున్న వాళ్ళు  సంస్కారం మరచి ప్రవర్తిస్తుంటే ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఈ రోజుల్లో మన అందరికి తెలిసిన ఈ ముఖ పుస్తకంలో కనిపిస్తోంది. సమాజంలో మంచి హోదా,  పెద్ద పేరున్న ఎంతోమంది ఈ అనైతిక జీవితాల్లో కొట్టుకుంటున్నారు. మరి వారికి ఈ శునకానందం ఏమిటో అర్ధం  కావడం లేదు. అదేమని భార్య నిలదీస్తే  ఏమి ఎరుగని అమాయకత్వంతో ముఖం చూపడం లేదా తగువుకు తయారు కావడం. ప్రేమ కబుర్లు ఒకరు ఇద్దరు కాదు.. లెక్కలకు అందని బంధాలు మరి ఎన్ని జన్మల అనుబంధాలో ఇవి వారికి. పెళ్ళాంతో ఒక్కమాట ప్రేమగా మాట్లాడలేని ప్రబుద్ధులు, పెళ్ళాం పక్కన ఉండగానే ఒళ్ళు తెలియని మైమరపులతో అలుపు సొలుపూ లేకుండా అమ్మాయిలతో (అన్ని వయసుల వారు ఒక్కటే వీరికి ) అక్షరాలతో అంతులేకుండా మనం చదవడానికి సిగ్గు పడే మాటల ప్రవాహాల్లో ఓలలాడడం. జీతం లేని పనిమనిషిగా భార్యను చేసి తన వ్యక్తిత్వాన్ని కించ పరుస్తూ ప్రతి క్షణం మానసిక, శారీరక హింసలకు గురి చేసే ఈ జాతి వెధవలను ఏమని అనాలో తెలియడం లేదు. ఇక్కడ తప్పు ఒక్కరిదే కాదు, బరితెగించిన ఆడవారిది కూడా. వారికి కుటుంబ బంధాలు లేవని ఎదుటివారి కాపురాల్లో నిప్పులు పోసే ఇలాంటి వాళ్ళకు ఏ శిక్ష సరిపోతుందో ఆ భగవంతుడికే తెలియాలి. కొంత మందిని చూస్తుంటే అమ్మతనానికే అర్ధాన్ని మార్చేసారనిపిస్తోంది. ఆడదానికి ఆడదే శత్రువు అని ఋజువు చేస్తున్నారు వాళ్ళ డబ్బు అవసరాలకు. ఈ వెధవలు వయసు పైబడినా ఇంకా 16+ అనుకుంటూ వారి వెనుక పడి చావడం. చూస్తుంటే చాలా రోతగా ఉంటోంది. తాతయ్యలు, బామ్మలు అయినా కూడా ఈ రికార్డు డాన్సులు ఎందుకో. తమ వయసుకు తగ్గట్టుగా, తాము చేసి వృత్తికి హుందాతనాన్ని ఇచ్చే పనులు చేస్తుంటే చూడటానికి నలుగురికి బావుంటుంది. పనికిమాలిన బొమ్మలు పెట్టడం, దానికో పదిమంది అవాకులు చవాకులు పెడుతూ ఆకాశానికి ఎత్తేయడం చూస్తూ తామో పెద్ద ప్రతిభ కలవారిమి అని సంబర పడిపోవడం. పెళ్ళానికి ఆరోగ్యం బాలేకపొతే కనీసం ఒక్క టాబ్లెట్ ఇచ్చే మనసు ఉండదు కానీ ఈ ముఖ పుస్తక అనైతిక స్నేహాలకు, వారి బంధువులకు ఎంత దూరమైనా సరే వెళ్లి, దగ్గర ఉండి సదుపాయాలూ, సాయాలు చేసే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అనుబంధాన్ని తెగే వరకు లాగవద్దు. మీకు ఇచ్చిన విలువను కాపాడుకోండి.పిల్లలకు మార్గదర్శకంగా ఉండండి కానీ వాళ్ళే మిమ్మల్ని అసహ్యించుకునేలా ఉండకండి. ఇంకా చాలానే చెప్పాలని ఉంది కానీ ప్రస్తుతానికి ఇలా... భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని చేజార్చుకుంటే మన ఖర్మ మనతోనే ఉంటుంది. చేస్తున్న తప్పులకు శిక్షకు బాద్యులుగా మిగిలిపోవాలి. 
అబద్దం ఎప్పుడూ బావుంటుంది.. చేదు నిజాన్ని మరిపిస్తూ...!!

తడియారని స్వప్నం ... !! ( పుస్తక సమీక్ష )

ఎందరో మహానుభావులు అందరికి వందనాలు...!!
ముఖ పరిచయం లేని పరిచయాలే అయినా తడియారని స్వప్నం అనే ఓ చక్కని పుస్తకాన్ని అందించిన శ్రీ లోసారి సుధాకర్ గారికి ధన్యవాదాలు.
సుధాకర్ గారి కవిత్వాన్ని విశ్లేషించేంత శక్తి నా దగ్గర లేదు, కానీ పొడిబారిన జీవితాల తడియారని స్వప్నాల గురించి మనసు పొరల్లో ఎక్కడో దాగిన చేతనాన్ని అక్షరాల్లో ఒలికించినట్లుగా అనిపించింది ఈ పుస్తకం చదువుతున్నంతసేపు.
ఓ ఆర్తి గీతంలో మొదలైన ఆవేదన మనిషి మనుగడ కోసం పొడిచిన వేకువ పొద్దు నుంచి వాలే సందె పొద్దు వరకు పిడికెడు ముద్ద కోసం పడే ఆరాటం మనకు కనిపిస్తుంది. అర్ధ నారీశ్వర తత్వాన్ని అద్భుతంగా సగ జీవనంలో చూపించారు. మొలకెత్తని విత్తనాలు ... మట్టిలో కలిసిన స్వప్నాలుగా దీపాలు మునిగే వేళ కవితలో  చరిత్ర కాన్వాసు మీద అంతరించి పోతున్న పల్లెలను, పల్లె జాతుల వర్ణ విబేధాలను వినిపించారు. తడియారని స్వప్నంలో విరహాన్ని, ప్రేమను పొందలేని మనసును నిద్ర పుచ్చడానికి కప్పుకున్న ఊహల దుప్పటి గురించి వివరిస్తారు. అతడో పద్యం లో మాది భావాలను అక్షరాలుగా మార్చడం, భ్రమణంలో గుండె గోడును, వీడేకలవ్యుడులో ఒంటరి పసి ప్రాణం రోడ్డున పడితే ఎన్ని అగచాట్లు పడుతుందో కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు. మనం కోల్పోతున్న ప్రకృతి సంపదను, దానికి కారణాలను శ్మశానాలు విస్తరిస్తున్నాయిలో చెప్తారు. వెలుగు ప్రపంచ బావుటా చూపుడువేలే సూర్యుడు కనిపిస్తుంది. అమ్మ గొప్పదనం .. బీదరికాన్ని మరుగున డాచేసి మనకు పంచిన ప్రేమ అంతా అమ్మ దూరమైనా ఆకాశంలా పరచుకున్న అమ్మ పాత చీర మన గుండె లోపలి జ్ఞాపకాలను తట్టి లేపుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అన్నమూ ఆకలి పాటలో యాచకుని ఆకలికి ద్రవించిన మనసు తడి కనిపిస్తుంది. యవ్వనం ఆనందం కలిసిన విషాద కవనం, బ్రతికిన క్షణంలో రాలిన జ్ఞాపకం, వేలాడే కాలంలో రైతు కన్నీటి హృదయ గాధ,యువ ప్రస్థానంలో  యువతకు దిశా నిర్దేశం, ఒక్క వానలో ఎండిన బతుకు నేలలో వాన చినుకు కోసం ఎదురుచూపులు, ఒక జ్ఞాపకం వంద గాయాలు వినిపించే అంతర్మధనం చదివితే తడిగా మారే కళ్ళు, కొత్త పాటలో ఆశల వెలుగు, దగ్ధ నెలవంకలో ఆశల రెక్కలు విరిగిన స్థితి, నిశ్శబ్దపు అలజడి చేసే మనసు చప్పుడు, పదహారేళ్ళు  చెప్పే బాల్యపు సంగతులు, వేదనలో నగర జీవితపు ఇక్కట్లు, కార్పొరేట్ల కాళ్ళ క్రింద నలుగుతున్న పసి మనసుల చదువులు, వెలుగులో మదిలోని బోలెడు కోర్కెల కబుర్లు, మట్టి మనుషులు లో పేరుకు తగినట్టుగా చక్కని అర్ధం చెప్పారు.  చినుకులో ప్రాణాధార నీటి చుక్క కోసం తపనపడే జీవితాలను, ఓ రాత్రి కలలో కిరణ్మయి ఆనందం విషాదం కలిసిన కల, మరో జన్మకు ఎదురుచూపులుగా మిగలడం, అతీతంలో అనుబంధం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దూరమైన మిత్రుని స్మృతి ఒక వీరుని అమరత్వంలో జీవిస్తుంది.  సజల నేత్రాలులో ఎప్పటికి చెరిగిపోని స్వప్నపు ఊహా సౌధాలు, తోలి ప్రేమ స్వచ్చత అంతర్లీనంలో సంఘర్షణ, అరుగు దాచుకున్న అవ్వ జ్ఞాపకాలు, అధికారానికి బలౌతున్న జీవితాలకు కోపం వస్తే ఎలా ఉంటుందో మండే చంద్రుడిలో, మరి నేనెవర్నిలో మనం అన్న మాటకు చక్కని అర్ధం కనిపిస్తుంది. అమ్మ భారతీలో సమాజపు తీరు తెన్నులు, స్విచ్ డౌన్లో మనం దూరమౌతున్న సహజత్వం గురించి చురకలు, ఓ ఆదాము కథలో మనసు చాంచల్యాన్ని, యుద్ధం చేయడం ఖాయం లో అధికారానికి ఓ హెచ్చరిక, పూలూ తిరగబడతాయిలో నిరీక్షణలో ఉదయించే ప్రశ్న, పద్మవ్యూహంలో నిస్సహాయత, కలల పాఠశాలలో తనకున్న ఆశలను, అంతర్ధానమైన మనిషి ఆనవాలు గురించి ది మిస్సింగ్ మ్యాన్లో , కలలా వచ్చి వెళ్ళే ఇష్ట సఖిని నిట్టూర్పులో,  అశ్రురేఖ బతుకు చిత్రం గురించి మట్టి వాక్యంలో, ఆఖరి బహుమానంలో మరణం వరకు చేసిన జీవిత రణాన్ని చెప్పిన తీరు అద్భుతం. సమాజం గురించి ఆలోచన సంఘం శరణం గచ్చామిలో, విలయం,  కరిగిన హరివిల్లు, మొగ్గలా జడ, అక్షర శిల్పి గా మారి ఆనంద విషాదాలను చూపటం, నను నిదురించనీ  అని జతను కోరడం,  నదీమ తల్లీలో దోసెడు నీటి కోసం ఆరాటం, కొత్త సూర్యుడులో దుర్మార్గంపై నిప్పులు చెరగడం,  వర్ణంలో ఏక వర్ణం, అక్షరాలూ ఆయుధాలుగా మారడం, ఈ పాపం ఎవరిది అంటూ మూఢ నమ్మకాలపై అస్త్రం, అశ్రువు పైన ఇష్టాన్ని, అభేదంలో కలసిన మనసులను, నేను నా టెరీకాటన్ చొక్కాలో ఇప్పటి జీవితాలకు గతపు జ్ఞాపకాలు ఇచ్చే ఆనందాన్ని, అయ్యవారులో చదువు నేర్చుకున్న చిన్నతనాన్ని, గురువును, తుఫాను రాత్రిలో అమ్మ దూరమైన క్షణాలు మరువలేని పసి మనసు ఎదురుచూపులు, మరోచరిత్రకు శ్రీకారంలో గెలుపు ఓటములు, కన్నీళ్ళు , నెత్తుటి రాజకీయాలు కాకుండా ప్రేమయం కాబడిన చరిత్రకు శ్రీకారం చుట్టాలన్న పిలుపు, తరాలు అంతరాలు లో అణచివేతకు గురికాబడిన అట్టడుగు వర్గాలపై దాడులను, వాటికి సమాధానం చెప్పమని ఎలుగెత్తి చాటడాన్ని చెప్పారు. నేను వేణువులో చక్కని సున్నితత్వం కనిపిస్తుంది.  వెదురు గాయాలు, మనసు గేయాలుగా   మారడం బావుంది. రాలుతున్న పూలులో ప్రేమ కథలు విషాదం కాకూడదని చరిత్రను మార్చాలని, వార్ అండ్ పీస్, అనివార్య సమయం, శోధన, అంతర్వేదన, మనోనేత్రం, ప్రయాణం, జ్వలన, అతడొడిపోలేదు, ఓ మహా శూన్యం వీటిలో జీవిత పోరాటాలను, కవి దిశా నిర్ధేశాలను చక్కని పదాల్లో అందించారు. చివరిగా మా నాయినలో తనకు ఆరాధ్యుడైన తండ్రి గురించి ఓ కొడుకు చెప్పిన నిజాయితీ చదివే వారి మనసుకు హత్తుకుంటుంది.

చక్కని సున్నిత, సుళువైన పదాలతో రాసిన ఈ తడియారని స్వప్నం ... చదివిన ప్రతి ఒక్కరికి బోలెడు గత జ్ఞాపకాలను అందిస్తుంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు.  ఏదో నాకు అనిపించిన నాలుగు మాటలు చెప్పగలిగాను చాలా రోజుల తరువాత.
చక్కని పుస్తకాన్ని అందించిన లోసారి సుధాకర్ గారికి కృతజ్ఞతలు.

అభినందన వందనాలు...!!

శ్రీ సబ్బాని లక్ష్మీ నారాయణ గారి పదవీ విరమణ సందర్భంగా రాసిన చైనా కవితాసుమం..!!

సామాన్యునిగా జనియించి
సరస్వతీ మానస పుత్రుడై 
వివిధ కళల సాహిత్యంలో
వినమ్రుడై ఒదిగిపోయి
బహు భాషా కోవిదుడుగా నిలిచి
అమ్మ చాటు బిడ్డడు అందుకున్న
అరుదైన సాహితీ పురస్కారాల
ఆణి ముత్యాల అక్షర మణులు
వెలకట్టలేని సంపదలుగా
అందుకున్న సాహితీ కృషీవలుడు
సబ్బాని లక్ష్మీనారాయణ గారు
అందుకోండి మా అభినందన వందనాలు

ఏక్ తార లు....!!

1. మార్గశిరానికి చోటిస్తూ_కన్నీళ్ళకు కలలను అప్పజెప్పే మాఘమాసం ముందుంది  
2.వాస్తవాలెందుకో ఉలికి పడుతున్నాయి_గతపు ఆనవాళ్ళు గుర్తుకొచ్చాయేమో
3. కాలాన్ని కాసేపు బంధించాలని ఉంది_కొన్ని క్షణాలయినా గెలుపు తలుపు తెరవాలని
4. భారమైన బతుకులు బావురుమంటున్నాయి_కాసిన్ని ఓదార్పులు కరువై
5. ఆఖరి శ్వాస ఆయాస పడుతోంది_అలసట తీర్చుకుంటున్న జీవితాన్ని చూస్తూ

29, అక్టోబర్ 2016, శనివారం

గెలుపు తలుపు తెరవాలని...!!

వాస్తవాలెందుకో ఉలికి పడుతున్నాయి
గతపు ఆనవాళ్ళు గుర్తుకొచ్చాయేమో

జ్ఞాపకాలు పలకరిస్తూనే ఉన్నాయి
భవితకు  బాసటగా  నిలుస్తామంటూ

ఆఖరి శ్వాస ఆయాస పడుతోంది
అలసట తీర్చుకుంటున్న జీవితాన్ని చూస్తూ

అడ్డుపడే అంతరాల అంతఃకలహాల నడుమ
మది మౌనంగా సంభాషిస్తోంది 

గుప్పెడు గుండెలో దాగిన ఆత్మీయత
గువ్వలా ముడుచుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది

అనుకోని అనునయాలు అభయమిస్తున్నాయి
అలవాటుగా మారిన అనుబంధాలకు

భారమైన బతుకులు బావురుమంటున్నాయి
కాసిన్ని ఓదార్పులు కరువై

కాలాన్ని కాసేపు బంధించాలని ఉంది
కొన్ని క్షణాలయినా గెలుపు తలుపు తెరవాలని...!!

మణి మాలికలు..!!

1. రెప్పలవెనుకే దాచుకున్నా..
తడియారని స్వప్నాలను...!!

2. రెప్పలవెనుకే దాచుకున్నా..
మదిలోని మౌనాలను ...!! 

3. రెప్పలవెనుకే దాచుకున్నా..
    నాతో నీవున్న క్షణాల కాలాన్ని ...!!

25, అక్టోబర్ 2016, మంగళవారం

నేలరాలిన రాచిలుక...!!

పలకరించని పిలుపులు చేరువలో 
కలవరింతలు కలలుగా మదిలో
గాయపడిన గుండె జ్ఞాపకాలలో
చెమరింతల చేవ్రాలుల ఓదార్పులలో
కలతపడే కన్నుల కబుర్లలో
ఊసులకందని ఉహల రెక్కలలో
నింగికెగిరే చుక్కల పయనంలో
ఆశల హార్మ్యాలను అందుకునే యత్నంలో
బంధనాలకు తల ఒగ్గి నేలరాలిన రాచిలుక...!!

22, అక్టోబర్ 2016, శనివారం

నాంది పలికే రోజు రావాలి....!!

నేస్తం...
          చాలా నెలల తరువాత మన పలకరింపులు మళ్ళీ . చెప్పాల్సిన కబుర్లు చాలానే ఉన్నా అలవాటు తప్పింది కదా అక్షరాలూ అందడం లేదు. ఓ జీవితం మళ్ళి కొత్తగా మొదలైనట్లుగా ఉంది. కాలంనాడెప్పుడో వేమన గారు చెప్పినట్లు " తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా" అని ఎంతసేపు ఎదుటి వారి తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకుంటే చివరికి మనం కూడా ఆ తప్పుల్లోనే కొట్టుకుపోతామని అనుకోవడం లేదు. మానసికమైన హింస చాలా ప్రమాదకరం కానీ దానికి సాక్ష్యాలు ఉండవు, శిక్షలు ఉండవు. నమ్మి వఛ్చిన వారిని నట్టేట ముంచి సమాజంలో సాధుజీవుల్లా చాలామంది నటించేస్తున్నారు. కొత్తగా వచ్చి చేరిన స్నేహాలు, పలకరింపులు, పరామర్శలు ... వీటిలో తలమునకలౌతు తనను కావాలని వచ్చిన బంధాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మహానుభావులెందరో ఈనాడు. తమ సుఖం చూసుకుంటారు కానీ అన్ని అమర్చిపెట్టే తోడును కనీసం తిన్నావా అని పలకరించడం చేతకాని ప్రబుద్ధులు.. గారాల పిలుపులతో నయగారాలు ఒలికిస్తూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కబుర్లు.
నడవడి, వ్యక్తిత్వం అనేవి మనిషికి పెట్టని ఆభరణాలు. అవి లేని నాడు మనకు సొమ్ము ఎంత ఉన్నా విలువ లేనట్లే. నలుగురిలో గౌరవం మనకు ఉందిలే అనుకుంటే సరిపోదు. ఎదుటివారు మనకు ఇవ్వాలి కానీ మనకి మనం గొప్ప అనుకుంటే ఎలా...! పరిచయాలు సుగంధాన్ని పరిమళింపజేయాలి కానీ దుర్గంధాన్ని వ్యాపింపజేయకూడదు. పర వ్యాపకాల కోసం కేటాయించే సమయంలో కాస్త మన కోసం బతికేవారి కోసం కూడా వెచ్చిస్తే కొద్దిపాటి సంతోషాన్ని కుటుంబంలో నింపగలిగినవారు అవుతారు. ఎన్నో జీవితాలు పడుతున్న మానసిక వేదనకు కారణం ఈ అంతర్జాల మాయాజాలం అవుతోందనడానికి సాక్ష్యాలు మనకు తెలిసినా దానిని నివారించలేని దౌర్భాగ్యంలో ఉన్నాం ఈరోజు. నిజాలు తెలిసినా నిలదీయలేని అసహాయత, ధైర్యం చేసి అడిగితే తమ తప్పులను ఎదుటివారికి అంటగట్టి వయసు, విజ్ఞత మరచి నోటికి వచ్చినట్లు నానా మాటలు అనే పెద్దమనుష్యులు ఈ సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. మన సంతోషం కోసం ఎదుటివారి జీవితాల్లో చీకటి నింపేంత హీన స్థితికి దిగజారే మనస్థత్వాలను వదలి అందరు బావుండాలి అన్న ఆలోచనకు నాంది పలికే రోజు రావాలి....!!

20, అక్టోబర్ 2016, గురువారం

మరబొమ్మ....!!

రెప్పచాటు స్వప్నాల
ఎదురుతెన్నులు రేయింబవళ్ళు
నిదురోయే కనుపాపల
అలికిడిలో జీవించాలని

కలత పడే కనులకు
కన్నీటి నేస్తాల పలకరింతలతో
ఘడియకో ఘనమైన గతానికి
జ్ఞాపకాల ఆలంబనలు

తడబడుతూ  పడిలేస్తూ 
అమాయకత్వపు అడుగుజాడలు
అడ్డదిడ్డంగా అడ్డుపడుతున్నా
ఆశల తీరాలకై పరుగులు

ముగ్ధంగా ముడుచుకున్న
మల్లెమొగ్గ విచ్ఛుకోవాలంటూ
తపన పడే పరిణామ క్రమానికి
యాంత్రికత చేరికైతే.. మిగిలేది మరబొమ్మే....!!

19, అక్టోబర్ 2016, బుధవారం

ఆడపిల్లను...!!

నాకంటూ.. 
ఓ ఉనికి లేదు
గాలివాటుకు కొట్టుకుపోయే
పరమాణువుని..

నేనెవరో..
తెలియని ఈ ప్రపంచంలోనికి
రావాలన్న ఆతృతతో
తహ తహలాడుతున్న జీవాన్ని..

ఎప్పటికప్పుడు..
వాయిదాలేస్తున్న వైనాన్ని చూస్తూ
నిస్సహాయంగా రోధిస్తున్న
అల్ప ప్రాణాన్ని..

నేనే..  
సృష్టి  చైతన్యానికి మూలమైనా
అనుక్షణం చిదిమివేయబడుతున్న
చిన్నారిని..

అందరితో..
ఆత్మీయతను పంచుకోవాలని
తపన పడుతూ అక్షరాలకే
పరిమితమైన ఆడపిల్లను...!!

17, ఆగస్టు 2016, బుధవారం

నా సన్నిహిత నేస్తాలు అందరికి....!!

ఎనలేని సంతోషాన్ని ప్రతి క్షణం నాకందిస్తూ నా శ్రేయస్సు కోరే నా సన్నిహిత నేస్తాలు అందరికి చాలా చాలా కృతజ్ఞతలు ....
థాంక్యు సో మచ్ శరత్ దంపతులకు....

15, ఆగస్టు 2016, సోమవారం

అక్షరం ఆశయం....!!

బిరుదులకందక
అధికారానికి లొంగక
కనుల ముందు కదలాడే
సామాన్యుల సమస్యలపై
ఎన్నో ప్రశ్నల శరాలను
దేవుడు చేసిన మట్టిమనుష్యుల 
మసనుల సంఘర్షణలను
మానవీయ కోణంలో
అతి సున్నిత సరళ పదాల
అక్షర పద సంపదను
అందరికి అర్ధం కాకపోయినా 
కొందరిలోనైనా స్పందన
తేవాలన్న దృఢ సంకల్పం
అక్షరం ఆశయం....!!

ఈ సదుద్దేశ్యంతో వయసుతో నిమిత్తం లేకుండా పెద్దలు, పిన్నలు వచనం, కవిత్వం, భావుకత్వం, వ్యాసం .... ఇలా ఎన్నో ప్రక్రియలలో ఎందరో అక్షర బ్రహ్మలు నాకందించిన విలువైన సంపద నా పుస్తక భాండాగారం. అందరివీ చదివి నాలుగు మాటలు చెప్పాలనే తపన ఉన్నా తొందరగా చెప్పలేక పోతున్నా.. నాకందిన ప్రతి పుస్తకంపై  పైన రాసిన భావనే నాది. ప్రపంచంలో అత్యంత విలువైన సంపదను నాకందించిన ప్రతి ఒక్కరికి వందనం....!!

14, ఆగస్టు 2016, ఆదివారం

అందరు సంతోషంగా బావుండండి.. !!

చాలా నెలల తరువాత వంట ఇంటిలో ఈ రోజు నా వంటకాలు వెలిసాయి. పిల్లల ముఖాల్లో సంతోషాన్ని చూడటానికి సహకరించని శక్తిని కూడగట్టుకుని పండిన చికెన్ బిరియాని, వెజిటబుల్ బిరియాని, పెరుగు పచ్చడిలతో మా పిల్లల అందరి కేరింతలతో అప్పుడప్పుడు అలిగిన పుట్టినరోజు బుల్లి శౌర్య ముంగమూతి అందాలతో సంతోషం సందడి చేసేసింది మా ఇంట. ఇంట్లోనే కాకుండా మా అపార్ట్ మెంట్ లో అందరి పిల్లలతో సరదాగా అలుగుతూ వారి బుజ్జగింపులు సముదాయంపుతో, ఆంటీలకు, అంకుల్స్ కు, అందరికి ప్రియమైన అల్లరివాడు శౌర్యకు
పుట్టినరోజు శుభాకాంక్షల ఆశీస్సులు....




 ఎవరు ఎలా అనుకున్నా స్వకార్యం తరువాతే స్వామి కార్యం అని నేను అనుకుంటాను ... బాధ్యతలు వదిలేసి దీన జనోద్ధరణ, సమాజసేవ అని బిరుదుల కోసం పాకులాడే వాళ్ళు కనీసం ఇంటిలోని వారికి కాస్త సంతోషాన్ని అందివ్వగలిగితే ఆ పిల్లల పసి మనస్సులో మనకు ఎప్పటికీ స్థానం పదిలంగా ఉండి పోతుంది. చేతనైన సాయం చేయడంలో తప్పులేదు కానీ ఇంటి కనీస బాధ్యతలు పట్టించుకోకుండా ఉండటం అనేది ఎంత వరకు సమంజసం..? ఏదైనా చేయాల్సిన సమయంలో చేయాలి. అంతా అయిపోయాక ఏమి చేయడానికి ఉండదు. ఎందుకంటే గడచిన క్షణాల కాలాన్ని తిరిగి ఎలా తేగలం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా... మనం చేసే ఓ చిన్న తప్పు కానీ, మనం మాట్లాడే ఓ చిన్న మాట కానీ తరువాత వెనక్కి తీసుకోలేము. ఎదుటి వారిని బాధ పెట్టడం అనేది చాలా తేలిక కానీ సంతోష పరచడం, మానసిక ధైర్యం ఇవ్వగలగడం అనేది ఏ కొద్దీ మందో చేయగలరు. అందరు బావుండాలి అన్న చిన్న కోరిక నాది. కష్టం వఛ్చినా సంతోషం తప్పక ఉంటుంది దానిలో అనుకుంటే అంతా బోలెడు సంతోషమే . అందరు సంతోషంగా బావుండండి.. !!

12, ఆగస్టు 2016, శుక్రవారం

అన్నీ బావుంటాయి కదూ నేస్తం ....!!

నేస్తం,
         ఎందుకో ఈ రోజు చాలా మాట్లాడాలి అనిపిస్తోంది. మళ్ళి మాట్లాడే సమయం నాకు వస్తుందో లేదో తెలియదు కదా, అందుకే ఇలా అన్నమాట..
నేను పుట్టిన క్షణం నుంచి ఓ పాతిక ఏళ్ళ వరకు నా అంత ఆనందంగా ఉన్నవాళ్ళు చాలా అరుదే అని నా ప్రగాఢ  నమ్మకం. అది నేను కష్టాలు, సంతోషాలతో కూడా చాలా సంతోషంగానే ఉన్నాను అందరి మధ్యలో. తరువాత మొదలయిన ఈ ఇరవై ఏళ్ళ జీవితంలో తారసపడిన చాలా మంది వలన సంతోషం అనేది కానీ బాధ కానీ నాకు రెండూ చాలా వరకు మానసిక క్షోభనే మిగిల్చాయి. ప్రతి పనిలోనూ ప్రతి క్షణం వాళ్ళ వాళ్ళ అవసరానికి పావుగా వాడుకుంటూ అనుక్షణం నన్ను అధఃపాతాళానికి తొక్కాలని ప్రయత్నించినవారే ఎక్కువ. వాళ్ళు అలా చేసిన ప్రతిసారి నాకు నేనుగా నిరూపించుకుంటూనే ఉన్నా. అదే ఈ రోజు నేను ఏంటో అందరికీ చెప్పింది. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు ఇలా చెప్పేస్తున్నా.
నాకు మాట్లాడటమే రాదు, చలాకీతనం, చురుకుతనం లేవు, ఒక లెక్చరర్ గా పనికిరాను, అసలు దేనికి పనికిరాను, ఏ ఉద్యోగం చేయడం రాదు, అసలు ఉద్యోగమే చేయలేదు, ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, డబ్బులు ఏమి సంపాదించలేదు ..... ఇలా చాలా చాలా బిరుదులు నాకు ఇఛ్చారు. అవి అన్ని నాకు సరిపోతాయో లేదో ఈ ప్రపంచంలో నేను తెలిసిన ప్రతి ఒక్కరికి పని గట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు నన్ను కాదన్నా దూరం చేసుకున్నా నా బాధ్యతలు అన్ని ఇప్పటి వరకు చేశాను. ఎవరెవరికి ఏమి చేశాను అన్నది మనసాక్షి వారికి ఉంటే జీవితంలో కనీసం ఓ క్షణం నిజాయితీగా నిజాన్ని ఒప్పుకునే ధైర్యం చేయండి. దీని వలన నేను నా జీవితంలో ఎన్నో కోల్పోయాను. ఇప్పుడు కోట్లు తీసుకు వచ్చి నా ముందు పోసినా నా సంతోషం తీసుకురాలేరు.నా పిల్లల బాధ్యతలే సరిగా చేయలేక పోతున్నాను ఇప్పుడు. అందరికి అన్ని చేసిన నేను ఇక అలసిపోతున్నాను. అయినా ప్రయత్నిస్తూనే ఉంటాను ... చేయలేను అని ఆగిపోవడం మంజుకి చేతకాదు కదా.... ఇప్పుడు సూరయ్యకు నా మీద బోలెడు ఇష్టం పెరిగి నన్ను ఎండలోనికి రావద్దు అని చెప్పాడు.. కాస్త భారంగా కబుర్లు మొదలెట్టినా జీవితాన్ని ఎలా ఉన్నా ఆస్వాదించడం తెలిస్తే అన్నీ బావుంటాయి కదూ నేస్తం ....!!

10, ఆగస్టు 2016, బుధవారం

మనసుల మమతల నెయ్యం...!!

నేస్తం,
         ఎన్నోరోజుల తరువాత బోలెడు కబుర్లు ఉన్నా కాసిని సందడి కబుర్లతో ఇలా ....

జ్ఞాపకాలు, అనుభూతులు, ఆప్యాయతలు .... అన్నవి మనం ప్రతి క్షణం మాట్లాడుకుంటేనో లేదా కలసి ఉంటేనో అని అనుకోనక్కర లేదు . ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఓ సెకను పలకరింపు లేదా గుర్తు చేసుకోవడం అన్నది లేని జీవితాలు ఏం కోల్పోతున్నాయో ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎవరికీ పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు.
నాలుగు గోడలకే పరిమితమైన కొన్ని నెలల కాలంలో ఇప్పటి యంత్రాల పకరింపులు( ఫోన్, ఎఫ్.బిలు లాంటివి ) లేక పోయినా ఎప్పుడూ ఒంటరితనం అనిపించలేదంటే ఎవరైనా నమ్మగలరా..!!
అస్సలు సమయమే లేదు అన్నది మనని మనం మోసం చేసుకోవడమే.
ఒకప్పటి గడచిన జ్ఞాపకాల అల్లరి సందడితో ఉన్న కొద్దిసేపైనా కొన్ని సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదువుల సరదా పిలుపుల కాలాన్ని నా కళ్ళ ముందుకు సజీవంగా తెఛ్చి నాకు మళ్ళి బోలెడు సంతోషాన్ని స్నేహితులరోజుకు ఒకరోజు ముందుగానే నాకు కానుకగా మూటగట్టి ఇఛ్చిన అప్పటి అల్లరి నేస్తాలు, చల్లని స్నేహం స్పర్శ ఎప్పటికీ ఇలా నా సొంతమే కావడం అన్నది ఎన్ని జన్మల పుణ్యమో మరి. అందరి రూపాలు చూపలేక పోయినా ప్రతి ఒక్క నేస్తం ఎప్పటికీ నాకు దగ్గరే.
ఆత్మీయ నేస్తాలు శారద, ఉమ, శోభ, నీరజ, అందరిని కలిపి అల్లరి చేసే అనిత, అను, మమత, కవిత, మంజు, నీలిమ  .... ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడే..... కొందరితో సంతోషం కాదు అందరిలో సంతోషం నింపితే అది కలకాలం అలానే సజీవమై ఉండి పోతుంది ... ఎన్ని జన్మలకైనా దాని పరిమళం తరిగిపోదు. ఇదేనేమో మనసుల మమతల నెయ్యం.

8, ఆగస్టు 2016, సోమవారం

సాకారమైన స్వప్నం.....!!

కలలకు కలతపడి
కథలతో చెలిమి...

వెతలకు భయపడి
వేదన చెందిన మది అలజడి...

వ్యధలకు వడలిన బతుకుల
వేసారిన జీవితాలు...

కనులకు నిండుగ
కన్నీటి సుడులు....

వదలని గతాల
గాయాల గుట్టలు....

ఓటమికి వెరవక
విజయానికై తపన... 

సాకారమైన స్వప్నం
సుందర స్వరూపం సాక్షాత్కారం...!!

3, జూన్ 2016, శుక్రవారం

సడి చేయని ...

ముఖపుస్తకానికి రావడం కాస్త తగ్గినా అభిమానిస్తున్న అందరికి వందనాలు .... త్వరలో నా రెండో పుస్తకం  లేఖలుగా, వ్యాసాలుగా రాసిన కబుర్లు మీ ముందుకు రాబోతున్నాయి .... " సడి చేయని ... (అ )ముద్రితాక్షరాలు" గా ... ఆదరిస్తారు అని నమ్ముతూ ....

14, మే 2016, శనివారం

చేజారిన జ్ఞాపకాలుగా....!!

గతపు గాయాలు చెమరిస్తూనే ఉన్నాయి
వాస్తవంలో వద్దన్నా వెంబడిస్తూ
చేజారిన జ్ఞాపకాలుగా మిగిలిపోతూ..

చేతన సందడి క్షణాలను గుర్తుచేస్తూ
ఆచేతనాన్ని అందుకున్న మదిని
మరపు మాయలో లాలిస్తూ...

కన్నులు దాటని కలలకు
అందని ఊహల పయనానికి
వాయిదాలు వేస్తున్న నెపాలకు లొంగిపోతూ....

ఓటమి గెలుపుని అందుకుని
నీడగ మిగిలిన సాక్ష్యాలను
ఆనందపు నేస్తాలు అనుకుంటూ...

అవధులు తెలియని అమాయకత్వానికి
ఆసరా ఇవ్వలేని అభిమానాన్ని
అందుకున్న అసహజత్వానికి తల ఒగ్గుతూ...!!

5, ఏప్రిల్ 2016, మంగళవారం

మనసు - మెదడు....!!

మనసు - మెదడు ఈ రెండిటికి ఉన్నఅవినాభావ సంబంధం వాటితో ముడి పడి ఉన్న వాళ్ళకే తెలుస్తుందేమో... అందరికి ఉంటాయి ఇవి రెండు కాని మనసు పడే తపన కాని బాధ కాని మెదడుకి చేరితే ఆ మెదడులో జరిగే మార్పులు కనిపెట్టడం గొప్ప గొప్ప వైద్యులకు కూడా సాద్యం కాదని నిరూపితం అవుతోంది...
ఒక మనిషిని మానసికంగా హింసిస్తే దానికి పర్యవసానం మెదడులో జరిగే ఎన్నో మార్పులు అవి ఏ న్యాయస్థానాలకు దొరకని సాక్ష్యాలు.. గత మూడు సంవత్సరాలుగా నేను ఒక పేషెంట్ గా వెళుతున్నాను.. అక్కడ ఎందఱో ఎన్నో వైవిధ్యమైన సమస్యలతో బాధ పడుతున్నారు ఒక్కొక్కరిది ఒక్కో కథ పుట్టుకలో కొందరికి... మధ్యలో సమస్యలతో కొందరికి.. చడువుకునే పిల్లలు... చిన్న పిల్లలు .. ఇలా ఒకటనేమి లేదు వచ్చాక ఇక జీవితాంతము తప్పని మందులు..
మనసు ప్రభావం మెదడు పై చాలా ఉంటుంది అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి... పెద్ద పెద్ద చదువులు చదివిన వైద్యులకు తెలియదా ఏమిటి ఆ చిన్న సంగతి..? మానసిక నిపుణులు ఎంతో మందితో మాట్లాడి ఉంటారు కదా వారికి తెలియదా ఈ సంగతి.. న్యాయ వ్యవస్థలో మార్పు తీసుకువస్తే ఎంతోమంది పిచ్చివాళ్ళు కాకుండా బయట పడతారు... మన చట్టంలో ఉన్న లోపాలను వాడుకుని చేసే మోసాలు అందరికి తెలియనివి కావు .. అయినా మనకెందుకులే అని ఎవరికి వారు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటున్నారు...

మనసు చనిపోతే మెదడు చనిపోతుంది ... ఇది నిజం .... దయచేసి మనసుని చంపకండి ... మీకు లేకపోతే పర్వాలేదు ఎదుటివాళ్ళ మనసుని చంపే హక్కుని మాత్రం రాజ్యాంగం మీకు ఇవ్వలేదని గుర్తు చేసుకోండి ... ఎదుటివాళ్ళు మీకన్నా చిన్న వాళ్ళు కావచ్చు .. పెద్ద వాళ్ళు కావచ్చు ... ఎవరైనా కావచ్చు ... వాళ్ళ మనసు మీద అధికారం మీకు లేదు ... భారతీయ మేధావులు ఈ ఒక్క విషయం ఆలోచించండి ... ఎందరినో కాపాడిన వారౌతారు ...

ఇంకొక చిన్న విషయం మనం చనిపోయాక మన శరీరం మీద మనకు హక్కు లేక  పోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది ... మన శరీరాన్ని మనకు నచ్చిన విధంగా చేయడానికి కూడా బోలెడు పర్మిషన్లు అడుగుతున్నారు .. ఇదేమైనా న్యాయమా అండి ... కన్నా వారికి హక్కు ఉండటం సహజం .. అంతే కాని ఇంకాఎవరికీ హక్కు ఉండటానికి వీలు లేదు ... అది చనిపోయిన వారి కోరిక ప్రకారమే జరగాలి...

నేను నా పార్ధివ శరీరాన్ని రీసెర్చ్ కోసం ఇవ్వదల్చుకున్నాను .... దీనిలో వేరే మార్పు లేదు ... 

1, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఘనీభవించిన మనసు...!!

ఏ రాతిరి రాసిన రాగమో
ఏ  వెన్నెల విసిరిన వేదనో
ఇలా చేరి గతాన్ని మరచిన జ్ఞాపకమైంది

కాసారం కాని కలగా నిలిచి  
సాక్షాత్కారం కాలేని వరమై మిగిలి
నిషిద్దాక్షరమై మది ముంగిట ఉండి పోయింది

మూసిన కనుల ముందర
మురిపించిన మనసు కోరిక తారాడిన తావి
వెదుకలేక వేసారిన ఈ జన్మ అలసింది

రాహుకేతువులు  రెప్పపాటున కబళించి
వామపాదంతో కదం తొక్కుతూ
జీవితాన్ని రాబందుల్లా ఏలుతున్నారు

గుండె గురుతులు గుచ్చుతున్నా
ఇంకిన నెత్తుటి రంగులో అగుపగుతూనే
తడి ఆరడం లేదు ఈ ఘనీభవించిన మది చిత్రాలు...!!

21, మార్చి 2016, సోమవారం

సాంద్ర భావుకతాక్షరాల కవిత్వం....!!

ఈ రోజు ఆంద్ర ప్రభ  వార్తా పత్రిక సాహితి పేజ్ లో నా అక్షరాల సాక్షిగా పై డా . పి . సుబ్బారావు గారు  రాసిన సమీక్ష ... వారికి , పత్రిక వారికి నా కృతజ్ఞతలు ... 
http://epaper.prabhanews.com/index.aspx?eid=31928#

5, మార్చి 2016, శనివారం

ఒకే ఒక్కరు...!!

ఎన్నో ముఖాముఖిలు సాహితి సేవ సమూహం ద్వారా ఎందరో అతిరధ మహారధులను పరిచయం చేసాను కాని ఒకే ఒక్కరు గుర్తు పెట్టుకుని మరీ ఈరోజుకి నాతో ముఖాముఖికి ఒక సంవత్సరం పూర్తి అయింది అని అభినందించిన వ్యక్తి శ్రీ ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారు ... ఇంత పెద్ద మనసున్న గుప్త గారికి, వారిని పరిచయం చేసిన సుబ్బానాయుడు గారికి , అవకాశాన్ని ఇచ్చిన సాహితీ సేవకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు ..

3, మార్చి 2016, గురువారం

సాటి బంధాలనేమో...!!

అస్పృశ్యత ఆపాదించలేని
మనసాక్షరాలను వెదుకుతూ
అమ్మదనపు మమకారపు
చెమ్మదనంలో చేరుతున్న
గుండె సడికి గుప్పెడు పదాలతో
నమ్మకాల నజరానాకి పహారా కాస్తూ
అమ్మకాల అనుబంధాలకు స్వస్తి పలుకుతూ
పోతపోసిన అహంకారానికి సమాధి కడుతూ
చరమ గీతాలు పాడాలని అనిపిస్తున్నా
ఎక్కడో ఓ చిన్న మెలిక ఆపుతోంది
మనతో ముడేసుకున్న సాటి బంధాలనేమో...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner