24, డిసెంబర్ 2013, మంగళవారం

మహోన్నత శిఖరం ...!!

అల్లరి పాపాయిలో అమ్మను చూసుకుని
అనుబంధాల ఆత్మీయతా బంధాన్ని
మమకారపు మధుర కావ్యాన్ని
తప్పటడుగుల విన్యాసాన్ని
ముద్దు ముద్దు మాటల మూటలను
మనసుతో అనుభవించి అంతలోనే
రూపాన్ని మార్చుకుని నాన్న ప్రేమతో
వ్యక్తిత్వాన్ని సంతరించుకుని
తన చేతితో మలచిన సజీవ శిల్పాన్ని చూస్తూ 
అనుభవించే ఆనందాన్ని మరో జీవితానికి
వారధిగా కొత్త తరానికి నాందిగా మార్చుకునే
తన రక్త పాశాన్ని విడలేక మనసు తపనను
ఆనంద భాష్పాలుగా చేసుకుని ఆనందించే
ఆ తండ్రి హృదయం మహోన్నత శిఖరం ...!!
అప్పుడే పుట్టిన పాపాయి అమ్మను తలపిస్తుంటే
అమ్మ ప్రేమను చవి చూసిన నాన్న తన పాపలో
అమ్మని చూసుకున్న ఆ అపురూప క్షణం...!!
పాదాలు కందకుండా అరిచేతుల్లో నడిపించిన నాన్న 
అడగకుండానే అన్ని తానైన ఆత్మీయతా బంధం
హద్దులు లేని ప్రేమమూర్తి నాన్నకు అక్షర నీరాజనం..!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

"నాన్న ప్రేమతో
వ్యక్తిత్వాన్ని సంతరించుకుని
...................
అప్పుడే పుట్టిన పాపాయి అమ్మను తలపిస్తుంటే
అమ్మ ప్రేమను చవి చూసిన నాన్న తన పాపలో
అమ్మని చూసుకున్న ఆ అపురూప క్షణం...!!"
తన కనుపాపలో పాపలో తన భార్యను చూసుకున్న అపురూప క్షణం అంటూ ఎంత చక్కని అపురూప భావనలో
మనసుకవిత్వం చాలా బాగుంది మంజు గారు
అభినందనలు.

చెప్పాలంటే...... చెప్పారు...

చంద్ర గారు ...ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner