21, అక్టోబర్ 2013, సోమవారం

మనసు జార్చిన ఈ కన్నీటి కావ్యం ...!!

వేదన లో జారిన అక్షరం
చిరునవ్వు చాటున దాగుండి
మదిని తడిమిన చెమ్మతో
కరిగిన కన్నీటి చెలమ
వెలువరించిన రుధిరం
పొంగుతున్న ఆవేశం
ఉరకలేస్తున్న ఉప్పెనలా
ముంచుకొస్తున్న మరణ తరంగం
శాసిస్తున్న శాసనం
అపహాస్యపు హాహాకారం
వినిపిస్తున్న కర్ణ కఠోరపు 
యముని మహిషపు లోహపు గంటల
భీకర విన్యాసపు విలయ తాండవం
తెంచుకోలేని అనుబంధాల నడుమ
విల విలలాడుతున్న మనసు కష్టం
తెలిసినా తెలియనట్లు నాటకం
జగన్నాధ రధచక్ర జీవిత యాత్ర
విధి ఆడుతున్న వింత చదరంగం
వినోదంలా చూస్తున్న వీధి దేవుళ్ళు
విపరీతార్ధాల వింత పోకళ్ళు
కూలుతున్న కాపురాలు
కుళ్ళబొడుస్తున్న మానవ మృగాలు
ఆరంభమే కాని అంతం లేని ప్రయాణం
ఎక్కడికో  తెలియని ఈ గమ్యం...!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

వేదన లో జారిన ఈ అక్షరం చిరునవ్వు చాటున మదిని తడిమిన కన్నీటి చెలమ దాగుంది. తెంచుకోలేని అనుబంధాలు, కూలుతున్న కాపురాలు కుళ్ళబొడుస్తూ మానవ మృగాలు .... ఆరంభమే కాని అంతం లేని ఈ ప్రయాణం ఎక్కడికో తెలియని ఏ గమ్యం వైపో ....!?
ఎంతో వేదన మది ఎదల సంఘర్షణ అక్షరాల్లో భావావేశం లా .... "మనసు జార్చిన ఈ కన్నీటి కావ్యం ...!!"
మీ మనోభావన, వేదన సంఘర్షణలతో ఏకీభవిస్తాను మంజు యనమదల గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

మనఃపూర్వక ధన్యవాదాలు చంద్ర గారు

Meraj Fathima చెప్పారు...

మాటలు రావటం లేదు, మంజూ పావురాళ్ళ గూర్చి ఆలోచించకు, ఎర ఉన్నంత కాలమూ వేట ఉంటుంది.
అక్షరాలకు కాదు మూర్ఖుల ఆలోచనలకు పదును పెట్టు.
ఆశీర్వదిస్తూ... అక్క.

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు చెప్పింది నిజమే అక్క .... మూర్ఖులకు ఆలోచించే మనసు...
సమయం ఉండదు... ఇక వాళ్ళని మార్చడం దేవుని తరం కూడా కాదు ...మీ కవితా పుస్తకపు ముఖ చిత్రాన్నే వాడుకున్నాను మీ అనుమతి లేకుండా..మన్నించాలి

Meraj Fathima చెప్పారు...

అసురులకు దూరంగా ఉండు మంజూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner