14, ఫిబ్రవరి 2011, సోమవారం

ఊసులాడే ఓ జాబిలమ్మ...!!

ఊసులాడే ఓ జాబిలమ్మ
మూగబోయావెందుకమ్మా!!
నీ వెండి వెన్నెల జారనీయక
జలతారు పరదాలను మబ్బుల మాటున
అడ్డుగా పరిచావెందుకు?
మసక వెన్నెల మాటున
చిరు దీపపు కాంతిలో
ఆరుబయట చల్లగాలికి పిల్లతెమ్మెరలా
ఒక్క మారు పలకరించి పోరాదా!!
నీ జాడ లేక బోసిబోయిన నింగిని చూసి
పక్కున నవ్వే నిశి రాతిరి...
చిన్నబోయిన కలువల కమలాలు...
ఎదురు చూసి ఎదురు చూసి
అలసి సొలసి విసుగుతో వేసారి
కానరాని నీ జాడకై కొమ్మల రెమ్మల మాటున
మసక మబ్బుల్లో నీ కోసం ఆశగా చూసేను...... !!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

చాలా బావుంది

Ennela చెప్పారు...

ఇక్కడెవరోనన్నుపిలుస్తున్నట్టున్నారు,వచ్చేసానండీ.అరెరె మీరు మిస్అవుతున్నారా నన్ను, వచ్చేసాగా మూగబోవటాలు అవీ కొంచెం కష్టం కానీ...మాట్లాడ్డం మొదలెట్టాక బెదిరిపోకూడదు మరి!
కవిత బాగుందండీ

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు లత గారు.....
మరి పిలవరేంటి? కనిపించి చాలా రోజులు అయింది గా.....:) నచ్చినందుకు థాంక్యు థాంక్యు వెన్నెలా.....

Unknown చెప్పారు...

నా జాబిలి గురించి నువ్వే ఇంత ఫీలయితె మరి నెనో. ...............

చెప్పాలంటే...... చెప్పారు...

-:) కదా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner