1, ఫిబ్రవరి 2011, మంగళవారం

నాలో నేను

అమ్మో అప్పుడే మద్య వయసు వచ్చేసిందా!! ఈ నాలుగు పదుల జీవితంలోకి ఓసారి తొంగి చూసుకుంటే...!!
తప్పొప్పులు, తీపి చేదు అనుభవాలు, నిజాలు అబద్దాలు, కొన్ని చేదు నిజాలు, మనకిష్టం లేక పోయినా ఎదుటి వారి ఆనందం కోసం చేసిన పనులు, మనకోసం మాత్రమే...మనకి మాత్రమే సొంతమైన కొన్ని అనుభూతుల పరిమళాలు.....ఇలా ఎన్నో రకాల అనుభూతుల మాలికే దేవుడిచ్చిన ఈ జీవితం. మనకి మాత్రమే సొంతమైన, మనది మాత్రమే అయిన మన జీవితం.
జీవితాన్ని అందరూ అందంగానే మలచుకోవాలని, సంతోషంగానే వుండాలని మొదలు పెడతారు కాని అందరికి అన్ని దొరకవు కదా!! మన గతజన్మ ఖర్మ ఫలితాన్ని బట్టి మన నుదుటి రాతని మనం పుట్టే కొన్ని క్షణాల ముందే రాసేస్తాడు. ఈ లోకం లోకి రావడం మొదలు బతకడానికి పోరాటం మొదలు పెడతాము. అదృష్టవంతులు బంగారు స్పూను నోటిలో పెట్టుకు పుడితే, కొంత మంది వెండి, రాగి ఇలా జీవితాలు మొదలవుతాయి.
నేను బంగారు స్పూనుతో పుట్టక పోయినా అదృష్టవంతురాలినే చిన్నప్పుడు. అందరి ప్రేమ, ఆప్యాయతలు పుష్కలంగా దొరికేవి. మాది పల్లెటూరు అయినా మేము పెరిగిన వాతావరణం చాలా చాలా బాగుండేది. చదువు, పుస్తకాలు,ఆటలు, స్నేహితులు, బంధువులు, సినిమాలు, షికార్లు ఇలా అన్ని ఆనందాలు దొరికేవి. మరి మనకు నచ్చినట్లు వుండే అలాంటి జీవితం దొరకడం దేవుడిచ్చిన వరమే నాకు. చిన్నప్పుడు డాక్టరు అంటే చాలా ఇష్టం పెద్ద అయినంక అదే చదవాలని అనుకునేదాన్ని. సైన్సు బొమ్మలు కూడా బాగా వేసేదాన్ని, కొద్దిగా బాగానే చదివేదాన్ని. పిన్ని వాళ్ళు రికార్డులు రాసుకొంటుంటే నేను రాస్తాను ఇంతకన్నా బాగా అని అనుకునేదాన్ని. నాన్న ఇంటరులో సైన్సు వద్దు లెక్కలు తీసుకో అంటే సరే అని లెక్కలు తీసుకున్నాను. బొమ్మల మీద అభిమానంతో స్నేహితులకు వేసిపెట్టేదాన్ని. తెలుగు అంటే బోల్డు అబిమానం కాని స్పెషల్ తెలుగు తీసుకుంటానంటే ఒప్పుకోలేదు. సరే ఇక ఇంజనీరింగ్ మొదలు.....వెళ్తే క్లాసులకు వెళ్ళడం, లేదా క్లాసులు ఎగొట్టి సినిమాలకు వెళ్ళడం....ఇది అందరూ చేసే పనేలెండి నేనేం కొత్తగా చేయలేదు. కాకపొతే ఇంట్లో వాళ్ళని చూడకుండా ఎక్కువ రోజులు వుండటం అలవాటు లేదు అందుకే పది, పదిహేను రోజులకి ఇంటికి వెళ్ళడం. హోటల్ కి వెళ్తే ఓ మంచి కాఫీ, దోశ, ఐస్ క్రీం పార్లర్ కి వెళ్తే భేల్పూరి, వెనీలా తినడం, ఉత్తరాలు, హాస్టల్లో పుట్టినరోజు పార్టీలు, రాగింగులు, క్లాసులో లాస్ట్ బెంచ్లో కూర్చొని అల్లరి, బస్సులో అంత్యాక్షరిలు, పరీక్షల్లో నైట్ అవుట్లు.... .....ఇలా బానే గడిచి పోయింది.
అస్సలు కత మొదలైంది చదువు అయినంక....నాకు, మా నాన్నకి చిన్న మాట తేడా వచ్చి నేను ఎంచుకున్న దారిలో నడవడం మొదలు పెట్టాను. కష్టమైనా, నష్టమైనా నేనే పడ్డాను చాలా రోజులు. ఇంట్లో వాళ్ళు కూడా నాతొ పాటుగానే అన్ని అనుభవించారు ఆ టైములో. మనం వాళ్ళని కాదన్నా వాళ్ళు మనల్ని వదులుకోలేరు ఇది ఎవరు నమ్మినా నమ్మక పోయినా అక్షర సత్యం. మా అత్తింటి వాళ్ళు అందరూ వాళ్ళ స్వార్ధం కోసం అందరు బంధువుల్లానే తమ నిజ స్వరూపం చూపించారు. చాలా కొద్ది మంది మాత్రమే వేరేగా వుంటారు, ఇది మానవ నైజం దీనిలో మనం వాళ్ళని తప్పు పట్టడానికి ఏమి లేదు. కాక పొతే నమ్మకం మీద, మానవత్వపు విలువల మీద దెబ్బ కొట్టారు అది మర్చి పోలేను.
నేను నడుస్తున్న దారిలో ముళ్ళు, రాళ్ళు ఏరుకుంటూ ప్రయాణం మొదలు పెట్టాను....కొన్ని కావాలంటే కొన్నిటిని వదులుకోవాలని పసి పిల్లలని( ఒకటినర్ర , ఆరు నెలల పిల్లలని) అమ్మ వాళ్ళ దగ్గర వదిలి....మరి బతకడానికి డబ్బులు కావాలి కదా!! దేశం కాని దేశం లో ఏదో ఒక తిప్పలు పడి కాస్త నిలదొక్కుకున్నాము. పెద్ద బాబు చచ్చి బతికినా కూడా రాని, కనీసం చూడని అత్తింటి వారికి డబ్బుల అవసరాలు తీర్చి, చిన్న ఆడబిడ్డకు పెళ్లికి డబ్బులు ఇచ్చి, పెళ్లి కుదిర్చి చేస్తే కుడా మామీద ఇంకా కోపమే వాళ్లకి.ఆ పెళ్లి కొడుకు ఆవిడకి నచ్చలేదంట. అది ముందు చెప్పలేదు.నేనేదో అబద్దం ఆ అబ్బాయి జీతం విషయంలో చెప్పానంట. నేను చెప్పలేదు, అడిగితే నాకు తెలియదు నాలుగువేలో,ఐదువేలో నాకు తెలియదు ఫోను నెంబరు ఇదిగో మీరే ఇంకా ఏమైనా అడగదల్చుకొంటే అడగండి అని చెప్పాను. అది జరిగింది. మరిది తోడికోడలు వాళ్ళని అమెరికా మేమే డబ్బులు కట్టి తీసుకు వెళ్లి మూడు నాలుగు నెలలు మా ఇంట్లోనే ఉంచుకుని అన్ని చేస్తే వాళ్ళ అవసరాలు తీర్చుకుని ఈ రోజు మా డబ్బులు పదిహేను లక్షలు ఎగ్గొట్టారు. ఇదండీ బంధువుల రాబందుల గోల!!
ఇక ఉద్యోగం అంటారా!! అది అంతేనండి. పని సంగతి ఏమో కాని రాజకీయాలు బాగా నేర్చుకోవచ్చు. మనం పని చేస్తున్నాము కదా, మళ్ళి దాని గురించి చెప్పడం ఎందుకు? వాళ్లకి తెలుసు కదా!! అనుకుంటాము కాని మనం చేసే పనిని వాళ్ళకిష్టమైన వాళ్ళు చేసారు అని, పని చేసిన మనం ఏమి చేయలేదని, మనకి ఏమి రాదనీ చెప్పడం....ఎవరి దగ్గర నాటకాలు వాళ్ళ దగ్గర వేయడం, చేతలు లేకుండా మాటలు కోటలు దాటించడం...ఇలా మనకు తెలిసిన అనుభవాలే అన్ని. కాదంటారా!! చదివి నవ్వు కుంటున్నారా!! మరి ఇవేనండి నా నాలుగు పదుల అనుభవాల అనుభూతులు కొన్ని.

14 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

గత కొంతకాలంగా మీరు వరసనే సమస్యనెదుర్కొంటున్నారు...హ్యాపీగా ఉన్న moments చాలా తక్కువ అయిఉండవచ్చు. మీరు కొద్దిగా డిప్రెస్డ్ గా ఉన్నట్లుగా నాకు అనిపించింది. మీరు రాసినవన్నీ పెద్ద సమస్యలేమీకాదు. నేను మూడో వ్యక్తిని కాబట్టి objectiveగా చెబుతున్నాను.

చెప్పాలంటే...... చెప్పారు...

సమస్యలు అని నేనేం ఫీల్ కావడం లేదు It's a part of Life. కొద్దిగా డిప్రెస్డ్ గా కాదు అస్సలు డిప్రెస్డ్ గా లేను. నాకు రాయాలి అనిపించి రాసాను అంతే. ఓపిక గా చదివినందుకు చాలా సంతోషం. థాంక్యు

లత చెప్పారు...

నిజమేనండీ రాస్తూ ఉంటే ఎన్ని అనుభవాలు గుర్తొస్తుంటాయో
అయిన వాళ్ళ కంటే స్నేహితులే నయం అనిపిస్తుంది నాకు కూడా చాలా సార్లు

చెప్పాలంటే...... చెప్పారు...

అవును లతగారు

Mauli చెప్పారు...

:) ...గృహ హి౦స చట్ట౦ గురి౦చి అక్కడ పెద్దలు వ్రాస్తున్నవి జోక్స్ గా అనిపిస్తున్నాయి మీ టపా చదువుతు౦టే...హి హి ...

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు చెప్పింది అర్ధం కాలేదు

Tejaswi చెప్పారు...

మౌళిగారు చెప్పింది నాకూ అర్ధం కాలేదు. మరి ఆయన కవిహృదయం ఏమిటో...?

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో మరి మౌళిగారికే తెలియాలి

Mauli చెప్పారు...

:) .మీ టపా పూర్తిగా చదివాక,మొదటి అగ్నాత భావమే నాకూ కలిగి౦ది ....ఇప్పుడే౦ ఫీల్ అవ్వడ౦ లేదని చివరి లో ఒక లైను చేర్చ౦డి :)

గృహ హి౦స చట్ట౦ గురి౦చి ఈ మధ్య జరిగిన చర్చ ల లో, తప్ప౦తా అమ్మాయిలదే అన్నారు,కాని అత్తి౦టి వారు అర్ద౦ చేసికొనే వారు కాకు౦టే,వాల్ల అబ్బాయి తో పాటు వచ్చిన అమ్మాయి కి కూడా తప్పని ఈ టెన్షన్ కనిపి౦చదా అని ..

సమానత్వ౦ ఉన్నచోట భార్యకి భరణ౦ యె౦దుకు ఇవ్వాలి అనేవారు, అదే సమయ౦ లో అదే సమానత్వ౦ ఉన్న అన్న, తమ్ముల్ల కి, చెల్లెళ్ళ కి, అమ్మ నాన్న లకి ఇవ్వడ౦ మాత్ర౦ సబబే?

ఏదేమైనా ..ఇవ్వద్దు అని నేను అనను :)

చెప్పాలంటే...... చెప్పారు...

అలా నేనేం ఫీల్ కావడం లేదని చెప్పాను గా ఇబ్బందులు అందరికి చిన్నవో పెద్దవో ఉంటూనే వుంటాయి....మనది మనకు పెద్ద గా అనిపిస్తుంది వేరే వాళ్లకు చిన్నగా అనిపించొచ్చు. ఇక ఈ చట్టాల గురించి నేను పెద్దగా పట్టించుకోను...మనస్సులో వుండాలి కాని చట్టం పేరు చెప్పి ఇంత వరకు మార్పు తేగలం చెప్పండి....

అశోక్ పాపాయి చెప్పారు...

abbo evanni eppudu rasaru meeru..ento em madya busy undadam valla em chudatam ledu meeru rasinavi :)

చెప్పాలంటే...... చెప్పారు...

పర్లేదులెండి ఆలస్యంగా అయినా చూసారు అదే చాలు....-:)

యెర్రంశెట్టి’s వాయిస్.... చెప్పారు...

మనం కష్టపడేటప్పుడు ఎవరికీ మనం గుర్తు రాము. జీవితంలో గెలిచాక, పైకి ఎదిగాక గుర్తువస్తాము. అదేంటో అండీ ఒకరిని బాధ పెడితే వాళ్ళకి ఏం వస్తుందో నాకైతే అర్దం కాదు.
ఏదేమైనా కానీండి....మీరలా...నవ్వుతూ ఉండండి..... అలా హాయిగా నవ్వేయండి.... ఏదో ఒకరోజు మీ మంచితనం గురించి తెలుసుకుంటారు.

చెప్పాలంటే...... చెప్పారు...

అది వాళ్ళ ఆనందం లెండి.....మంచితనం గురించి వాళ్లకు తెలియక పోయినా పర్లేదు నేను హాపినే అండి శ్రీ రాగం గారు థాంక్యు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner