16, డిసెంబర్ 2010, గురువారం

వందనం అభివందనం!!

నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేదాన్ని.చిన్నప్పుడు కధలు మాత్రమే చదివేదాన్ని. కొంచం పెద్ద అయిన తర్వాత రచయితల, రచయిత్రుల ముఖాముఖి చదువుతూ అబ్బో భలేగా రాస్తున్నారు...పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఎంత బాగా చెప్తున్నారో!! అనుకునేదాన్ని.
ఇప్పుడు మొదట్లో బ్లాగు రాయడం మొదలు పెట్టినప్పుడు అస్సలు నా బ్లాగు ఎవరైనా చూస్తారా!! చదువుతారా!! అనుకునేదాన్ని. ఏమి రాయాలో కూడా తెలియదు, ఎలా రాయాలో కూడా తెలియకుండా ఏదో రాయడం మొదలు పెట్టేసాను. కొన్ని రోజులు ఐనంక కొన్ని బ్లాగులు చూసి ఎంతమంది బ్లాగు చూసారో అని తెలుసుకునే లెక్కల పట్టిని అమర్చాను. తర్వాత కూడలి లో చేరడం, బ్లాగు మిత్రుల పరిచయం,ఇలా మిగిలినవి ఒక్కొక్కటిగా బ్లాగు మిత్రుల సహాయంతో మార్చుకుంటూ వచ్చానన్న మాట. గూగులమ్మ కుడా బాగా సహాయపడింది ఈ విషయంలో....!!
రాయడం మొదలు పెట్టిన కొత్తలో......ఏమి రాస్తే ఏమంటారో అని భయం!! కొన్ని బ్లాగుల్లో కామెంట్లు చూసి అలా అనిపించేది లెండి. ఇంకేముంది ఏమైతే అది అయ్యింది నాకు అనిపించింది రాస్తే పోలా!! అని అలా రాయడం మొదలయ్యింది....కవితలు, కబుర్లు, నిజాలు, ఇలా ఒకటేమిటి...అనిపించినవి, అనుకున్నవి అక్షర రూపంలో రాయడం వాటికి కామెంట్లు వస్తే బోల్డు సంతోషం తో పొంగిపోవడం...కామెంట్లు రాకపోతే అయ్యో ఈ టపా ఎవరికీ నచ్చలేదేమో!! అని కొద్దిగా బాధ పడటం...కామెంట్లకి సమాధానం రాస్తూ ఓ పేద్ద రచయిత్రిని అయిపోయానని ఇంకా పేద్ద ఫీలింగ్ తో...అప్పటి ముఖాముఖిని గుర్తు చేసుకుంటూ నిజంగా భలే వుంది ఆ అనుభూతి!! నేనూ...ఈ అంతు తెలియని మహాసముద్రంలో ఓ చిన్న నీటి బిందువునైనందుకు నాకు చాలా ఆనందంగా వుంది. నా ఈ ఆనందానికి కారణమైన.... నన్ను, నా బ్లాగుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వందనం అభివందనం!!

ఓ మౌనమా!!

మాటలకందని మౌనం...భాషలకందని భావం...
మనసులోని ఊహలకు తెలియని మరో రూపం...
లిపిలేని మౌనాభినయానికి అక్షరరూపం ఇద్దామంటే....
ఓ మౌనమా!! ఇంతకీ...మౌనం అంటే...!!
అంగీకారమా!! అనంగీకారమా!!
అర్ధాంగీకారమా!!

15, డిసెంబర్ 2010, బుధవారం

మరల మరల పలకరించే.....!!



తొలి వలపు తీయదనము
తొలి ముద్దు తీయందనము
మలి పొద్దులో మరల మరల
పలకరించే మధుర జ్ఞాపకమే!!

14, డిసెంబర్ 2010, మంగళవారం

స్వప్నమో కాదో...!!

కలో కలవరమో తెలియని
అయోమయంలో నిదుర కాని
మెలుకువ లోని ఒక స్వప్నం
వేకువలో నిజమయ్యేనా!!
కమ్మని అమ్మ లాలి పాట
నను పరవశింప చేసేనా!!
అమ్మ చల్లని చేతి స్పర్శలోని
వెచ్చదనం నా కందేనా!!
కలైన ఈ కలవరింత లోని
కమ్మదనం, అమ్మదనం అచ్చంగా నాదైతే!!
మెలుకువలోని మరిన్ని నా స్వప్నాలు
వేకువ పొద్దులో నిజమౌతాయి....!!

13, డిసెంబర్ 2010, సోమవారం

తెలుగు బ్లాగుల ద్వితీయ వార్షికోత్సవ కొన్ని కబుర్లు.....

నిన్నటి తెలుగు బ్లాగుల ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా కలిసిన తెలుగు బ్లాగర్లు కొంతమంది...కిందనుంచి కుడినుంచి భార్గవగారు, శ్రీనివాస్ గారు, తాడేపల్లిగారు, నరసింహంగారు, జ్వాలాముఖిగారు, రావుగారు, జ్వాలాముఖి గారి స్నేహితులు, పైన ఎడమ నుంచి శ్రీనివాసరాజు, రహ్మానుద్దిన్ షేక్ గారు, రవిచంద్రగారు, రవిచంద్ర అర్ధాంగి నీలిమ, మంజు, మాలాకుమార్ గారు, ఉమగారు....ఫోటోలో సుజాత గారు లేరు ఎందుకంటే ఆవిడే ఫోటో తీసారు...-:).
కొద్దిగా అంటే బానే ఆలస్యంగా అందరూ వచ్చారు.ముందుగా నేను లోపలి వెళ్ళేటప్పటికే నరసింహం గారు తెలుగు బ్లాగర్ల కోసమా అని అడిగారు.ముందుగా నాకు ముఖ పరిచయం అయినది నరసింహం గారితోనే. చాలా సేపు ఎదురు చూసిన తరువాత రావు గారు పలకరించారు.ఈ లోపల మాలానే అందరికోసం వెతుక్కుంటున్న మాలాకుమార్ గారు కనిపించారు. మా పరిచయాలయిన తరువాత మిగిలిన వాళ్ళు అందరూ కలిసారు. బ్లాగుల గురించి, ఈ తెలుగు స్టాల్ గురించి చర్చించారు. ఆఖరులో జ్యోతిగారు కుడా వచ్చారు....ఇవండీ కృష్ణకాంత్ పార్కులోని నిన్నటి సాయకాలపు కొన్ని కబుర్లు.....

మనసారా...

మొన్ననే మనసారా సినిమా చూసాను. ఓ మామూలు ప్రేమ కధని రవిబాబు తనదైన స్టైల్ లో చాలా బాగా తీసారు. ప్రేమకు అందం,డబ్బు, ధైర్యం...లాంటివి అక్కరలేదు, అందం లేని పిరికి వాడు కుడా ప్రేమను గెలిపించుకోవచ్చు అని ఒక కొత్త తరహాలో తనదైన బాణిలో తెరకెక్కించిన సినిమానే మనసారా...పాటలు కుడా వినసొంపుగా ఎంతో బావున్నాయి. కేరళ లోని అతి ప్రాచీన కళ అయిన కళరి పోటితో మొదలైన సినిమా దానితోనే ముగుస్తుంది. కళరి పోటిలో బంగారు పతకం సాధించిన వాడితో ఓ పిరికి వాడు ప్రేమను గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ మనసారా...సినిమా. చివరి వరకు మాటలు కాని, పాటల సంగీతం కాని, ఫోటోగ్రఫి కాని ఎంత బాగుందంటే....ఎక్కడా అసభ్యత అనేది లేకుండా తీసిన ఓ మంచి సినిమా!!
ఇక్కడ నాకు అర్ధం కాని విష్యం ఒక్కటే....చాలా రివ్యూస్ చూసాను కాని ఒక్కటి కుడా నిజాయితీగా అనిపించలేదు. మరి మంచి సినిమాలకు కుడా సరిగ్గా రాయలేనప్పుడు ఇక ఎందుకో ఈ వెబ్సైట్లు.....!!

10, డిసెంబర్ 2010, శుక్రవారం

రాదా మాధవీయం....!!



చిరుగాలి సరాగాల సడిలో
చిటపట చినుకుల సవ్వడిలో
జలతారు పండువెన్నెల పరదాలలో
మరుమల్లెల గుభాళింపులో
మనసును చుట్టుముట్టిన తలపులతో
నడిరేయి గడచినా రాని మాధవుని రాకకై
యమున ఒడ్డున ఆశగ ఎదురు చూసేను రాధ!!

రాష్ట్ర రాజకీయాలు...నేతల పయనమెటో!!

నిన్న సోనియా గారి గురించి రాసింది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. కొందరికి బాధ కలిగి ఉండొచ్చు, మన్నించండి...
కాని నాకు నిజం అనిపించినదే రాస్తాను ఎవరికోసమో నా అభిప్రాయాల్ని మార్చుకోను. ఈ రోజుకి జనం రాజశేఖర్ రెడ్డి గారిని తలచుకుంటున్నారంటే మంచో, చెడో తనను నమ్మిన వారికి ఏ ఆపదా రానివ్వరని అందరికి ఒక బలమైన నమ్మకం....అది ఆయన నిజం చేసుకున్నారు కుడా!! మరి ఆ రక్తమే పంచుకున్న జగన్ ఏమి చేస్తారో!! నాకు చిన్నప్పటి నుంచి కమ్యూనిష్టు పార్టి అంటే ఇష్టం. తరువాత వచ్చిన తెలుగు దేశం, మొన్ననే వచ్చిన ప్రజారాజ్యం , రేపో మాపో రాబోయే జగన్ పార్టి ఇలా ఏ పార్టి వచ్చినా ప్రజలకు ఎంతో కొంత మంచి చేస్తే దానిని కొన్ని రోజులు గుర్తు ఉంచుకుంటాము. ఇంతకు ముందు కుడా తుఫానులు, భూకంపాలు, ప్రకృతి విలయాలు చాలా వచ్చాయి కాని మాకు ఎప్పుడూ ఒక్క సాయం కుడా అందలేదు. వై.ఎస్.ఆర్ గారు అలాంటివి కొన్ని చేసారు...బాంకు రుణాలు, అందరికి ఆరోగ్య సేవలు...స్వర్గీయ ఎన్.టి.ఆర్ గారు మొదలు పెట్టిన కిలో బియ్యం, మధ్యాన్న భోజన పధకం మళ్లీ అమలు చేసారు. ఇక రైతులకు ఉచిత కరెంట్, పేదలకు పక్కా ఇళ్ళు...ఇలా కొన్ని మంచి పనులు చేయ బట్టే ఇంకా ప్రజల్లో వీళ్ళు చిరంజీవులుగా మిగిలున్నారు. చూద్దాం జగన్ వస్తాడో లేదా మరొకరెవరైనా వస్తారో, ఏ నేతల పయనం ఎటువైపో... ప్రజలకు ఏమి చేస్తారో కొన్ని రోజులు వేచి చుస్తే చాలా ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయేమో!!
మన ఆకలి తీరితేనే కదా పక్క వాళ్ళ ఆకలి గురించి కొంత మందైనా ఆలోచిస్తారు? రాబోయే ఎన్నికల్లో అయినా కొద్దిగానైనా జనానికి మంచి చేసే నేతలను ఎన్నుకోవాలని, అందరూ ఆలోచించాలని, పసిడి పంటల పచ్చని ఆంధ్ర రాష్ట్రం అన్నింటిలో అగ్రగామిగా విలసిల్లాలని మన అందరి కోరిక...

9, డిసెంబర్ 2010, గురువారం

ఈ సారి అమ్మగారి కానుకేంటో..!!

సరిగ్గా ఇదే రోజు ఒక సంవత్సరం క్రిందట ఏమి జరిగిందో ఆంధ్రులైన అందరికి గుర్తు వుండే వుంటుంది. అధిష్టానం ఆదిదేవత సోనియా అమ్మగారు పుట్టినరోజు కానుక గా ఆంద్రరాష్ట్రాన్ని రెండుముక్కలు గా కత్తిరించి తమిళతంబి చిదంబరం గారితో తెలంగాణా ఇస్తామని ప్రకటన చేయించి అగ్నికి ఆజ్యం పోసి అది ఆరకుండా ఢిల్లి నుంచి గల్లి వరకు రాజకీయ చక్రం అలఓకగా తిప్పుతున్న అపర ఆదిదేవత. పరాయి దేశస్థురాలైనా భారతావనిని తన గుప్పిటలో పెట్టుకుని వ్యక్తి పూజకు ప్రాధాన్యం ఇచ్చి అవకతవకలను, అవినీతిని తనకనుకూలంగా మలుచుకుని తను చెప్పిందే శిలాశాసనంగా అమలుపరుస్తోన్న అఖండ ప్రతిభాముర్తి. తన కొడుకుని ప్రధానిగా గద్దె ఎక్కించడానికి అడ్డంకులు, అవరోధాలు లేకుండా చేస్తూ, ఎంతైనా విదేసీయురాలు కదా!! విభజించి పాలించడం లోని కిటుకులు బాగా ఒంటబట్టించుకుని ఆచరణలో పెడుతున్న అసామాన్యురాలు...!! అందరూ మరచి పోయిన భోఫోర్సు కుంభకోణాన్ని అలానే వదిలి ఎందరో ప్రతిభావంతులు, వివేకవంతులు, రాజకీయ పండితులను పదవి కోసం అధికారం కోసం తన చుట్టూ కుక్కల కన్నా హీనంగా తిప్పుకుంటున్న మేడం గారు ఎంత గొప్ప!! ఇది తిరుగులేని సత్యం!! ఎంతో ఘన కీర్తిని, అత్యున్నత శిఖరాలను అందుకున్న నాటి భారతావని పరిస్థితి నేడో రేపో ఏ దుస్థితిలో వుండబోతోందో!!
మరి ఈ సారి పుట్టినరోజు కానుకగా ఏ బహుమతిని అమ్మగారు అఖిలాండ భారతీయులకు అందజేయనున్నారో!! ఎదురు చూద్దాం రిక్తసిక్త రక్తవర్ణ హస్తాలతో...!!

8, డిసెంబర్ 2010, బుధవారం

గుర్తుకొస్తున్నాయి....

గుర్తుకొస్తున్నాయి....గుర్తుకొస్తున్నాయి....
ఆనాటి ఆనందాలు....అనుబంధాలు...
నేస్తాలతో గిల్లికజ్జాలు...దోబూచుల దొంగాటలు...
కోపంతో ఏడుస్తూ రాసిన కతలు...వేసిన బొమ్మలు...
శివాలయంలో విభూది ప్రసాదాలకై తోపులాటలు...
ఇలా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాల దొంతరలు....
మళ్ళి ఆ అనుభూతుల పరిమళాలు చుట్టుముట్టి
మరొక్కమారు పలకరించితే!!

7, డిసెంబర్ 2010, మంగళవారం

ధనం మూలం మిదం జగత్!!

డబ్బులు, అవసరం ఎవరివైనా ఒక్కటే. మనం ఎదుటివారికి ఇవ్వాల్సినా, మనకు వాళ్ళు ఇవ్వాల్సినా ఏదైనా ఒక్కటే. కాని కొంత మంది కాదు...కాదు నూటికి తొంభైతొమ్మిది మంది వాళ్ళవి మాత్రమే అవసరాలు, వారికి రావాల్సినవి మాత్రమే డబ్బులు అనుకుంటారు. మూడు ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు అయినా వాళ్లకి తిరిగి ఇవ్వాల్సినవి గుర్తు రావు. దీనికి నా ఫ్రెండ్ ఒకరు ఉదాహరణ. కొంత మందేమో తిని అస్సలు తమకేమి సంబంధం లేనట్లు వుంటారు. అలా వుంటే అడిగి అడిగి వాళ్ళే పోతారులే అన్న ధీమా అన్నమాట వాళ్లకి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇంతకుముందు చెప్పాను శాం వేజెండ్ల అని డెట్రాయిట్ లో ఉంటాడు చాలా జాగ్రత్త గా వుండండి వాడితో. ఇంకొంత మందేమో వాళ్ళ అవసరాలకి ఎలాంటి పాపపు పని చేయడానికైనా వెనుకాడరు. తల్లి, చెల్లి, అన్న, అక్క, నాన్న ఇలా ఏ బంధాలు వారికి గుర్తు వుండవు. బాధ్యతలకు డబ్బు వుండదు కాని వాళ్ళ జల్సాలకు ఎదుటి వారితో మూడు నెలల్లో ముప్పైవేల డాలర్లు ఖర్చు పెట్టిన్చగల ఘనులు. అది మాత్రమే కాకుండా పెట్టిన చేతిని కాటు వేసే ఒంటినిండా విషమున్న విష జీవులు. వీరిని మనుష్యులతో పోల్చలేము. దీనికి మా మరిది తోడికోడలు సాక్ష్యం అని చెప్పడానికి చాలా సిగ్గుగా వుంది. జాగ్రత్తన్డోయ్ వీళ్ళతో...!! వీళ్ళకి అమెరికా రావడానికి, అక్కడ తిరగడానికి కారు, జల్సాలకి, అన్నిటికి మమ్మల్నే పావులు గా వాడుకున్నారు. ఇక ఇంకో రకం ఏంటంటే బంధాలు, బాద్యతలు అన్ని మేమే మోస్తున్నాము అంటూ అందరి దగ్గరా డబ్బులు తీసుకుని బయటి వాళ్ళ దగ్గర ఎవరు ఏమి ఇవ్వలేదు అన్ని మా నెత్తిన వేసుకుని అన్ని మోస్తున్నాము అంటూ నాటకాలు వేస్తారు.
ఎవరికైనా కష్టపడితేనే డబ్బులు వస్తాయండి ఊరికినే చెట్టుకి కాయవు కదా!! మన డబ్బులు మనకి ఎంతో ఎదుటి వారివి కుడా అంతే అని తెలుసుకుంటే.....ఎంత బావుంటుంది!! ఏదో ఇలా అప్పుడప్పుడు నా చేదు అనుభవాలు కుడా అందరితో పంచుకుంటే కొద్దిగా ప్రశాంతం గా ఉంటుందని + కొంత మంది అయినా వీళ్ళ బారిన పడకుండా ఉంటారని ఆశతో....!!-:))

6, డిసెంబర్ 2010, సోమవారం

ఏదో తెలియని......!!

మాటల మాటున దాగిన మౌనమా!!
మనసులోనే నిండిన మమకారమా!!
మరుపే తెలియని మదిలో పదిలమైన
అనుభూతుల సడిలో నాలో దాగిన
రెప్ప చాటు స్వప్నమా !!
కలో...కలవరమో...!!
మరుపో...మమతో...!!
అలుపో...ఆహ్లాదమో...!!
ఆనందమో...అడియాశో... !!
ఏది తెలియని అయోమయమో...!!!
ఇదేనేమో జ్ఞాపకం అంటే!!

26, నవంబర్ 2010, శుక్రవారం

కిరణం వాడి వేడి....

మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తన వాడి వేడి కిరణాల ప్రతాపం ప్రతిపక్షానికి చూపించినట్లు రాష్ట్ర అభివృద్దిలో కుడా చూపించి అంధకారాన్ని పారద్రోలతారో లేక అమ్మగారి కి సలాములు, గులాములు చేస్తూ చప్పగా చల్లారి పోతారో.....అది కాక పొతే ఇంకా ఎంత మంది అనుకోని అదృష్టం పట్టబోయే ముఖ్యమంత్రులు అమ్మగారి లిస్టులో వున్నారో మరి!! జస్ట్ వెయిట్ అండ్ సీ !!

ఊసులాడే ఒక జాబిలట.......

ఇళయరాజా గారు స్వరపరచిన మధుర మనోహరమైన పాట ఇది. హృదయం లోని ఈ పాట... తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అమ్మాయికి చెప్పలేక..... పాటగా చెప్పిన తీరు ప్రతి ఒక్కటి మనసును కదిలిస్తుంది. సినిమా కుడా చాలా చాలా బావుంటుంది. మురళి ఇప్పుడు మనమద్యన లేక పోయినా ఈ పాటతో మన అందరి హృదయాలలోనూ ఎప్పటికీ మిగిలిపోతారు....మీకోసం పాట లింక్ ఇక్కడ....
http://www.youtube.com/watch?v=3MizZdc-u1Y

ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట 2
చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం *ఊసులాడే *

అందాలే చిందే చెలి రూపం నా కోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేను జపించేను రోజూ
నే చూసేటి వేళ అలై పొంగుతాను
మౌనం సగమై మొహం సగమై
నేనే నాలో రగిలెను *ఊసులాడే *

నాలోన రేగేనే పాట చెలి పాట
నీడల్లే సాగే నీ వెంట తన వెంట
స్వరాలై పొంగేనా వరాలే కోరేనా
ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా
ఒకటై ఆడు ఒకటై పాడు
పండగ నాకు ఏనాడు *ఊసులాడే *

24, నవంబర్ 2010, బుధవారం

అంధకారం లో ఆంధ్ర దేశం

మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చని పోయిన తరువాత జరిగిన జరుగుతున్న ఆధిపత్యపు పోరు చూస్తూ వుంటే ముఖ్యమంత్రి గా వున్న రోశయ్యగారే సమర్ధవంతమైన నాయకుడు అనిపించింది నాకు ఇప్పటికి. మొత్తానికి అన్ని వైపుల నుంచి ఒత్తిడితో రోశయ్యగారి రాజీనామా కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. ఇష్టం లేక పోయినా కష్టంగానే ముఖ్యమంత్రి పదవిని త్యజించిన త్యాగశీలి. ఇప్పటి వరకు అధిష్టానం ఎలా చెప్తే అలా తల ఆడించిన రోశయ్యగారు వయోభారంతో అలసి, సంవత్సరం నుంచి...ఇంటా బయటా సమస్యలతో సహవాసం చేసి "మింగమంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం" చందాన అందరితో వేగ లేక చేతులెత్తేశారు. ఇంకేముంది ఎప్పటినుంచో దీనికోసమే ఎదురు చూస్తున్న ఎందరో మహానాయకులం అనుకునే వారు అందరూ నేనంటే నేనని...ముఖ్యమంత్రి పదవి నాదంటే నాదని సామ, దాన, బేధ, దండోపాద్యాయాలను అలుపెరుగని పోరాట పటిమను వారి వారి రీతులలో ప్రదర్శిస్తూ అమ్మగారి సేవలో తలమునకలు అవుతున్నారు.
"వారసత్వ,కుల,వర్గ,ప్రాంత,ధన రాజకియాల తో విసిగి రోషం తో రాజీనామా సమర్పించిన రోశయ్య
రోషంలేని రోశయ్య అని వ్యంగ్యం చేసిన ప్రతి ఒక్కరికి రానున్న ఆర్ధిక మాంథ్యాన్నే గుణపాఠం గా వదిలి వెళ్తున్న ఆర్ధిక మేధావి"
మరి అధిష్టానం దేవత ఎవరి పై కరుణ చూపుతారో పట్టం ఎవరికీ కడతారో....మళ్ళి పేరు ఎలా మారిపోతుందో చూడాలంటే కొంత కాలం...కొంత కాలం ఎదురు చూడాల్సిందే....అప్పటి వరకు తెలుగు ప్రజానీకం అమ్మగారి ఆజ్ఞా ఏంటా అని బిత్తర చూపులు చూస్తూ అంధకారంలో మగ్గాల్సిందే!!

23, నవంబర్ 2010, మంగళవారం

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు....

ఇళయరాజా గారు స్వరపరచిన పాపా లాలి చిత్రంలోని ఓ చక్కటి పాట ఇది. బాలు గారి గాన మాధుర్యానికి మాత్రమే కాకుండా వారి అసమాన ప్రతిభకు తార్కాణం ఈ పాట..పల్లవి, చరణాలు ఆపకుండా పాడటం ఈ పాట ప్రత్యేకత. మీరు వినండి చూడండి. లింక్ మీకోసం ఇక్కడ......
http://www.oonly.com/video/ASh2neJpH_M/Maate_Raani_Chinnadani

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే!

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలు కొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే !!

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

22, నవంబర్ 2010, సోమవారం

మూలకారణం......???

నాకు తెలిసిన ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ తో ఒక అమ్మాయి కలిసి వుండే వాళ్ళు. ముందు చాలా మందే కలిసి వుండే వాళ్ళు. అమెరికాలో మాస్టర్స్ అంటే అది మామూలే లెండి. అందరు కలిసిమెలిసి చాలా బావుండేవాళ్ళు. మేమున్న ఊరిలో రెండు యూనివర్సిటీలు ఉండేవి. స్టూడెంట్స్ బాగా ఎక్కువ గానే వుండేవాళ్ళు. మొదట్లో మాకు బాగానే హెల్ప్ చేసారు, తమ్ముడు కాదులెండి అన్న. తరువాత ఇంట్లో పిల్లలానే వుండేవాళ్ళు అందరును. తమ్ముడికి, అన్నకి గొడవ వచ్చి తమ్ముడు మా ఇంట్లో కొన్ని రోజులు వున్నాడు. తర్వాత వేరే ఊరు వెళ్ళిపోయాడు ఏదో జాబు, బిజినెస్ అని. వెళ్ళే ముందురోజు అన్నతో, ఆ అమ్మాయి తో చెప్పిరా అంటే వెళ్లి...మొత్తానికి వాళ్ళ మద్యలో గొడవ పోయి మాములుగా అయిపోయారు. ఇక తరువాత మాతో మాట్లాడటం మానేశారు. అప్పటికి ముగ్గురికి పెళ్ళిళ్ళు కాలేదు. కొన్ని రోజులకి అమ్మాయి కి కుదిరింది. నేను వేరే ఊరిలో వుంటే ఫోన్ చేసి చెప్పింది. తరువాత పెళ్లి ఐనంక కుడా ఒకటి రెండు సార్లు ఇంటికి వచ్చి వెళ్ళింది కాని ఈ అన్నదమ్ములు మాత్రం ఒక్క మాట కుడా చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందరు నన్ను నవ్వే వాళ్ళు "నీకు నలుగురు కొడుకులు" అని. ఇదండీ నా కొడుకులు కాని కొడుకుల ఇద్దరి సంగతి సూక్ష్మంగా.. ఎక్కువగా రాశాననుకోండి మళ్ళి ఇప్పటికే కోపంగా వున్న వాళ్లకి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది తట్టుకోలేను. అస్సలే ఈ మద్య రాసిన తల్లిని చూడని కొడుకు సంగతికి కొంతమంది నా మీద బోల్డు కోపంగా వున్నారు, కారాలు మిరియాలు నూరుతున్నారు. మరి తప్పుని తప్పు అనకుండా వుండటం ఎలా? చెప్పండి.
అదే ఊరిలో ఇంకొక ఫ్యామిలి వుండేవాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే. ఆమె,వాళ్ళ బాబు వచ్చిన కొత్తలో నుంచి మేము ఇండియా వచ్చే ఒక ఐదు, ఆరు నెలల ముందు వరకు మాతో చాలా చాలా బావుండే వాళ్ళు. మరి ఏమైందో తెలియదు నాకు ఇప్పటికి కుడా, ఎంతో బావుండే వాళ్ళు కుడా సడన్ గా రావడం, మాట్లాడటం మానేశారు.
ఇంకొక ఆవిడ కుడా అంతే. ఇండియా వచ్చే వరకు బానే వుంది మరి ఏమైందో తెలియదు ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే పెడసరంగా మాట్లాడింది. మరి ఆవిడ బాదేంటో!!
మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలి ఒక రెండు మూడు నెలలు మా ఇంట్లోనే వున్నారు తనకి జాబ్ లేక పొతే. తరువాత వేరే ఇల్లు తీసుకుని అక్కడే వున్నారు కొన్ని రోజులు. మా ఫ్రెండ్ జాబు కి వేరే ఊరు వెళ్ళినా తను మాదగ్గరలోనే వుండేది పిల్లలతో. చాలా మార్పులు ఆ తర్వాతే వచ్చినట్లు అనిపించింది నాకు. అయినా చెప్పే వాళ్ళు ఎప్పుడూ వుంటారు వినే వాళ్ళదే తప్పు నా దృష్టిలో.
ఏంటి ఈ సోది ఎందుకు చెప్తున్నాను అంటారా !! అక్కడికే వస్తున్నా అన్నిటికి మూలకారణం ఈ పాటికి మీకు అర్ధం ఇయ్యే వుండాలి కదా!! అదేనండి బాబు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ.... చెప్పుడు మాటలు వినడం, వినడమే కాకుండా నమ్మడం.

21, నవంబర్ 2010, ఆదివారం

బ్లాగ్ వనభోజనాల స్పెవల్ - సొరకాయ కోఫ్తా

సొరకాయ కోఫ్తా కి ఏమి కావాలో ముందుగా చెప్తాను అందరూ వింటున్నారా!!( చదువుతున్నారా!!) అయితే సరే!!
కొద్దిగా లేత సొరకాయ, కూరకి సరిపడినంత మంచినూనె, కొద్దిగా కారం, సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా కొద్దిగా గరం మసాలా, సెనగపిండి కోఫ్తాలకు సరిపడినంత ఇంకా కొత్తిమిర, కరివేపాకు, చాలా కొంచం చింతపండు, ఉల్లిపాయముక్కలు, కొన్ని పర్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగినవి, టమాట ముక్కలు కుడా బాగా చిన్నగా తగిగినవి... తాలింపుదినుసులు, జీడిపప్పు పొడి కొంచం గుర్తు ఉన్నంత వరకు ఇవేనండి
ఇక కూర చేయడం ఎలా??
ముందుగా సోరకాయను పైపెచ్చు(తోలు) తీసి కొబ్బరి తగినట్లుగా సొరకాయ కోరు తీసి పెట్టుకోవాలి. ఒక పళ్ళెం లో కాని లేదా చిల్లుల ప్లేట్ లో కాని కొద్ది సేపు ఉంచితే సొరకాయ లోని నీరు బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారి బాగా పిండితే మిగిలిన నీరు ఏమైనా వుంటే అది కుడా వచ్చేస్తుంది. అప్పుడు దీనిలో ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, కోఫ్తాలకు సరిపడినంత సెనగపిండి వేసి బాగా కలుపు కోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కోఫ్తాలుగా చేసుకుని పొయ్యి వెలిగించి, స్టౌవ్ మీద పాన్ పెట్టి పాన్లో నూనె ఎక్కువగా పోసి కోఫ్తాలను బాగా వేయించి తీసి పక్కన పెట్టుకుని, వేరే పాన్ స్టవ్ పై పెట్టి పాన్ లో కొద్దిగా నూనె వేసి తాలింపు పెట్టి పర్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు వేసి బాగా మగ్గిన తరువాత కొద్దిగా చింతపండు వేసి కొన్ని నీళ్ళు పోసి వుడకనివ్వాలి. కాస్త వుడికిన తరువాత వేయించి పక్కన పెట్టుకున్న సొరకాయ కోఫ్తాలు వేసి, జీడిపప్పుల పొడి చల్లి కొద్ది సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్ లోకి కూర తీసుకుని పైన కొత్తిమీర చల్లితే వనభోజనాలకి వడ్డించడానికి సొరకాయ కోఫ్తా కూర రడీ అయిపోయినట్లే.
మరి రుచి చూసి చెప్పండి ఎలా వుందో!!

19, నవంబర్ 2010, శుక్రవారం

అనుకోనిది.....

ప్రేమలో ప్రాణంగా
కోపంలో అలుకలా
మౌనంలో మాటగా
ఉహలో ఊసులా
బాధలో కన్నీరుగా
ఆనందంలో చిరునవ్వులా
నీ గుప్పెడంత గుండెలో చోటు చేసుకున్న
నా జ్ఞాపకం నాకెంతో ఇష్టం!!

18, నవంబర్ 2010, గురువారం

అందమైన ప్రేమలేఖ....

గుణ సినిమా లోని వెన్నెలకంటి గారు రాసిన ఈ పాటని ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు శైలజ మాట్లాడుతూ పాడిన మధురగీతం. నాకు చాలా చాలా నచ్చిన పాటల్లో ఇది ఒకటి. కమల్ నటన చెప్పడానికి మాటలు చాలవు. అమాయకమైన మాటలతో ప్రేమను ప్రియురాలికి చెప్పే విధానం అందరికి ఎంతో నచ్చుతుంది....

మీ కోసం విడియో లింక్ ఇక్కడ http://www.youtube.com/watch?v=x7pFz4E8Vso

అబ్బాయి : రాయి
అమ్మాయి : ఏం రాయాలి
అబ్బాయి : లెటర్
అమ్మాయి : ఎవరికీ
అబ్బాయి : నీకు
అమ్మాయి : నాకా..?
అబ్బాయి : ఊ..
అబ్బాయి : నాకు వ్రాయటం రాదూ, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా..
అమ్మాయి : వెయిట్, వెయిట్.....
అమ్మాయి : నాకు నువ్వు రాసే ఉత్తరం, నేను రాసి...
అబ్బాయి : నాకు చదివి వినిపించి తరువాత నువ్వు.. చదువుకో
అమ్మాయి : ఐ లైక్ ఇట్ ..ఊ.. చెప్పు
అమ్మాయి : ఊ....
అబ్బాయి: ఆఆ..
అబ్బాయి : నా ప్రియా...ప్రేమతో.. నీకు
అమ్మాయి : నీకు
అబ్బాయి: నే..
అమ్మాయి : రాసే..
అబ్బాయి : నేను
అమ్మాయి : ఊ....
అబ్బాయి : రాసే
అమ్మాయి : ఉత్తరం.
అబ్బాయి: ఉత్తరం..లెటర్..చ...లేక..ఊ... కాదు..ఉత్తరమే అని రాయి
అమ్మాయి : ఊ..అదీ
అబ్బాయి : చదువు..
అమ్మాయి : కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
అబ్బాయి : పాటలో మర్చి రాసావా..అప్పుడు నేను కూడా మారుస్తా..
అబ్బాయి : మొదట నా ప్రియా అన్నాను కదా , అక్కడ ప్రియతమా అని మార్చుకో..
అబ్బాయి: ప్రియతమా నీవింట్లో క్షేమేమా.. నేను ఇక్కడ క్షేమం
అమ్మాయి: ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
అబ్బాయి : ఆహా....ఒహో.. నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది
అబ్బాయి : కానీ అదంతా రాయాలని కూర్చుంటే, అక్షరాలే..మాటలే...!
అమ్మాయి: ఉహలన్ని పాటలే కనుల తోటలో..
అబ్బాయి : అదీ...
అమ్మాయి : తొలి కలల కవితలే మాట మాటలో....
అబ్బాయి : అదీ...ఆహా..భ్రమ్మాండం...కవిత..కవిత..ఊ...పాడు...

కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహలన్ని పాటలే కనుల తోటలో..
తొలి కలల కవితలే మాట మాటలో....
ఓ హో...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
లాల ల ల ల లా ల ల...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
లాల ల ల ల లా ల ల...

అబ్బాయి: ఊ...
అబ్బాయి : నాకు తగలిన గాయం అదీ చల్లగా మానిపోతుంది..
అబ్బాయి : అదేమిటో నాకు తెలీదు, ఏమి మాయో తెలీదు నాకు ఏమి కధసలు..
అబ్బాయి : ఇది కూడా రాసుకో...
అబ్బాయి : అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ అలాంటివి వేసుకోవాలి ఆ......
అబ్బాయి : ఇదిగో చూడు నాకు ఏ గాయం అయ్యినప్పటికి ఒళ్ళు తట్టుకుంటుంది
అబ్బాయి : నీ వొళ్ళు తట్టుకుంటుందా..?
అబ్బాయి : ఉమా దేవి....దేవి ఉమా దేవి...
అమ్మాయి : అది కూడా ర్యాల..?
అబ్బాయి : ఆహా..హా....
అబ్బాయి : అది ప్రేమా....
అబ్బాయి : నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక ఇదవుతుంటే
అబ్బాయి :ఏడుపు వస్తోంది...
అబ్బాయి : కానీ నేను ఏడ్చి.. నా శోకం నిన్ను కూడా బాధ పెడుతుంది అనుకున్నపుడు
అబ్బాయి : వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది.
అబ్బాయి : మనుషులు అర్ధం చేసుకునేందుకు ఇది మాములు ప్రేమ కాదు..
అబ్బాయి : అగ్ని లాగ స్వచ్చమైనది...

గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే,
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే.....
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు,
పువ్వు సోకి నీ సోకు కన్దేనే...
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధార లోన కరుగుతున్నది....
నాడు సోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది...
మనుషులేరుగా లేరు,
మామూలు ప్రేమ కాదు,
అగ్ని కంటే స్వచ్చమైనది...
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా..
సుభ లాలీ లాలి జో
లాలి లాలి జో...
ఉమా దేవి లాలి జో..
లాలీ లాలి జో
మమకారమే....ఈ లాలి పాట గా
రాసేది హృదయమా....
నా హృదయమా.....

17, నవంబర్ 2010, బుధవారం

శుభాకాంక్షలు




శ్రీ & శ్రీమతి అరికేసరి గారి ముద్దుల పాపాయి
చిరంజీవి శ్రీవల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు

16, నవంబర్ 2010, మంగళవారం

ఎవరో ఒకరు...ఎపుడో అపుడు

అంకురం లోని ఈ ఆణిముత్యం లాంటి పాటలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత స్పూర్తిని, ఓ క్షణం ఐనా సమాజం గురించి ఆలోచించేటట్లు చేసే ఈ పాట చాలా చాలా ఇష్టం. ఈ సినిమా కుడా చాలా బాగుంటుంది. ఓ మహిళ న్యాయం కోసం, నమ్మిన నిజం కోసం చేసే పోరాటమే...అంకురం. రేవతి నటన అద్భుతం. సీతారామశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన మరో అద్భుతమైన పాట. హంసలేఖ స్వరపరచిన ఈ స్వర మధురం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మధురమైన ఆణిముత్యమే.....

ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...

ఆఆ.ఆఆ...మొదటి వాడు ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి
వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు..అటో ఇటో ఎటో వైపు...

కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా...
అనుకుని కోడి కూత నిదరపోదుగా...
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వాన ధార రాదుగా నెల దారికి
ప్రాణమంటూ లేదుగా బ్రతకడానికి

ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...

చెదరక పోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాల రాతిరి
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపని కాంతి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా..
జాలి చూపి తీరమే దరికి చేరునా

ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...

యుగములు సాగిన నింగిని తాకక..
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా..
ఒటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్లి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్ల బారడా

ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...

నీతో నువ్వు నిజాయితీ గా వుండు

అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది కొంతమందిని చూస్తూ వుంటే....ఎప్పుడూ నటిస్తూనే వుంటే మనతోనే కాకుండా వాళ్ళతో వాళ్ళు కుడా నటిస్తూనే వుంటారేమో అని. నటనే నిజమనే భ్రమలోనే బతుకుతున్నారేమో అని. పోనీ అందరితో గొడవలు ఎందుకులే సర్దుకు పోయే మనస్తత్వమా అంటే అదీ కాదు. ఎక్కడి మాటలు అక్కడ చెప్పి పబ్బం గడుపునే నైజం అని అనిపిస్తోంది..తప్పుని ధైర్యం గా తప్పు అని చెప్తే అదీ తప్పే ఇలాంటి వాళ్ళ దృష్టిలో. అందరికి చెప్తారు "వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి, మోహమాటం లేకుండా మాట మోఖానే అడుగుతారు". దూరంగా వుండండి అని ఇలా చాలా జాగ్రత్తలు చెప్తారు. మరి వీళ్ళు మాత్రం అందరితో బానే నటిస్తారు. ఇంట్లోను, బయట కుడా నటించాల్సి రావడమంత దురదృష్టం మరోటి లేదు. పాపం వాళ్ళు అనుకుంటారు అబ్బో మనకు అందరి దగ్గర చాలా మంచివాళ్ళమని పేరు వుంది అని, కాని నటిస్తే ఎన్ని రోజులు నిజాన్ని దాచగలం చెప్పండి? ఏదో ఒక రోజు బయట పడక తప్పదు కదా! ఒక్కో సారి చెప్పాలనిపిస్తుంది "కనీసం రోజులో క్షణం ఐనా నీతో నువ్వు నిజాయితీ గా వుండు" అని.
మనకు నచ్చినట్లు మనం వుంటే అది నచ్చిన వాళ్ళే మనకు దగ్గరగా వస్తారు. ఇష్టం లేని వాళ్ళు మనతో ఇష్టం వున్నట్లు నటిస్తే మనకు ఒరిగేదేం లేదు కదా!! ఎవరికైనా కోపం వస్తే తిట్టుకోకండి....-:)

15, నవంబర్ 2010, సోమవారం

ఈ నాటి పిల్లలు కాదు కాదు పిడుగులు

నిన్న ఇంట్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పాలి మీకు...
నిన్న రాత్రి ఏడు ఎనిమిది మద్యలో ఇంట్లో అందరం టి.వి చూస్తూ వున్నాము. మా చిన్నాడు సౌర్య కి రెండు రోజుల నుంచి గుర్తు రాని హోంవర్క్ చెయ్యాలని అప్పుడే గుర్తు వచ్చి పుస్తకాలు ముందేసుకుని డైరి లో చూసి... అమ్మా చెప్పు ఏమి చెయ్యాలో అంటే డైరీ లో చుస్తే నాకు అర్ధం కాలేదు వాడు రాసిన Q1,2 ని క్విజ్ గా అనుకుని చెప్పాను. అందరికి చూపించాడు ఓ పది, పదిహేను నిముషాల సేపు. మాకు ఎవరికీ సరిగా అర్ధం కాలేదు. పెద్దవాడు మౌర్య ని చూడరా వాడి డైరి లో ఏమి రాసారో అంటే వాడు రాసింది నాకేం తెలుస్తుంది అన్నాడు. ఈ లోపల సౌర్య నాకు చేతికి పాడ్ ఇస్తే పట్టుకున్నాను, బుక్స్ తీసుకుంటాడేమో రాసుకోవడానికి అనుకుంటుంటే ఇంగ్లిష్ బుక్ ఇచ్చి రాసిపెట్టు ఒక్కటే అమ్మా అంటే సరే అని మొదలు పెడితే వాడి రాత కొన్ని అర్ధం కాలేదు చెప్పరా అంటే "నువ్వు ఫస్ట్ క్లాసు ఎలా చదివావు?" అన్ని నన్ను అడుగుతున్నాడు. వాడు చదివి మళ్ళి దానికి మీనింగ్ చెప్పి ఇది కుడా రాకుండా ఎలా చదివావు? అని అనడం ఇంట్లో అందరు వాడి మాటలకు నవ్వడం. ఇలా మొత్తం హోంవర్క్ అంతా నాతోనే చేయించాడు. ఇంతకు ముందు ఓసారి కుడా ఇలానే అప్పుడు తెలుగు. ఓ బుక్ ఇచ్చి అమ్మా "అ" ఎలా రాస్తావో రాయి అంటే రాసాను వెంటనే వాడు కుడా రాసి నేను ఇలా రాస్తాను నేను రాసినట్లు నాకు హోంవర్క్ లో రాయి అని బుక్ ఇచ్చి రాయిన్చుకున్నాడు. ఇలా ఉన్నారండి రోజుల్లో పిల్లలు కాదు కాదు పిడుగులు.

12, నవంబర్ 2010, శుక్రవారం

కార్తీకం సందడి...

కార్తీక మాసం అంటేనే ముందుగా గుర్తు వచ్చేది తెల్లవారుఝామున రేవులోనో, కాలువల్లోనో, ఏటిలోనో చేసే స్నానాలు, కార్తీక సోమవారం, పౌర్ణమికి వుండే ఉపవాసాలు, శివాలయంలో వెలిగించే తాతయ్య, అమ్మమ్మ చేసిన మూడువందల అరవైఐదు వత్తులు...పూజ ఐపోయి ఇంటికి వచ్చి పీట మీద పసుపు, కుంకం,పిండి తో ముగ్గులు వేసి గౌరీ దేవిని చేసి పూజ చేయడం, పులిహోర,పాయసం,నేతిబీరకాయ పచ్చడి, చలిమిడి, వడపప్పు, కొబ్బరి ముక్కల ప్రసాదాలు, నైవేద్యం పెట్టి తొందరగా చంద్రుడు వస్తే బావుండు బాగా ఆకలి వేస్తోంది అని పున్నమి చంద్రుని కోసం ఎదురు చూడటం, చుట్టుపక్కల వాళ్ళు అందరు కలిసి పెద్దఉసిరి చెట్టు వున్న ఇంటి దగ్గర పూజ, భోజనం చేయడం, దీపావళికి కాల్చగా తాతయ్య దాచిన కొన్ని టపాకాయలు, కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాల్చడం...ఇలా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి కదు....!!
నాకైతే ముందుగా గుర్తు వచ్చేది స్కూలు పెట్టగానే అడిగిన మొదటి మాట వన భోజనాలు ఎప్పుడూ? అని. భలే ఇష్టంగా వుండేది. అందరు తలొక వంటకం చేసుకు వస్తామని పంచుకోవడం, పులిహోర,పాయసం, లడ్లు, కారప్పూస, సాంబారు, పచ్చళ్ళు, ఉసిరికాయలు, చిన్న చిన్న మామిడి పిందెలు కొన్ని, వాక్కాయలు, జామకాయలు ఇలా ఎన్నో...కాని ఏమాటకామాటే చెప్పుకోవాలి పులిహోర, సాంబారు భలే రుచిగా ఉండేవి....మీకు నోరూరుతోందా ఐతే మరెందుకాలస్యం తొందరగా వనభోజనాలకు రడి ఐపోండి మరి.
ఇక ఆటలైతే సీతారాముడు, కోతికోమ్మచి, మోనో యాక్షన్ అదేనండి చిట్టి తీసి ఎవరి కి ఏది వస్తే అది చేసి చూపించాలి, ఇంకా పాటలు భలే బావుడేది ఆ రోజు.

11, నవంబర్ 2010, గురువారం

చల్ల చల్లని ...కూల్ కూల్ గా...చలిలో....

అబ్బో అప్పుడే చలి చంపేస్తోంది ఇక్కడ. అదేనండి బాబూ ఇంట్లోను, ఆఫీసులోను. అదేంటి ఆఫీసులో కూడానా అనుకుంటున్నారా!! ఆ విషయానికే వస్తున్నా, ఆగండి మరీ అంత తొందరైతే ఎలా!! మాది అదేనండి ఆఫీసు బానే పెద్దగా వుంటుంది. కాబిన్లో మూడు ఏ.సి లు వుంటాయి, కాని అక్కడే ఇబ్బంది వచ్చి పడింది. మద్యలో వాళ్లకు బాగా చల్లగా కావాలి అంటే అందరికి కాదు ఒక్కళ్ళకి మాత్రమే బాగా చల్లగా కావాలి. మళ్ళి .సి కి దగ్గర గా కూర్చోరు వారు. వాళ్ళది మాత్రం 23/24 పెట్టి మిగిలినవి అన్ని 16 /20 మద్యలో పెడితే ఎలా వుంటుంది చెప్పండి!!
నిజంగానే కొంత మందికి ఎక్కువ గా చల్లదనం కావాలి, కాని కొంత మంది అస్సలు భలే చేస్తారు చల్లదనం పడదు అంటారు కాని తెలివిగా అటు ఇటు వెళ్ళినట్లు వెళ్లి ఏ.సి ఆన్ చేసి ఏమి తెలియనట్లు యాక్షన్ చేస్తారు. చల్లగా వుండాలి కాని అందరిని ఇబ్బంది పెట్టేటట్లు ఉండకూడదు కదా!! మరి ఈ నటనాగ్రేసరులు ఇంటికి వెళ్లి ఏం చేస్తారో తెలియదు అంటే ఇంట్లో ఏ.సి వుండదు కదా!! అసలే చలి కాలం మళ్ళి ఈ ఏ.సి గొడవొకటి మా ప్రాణాలకు...ఏంటో ఈ ఏ.సి గోల..... !!-:)

10, నవంబర్ 2010, బుధవారం

గుర్తున్నానా??

ఎప్పుడో చిన్నప్పుడు ఐదు, ఆరు ఏళ్ళు కలిసి చదువుకున్న అప్పటి వాళ్ళు చాలా వరకు నాకు గుర్తు వున్నారు. వాళ్ళు నాకు గుర్తు వుండటం కాదు ఇక్కడ విష్యం నేను కుడా అందరికి గుర్తున్నాను. ఈ మద్యన చాలా మంది చిన్నప్పటి స్నేహితులు కలిసారు. కొంతమందితో ఫోన్ లో మాట్లాడాను, కొంత మందిని కలిసాను. రెండు నుంచి ఆరు వరకు మాత్రమే వాళ్ళతో కలిసి చదివింది. ఐనా టీచర్స్ కి కుడా గుర్తు వుండటం ఎందుకో తెలియదు కాని బావుంది.
చాలా రోజుల క్రిందట పేపర్ లో హెల్త్ బాలేదు సాయం చేయమని చూసి నాకు తోచిన డబ్బులు పంపితే అది వార్త పేపర్ లో వచ్చింది. అది చూసి నా ఇంటి పేరుతో కూడా నన్ను గుర్తు ఉంచుకున్న నా చిన్నప్పటి నేస్తాలను ఈ మద్యనే గుర్తున్నానా అని పలకరిస్తే ఆ పేపర్లో సంగతి చెప్పి మర్చిపోయామా!! అంటే భలే అనిపించింది. ఇంకొకళ్ళని ఇంకా గుర్తున్నానా అంటే నీ మెయిల్ ఐడి కోసం ఎప్పటినుంచో వెదుకుతున్నా ఇప్పటికి దొరికావు అన్నారు... ఈ వేసవిలో అప్పటి స్కూల్లో అందరమూ కలుద్దామనుకుంటున్నాము. చూడాలి మరి ఎంత వరకు వీలవుతుందో.

9, నవంబర్ 2010, మంగళవారం

ప్రియతమా నా హృదయమా

అజరామరమైన గీతాలలో బాలు చిత్ర ల గాన మాధుర్యానికి ఇది ఒక మచ్చు తునక. వేటూరి కలం నుంచి జాలువారిన అద్భుతమైన మధుర గీతాలలో మరపు రాని ఆణిముత్యం. ఇళయరాజా స్వర కల్పనలో అద్భుత సృష్టి.
తన ప్రాణంలో ప్రాణమైన ప్రియురాలు చనిపోతుందని తెలిసి తనని గొప్ప వ్యక్తి గా చూడాలనుకుంటోందని తన మనసునే కానుకగా చేసి ఆ ప్రేమికుడిచ్చిన వెల కట్టలేని ప్రేమ కానుక ఇదిగో....మీకోసం....!!!
*******
ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా
ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా ...... [ప్రియతమా]

శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కల లాంటి బ్రతుకు కలతోటి నింపి
వలపన్న తీపి తోలి సారి చూపి
ఎద లోని సెగలు అడుగంట మాపి
నులివేచ్చనైన ఓదార్పు నీవై
శృతి లయ లాగా జత చేరినావు
నువులేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదిన్చలేను
అమరం......అఖిలం.....మన ప్రేమా ...... [ప్రియతమా]

లా లాల లా ల ల ..
ల లా ల ల ల ల లా ల లా...
లా ల లా ల..
ల ల ల లా లా....

నీ పెదవి పైనా వెలుగారనీకు,
నీ కనులలోనా తడి చేరనీకు...
నీ కన్నీటి చుక్కే,మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు...
ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా,
మహా సాగరాలే నిను మింగుతున్నా,
ఈ జన్మ లోనా ఎడబాటులేదు...
పది జన్మలైనా ముడేవీడిపోదు..
అమరం......అఖిలం.....మన ప్రేమా ...... [ప్రియతమా]

ఓ మాట

మరలిరాని కాలం
మరపు తెలియని మనసు
తీపి చేదు జ్ఞాపకాల దొంతరలకు ఆలవాలం.

3, నవంబర్ 2010, బుధవారం

కలల్లో తేలిపోతున్నా.....

కలల్లో తేలి పోవడమన్నా, భ్రమల్లో బతకడమన్నా కొంత మందికి చాలా ఇష్టం. ఎంత అంటే ఆ భ్రమలే వాస్తవం అనుకొని బతికేస్తున్నారు. తన చుట్టూ అందరు తనని చూసి నవ్వుతున్నా...నన్ను చూసి కాదులే అని సరిపెట్టుకుంటున్నారు.
కనపడిన ప్రతి అమ్మాయి తనని ఇష్టపడుతోందని, సిగ్గుతో పక్క వాళ్ళ దగ్గర మెలికలు తిరుగుతూ వాగడం, పెద్ద పెద్ద సంస్థలలో గొప్ప గొప్ప ఉద్యోగాలన్నీ తనకే పిలిచి ఇస్తున్నట్లు చెప్పడం, తన పైఅధికారులు తిట్టినా నా అంత పనితనమున్న వాడు మూడు లోకాల్లో వెదికినా దొరకడన్నారు...అస్సలు నేను ఇక్కడ వుండటం మీరు చేసుకున్న అదృష్టం అంటూ... ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పొతే చాట భారతమే అవుతుంది, చదివేవాళ్ళు నన్ను తిట్టుకుంటారు.

తనని చుస్తే చాలు అందరు తప్పుకుని వెళ్లి పోతారు, టైము బాలేని మాలాంటి వాళ్ళం దొరికి పోతూ ఉంటాము. ఏం చేయాలో తెలియక ఇలా నా బాధల గాధలు వెళ్లగక్కుతూ వుంటాను అప్పుడప్పుడు...విని(చదివి) తరించండి భరించండి....-:)

2, నవంబర్ 2010, మంగళవారం

సడిచేయకో గాలి.....

రాజమకుటం లోని ఈ పాట పి. లీల గారి గళం నుంచి జాలువారిన ఆణిముత్యాలలోని ఓ మరపు రాని అద్భుతమైన పాట. మాస్టర్ వేణు గారు సంగీతమందించిన అందరి మనసులు దోచిన పాట. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి నిలిచి వుండే మధుర గీతాలలో నాకిష్టమైన ఈ పాట మీకోసం......"బడలిక ఒడిలో అలసి సేదదీరుతున్న రారాజుకి లాలి పాట... "
చూడాలంటే ఈ లింక్ నొక్కండి

http://www.youtube.com/watch?v=ljBKuXCKl1s


సడిచేయకో గాలి సడిచేయబోకే
సడిచేయకో గాలి సడిచేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే * సడిచేయకో గాలి *
రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటం లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగున మాని కొలిచి పోరాదే * సడిచేయకో గాలి *
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకేలే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే * సడిచేయకో గాలి *
పండు వెన్నెలలడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవను పూని విసిరి పోరాదే * సడిచేయకో గాలి *

1, నవంబర్ 2010, సోమవారం

ఎవరీమె ??



మాట మౌనమై
మనసు మూగదై
పెదవి దాటని చిరునవ్వుతో
తెరచాటు నును సిగ్గు దోబూచులతో
అరుదెంచె అందాల అతివ.
ఎవరి ముగ్ధ మందార మకరందమాల?

28, అక్టోబర్ 2010, గురువారం

ఏ శ్వాస లో చేరితే

నేనున్నాను సినిమాలోని కీరవాణిగారు స్వరపరచిన ఈ పాట చిత్రగారి గళం నుంచి జాలువారింది. తన మనసుని వేణుమాధవునికి ఎంత చక్కగా తెలియపరచినదో.....ఈ పాటలో చూడండి అదేలెండి చదవండి. మనసుకి నచ్చే పాటలు అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతాయి. వాటిని మీతో పంచుకునే ప్రయత్నంలో....అప్పుడప్పుడు ఇలా....

వేణుమాధవా ఆ ..ఆ...వేణు మాధవా.....ఆ ..ఆ..
ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నిను చేరని మాధవా.. ఆ.. ఆ..

శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
చరణం :
మునులకు తెలియని జపములు జరిపినదా .... మురళి సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువునా తొలిచిన గాయమునే తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా

కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిది వెదురు తానూ పొందింది
వేణు మాధవా నీ సన్నిధి

శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో
చరణం :
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలు వైపులా నది రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులుసడి వినబడక హృదయానికి
అలజడితో ఆణువణువూ తడబడదా
ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ..

నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మాది నివేదించు నిముషమిది
వేణు మాధవా నీ సన్నిధి

గ గ రి గ రి స రి గ గ రి రి స రి
గ ప ద సా స ద ప గ రి స రి
గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా
గ ప ద స స గ ప ద స స
ద ప ద రి రి ద ప ద రి రి
ద స రి గ రి స రిగా రి స రి గ రి గ రి స రి గా
నీనున్నాను స ద ప గ గ గ పా పా
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప ద రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ
స రి గ ప ద రి గా
రాధికా హృదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి

25, అక్టోబర్ 2010, సోమవారం

రక్తచరిత్ర సినిమా

మొన్న శనివారం మధ్యానం రక్తచరిత్ర సినిమా చూసాను. నాకైతే....చాలా బాగా తీసారు రాంగోపాల్ వర్మ, మళ్ళి పాత వర్మ ని చూసినట్లు అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ సినిమాకు ప్రాణం పోసింది. ఫోటోగ్రఫి కుడా ఎంతో బాగుంది. కాకపొతే ఒక్క వాయిస్ఓవర్ మాత్రం అంత బాగా అనిపించలేదు. పాత్రల నుంచి తనకు ఏ రకమైన నటన కావాలో దానిని రాబట్టుకోవడం లో వర్మ నూరు శాతం గెలిచారు.
అనాది నుంచి వస్తున్న కారణమే " చెప్పుడు మాటలు" విని మంచిని, మేలుకోరేవారిని కాదనడం, మారణహోమాలకు, రక్తపాతాలకు కారణమని మొదట్లోనే చెప్పడం దానిమీదే సినిమా మొత్తం చూపించడం స్క్రీన్ప్లే చక్కగా కుదిరింది. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ గా చూపించడం కాకుండా చాలా వరకు వాస్తవ సంఘటనలకు రూపమే అనిపించింది. యదార్ధాన్ని దృశ్యరూపంగా చూపించాలంటే కష్టం. ఎంతో కొంత కల్పన తప్పదు. పగ ప్రతీకారాలు కాకుండా వాటికి మూలం ఏంటని ఓ క్షణం ఆలోచిస్తే...రక్తపాతాలు ఎందుకు జరుగుతున్నాయని తేటతెల్లం గా తెలుస్తుంది.
చెప్పుడు మాటలు వినండి కాని నిజాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. అమాయకుల ప్రాణాలతో ఆడుకోకండి....
వర్మగారిని మాత్రం రక్తచరిత్ర విష్యంలో మెచ్చుకోక తప్పదు....అభినందనలు రాంగోపాల్ వర్మ గారు.

ప్రేమ - ఇష్టం


ప్రేమని ఇష్టాన్ని అద్భుతంగా తెలిపిన మంచి పాటలలో ఇది ఒకటి.... క్రిమినల్ లోని ఈ పాట కూడ నాకు నచ్చిన పాటల్లో ఒకటి.

||ప|| |అతడు|

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

తెలుసా మనసా ఇది జన్మ సంబంధమో

దరిమిల ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో

విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో

శత జన్మాల బంధాల బంగారు క్షణమిది || తెలుసా మనసా ||.

||చ|| |అతడు|

ప్రతి క్షణంనా కళ్లలో నిలిచె నీ రూపం

బ్రతుకులోఅడుగడుగున నడిపె నీ స్నేహం

ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా

పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా || తెలుసా మనసా ||.

||చ|| |అతడు|

Darling every breath you take, every move you make I’ll be there with you What would I do without you? I want to love you forever and ever and ఎవెర్

|ఆమె|

ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో

చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో

లోకమే మారినా కాలమే ఆగినా

మన గాథ మిగలాలి తుది లేని చరితగా || తెలుసా మనసా ||

22, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆకులో....

నా చిన్నప్పుడు నాకెంతో ఇష్టమైన మేఘసందేశం సినిమా లోని పాట వీలుంటే ఒక్కసారి విని చూడండి ఎంత బావుంటుందో...ఇక్కడ మాత్రం పాట చదవడానికి మాత్రమే...

ఆకులో
ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజల నీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేతినై
పరువంపు విడిచేదే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా
ఆకులో
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా
ఆకులో

21, అక్టోబర్ 2010, గురువారం

వెలకట్టలేనిది....

స్వాతి చినుకుల్లో నుంచి జారిపడిన
ఓ చిన్న చినుకు ఆల్చిప్పలో పడి
స్వచ్చమైన మంచి ముత్యంగా మారినట్లే...
ప్రతి ఫలాపేక్ష లేని కల్మషమెరుగని నేస్తం దొరికితే
ఆ స్నేహ మాధుర్యానికి సాటిలేదు మరేది ఈ సృష్టిలో

20, అక్టోబర్ 2010, బుధవారం

అవసరానికి మాత్రమే అన్నీ....

ఇప్పటి రోజులలో బంధాలు-అనుబంధాలు, ప్రేమ-ఆప్యాయతలు అన్నీ అవసరం చుట్టూనో లేదా అందరిని శాసించే డబ్బు- అధికారం చుట్టూనో తిరుగుతున్నాయని మన అందరికి తెలిసిన జగమెరిగిన కాదనలేని నిజం.
ఇల్లు, ఆఫీసు ఏదైనా కానియండి అవసరానికి తేడా లేదు. ఎదుటి వాడితో పని లేనప్పుడు అస్సలు వాడెవడో మనకు తెలియదు, అదే మనకు వాడితో పని ఉందనుకోండి వాడే కాకుండా వాడి స్నేహితులు, చుట్టాలు అందరు మనకు బాగా తెలిసిన వాళ్ళు అవుతారు ఆ క్షణంలో.... కాదంటారా!! ఇదే సిద్ధాంతాన్ని మనపై ఎదుటి వాడు కుడా ఉపయోగిస్తే మనం ఎలా అనుకుంటామో, ఎంత బాధ పడతామో ఓ క్షణం ఆలోచిస్తే అప్పుడైనా కొద్దిగా మన ఆలోచనల్లో, అలవాట్లలో, పద్దతుల్లో కొద్దిగానైనా మార్పు అనేది వస్తుందేమో అని చిన్ని ఆశ. అవసరం అనేది ఎప్పుడైనా ఎవరితోనైనా రావచ్చు. ఇది ఎంతటివారికైనా తప్పనిది. ఇల్లు ఇంటికి ఎంత దూరమో ఇల్లు ఇంటికి అంతే దూరం కదా!! మనం ఇబ్బందిలో ఉన్నప్పుడే ఓదార్చే మనసు కాని మనిషి కాని కావాలి.....అది డబ్బుతోనో అధికారంతోనో రాదు. మన నోటి మంచితనం కానివ్వండి, జాలికానివ్వండి మరికేందైనా కానివ్వండి అప్పటి పరిస్థితికి మనోధైర్యాన్ని ఇవ్వగలిగే మాట సాయం లేదా నీకు నేనున్నాను అని చెప్పే స్వాంతన , ధైర్యం ఎంతో విలువైనవి...ఆ ఆలంబనని దూరం చేసుకోకండి. దూరం చేసుకుంటే మీకన్నా ఈ ప్రపంచం లో దురదృష్టవంతుడు వుండడు. ఎవరైనా ఈ టపా మూలంగా బాధ పడితే క్షమించగలరు....

19, అక్టోబర్ 2010, మంగళవారం

చదువుకై సాయం....

అమ్మానాన్న లేని పేద విద్యార్దుల చదువు కోసం స్థాపించిన సంస్థ ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఈ సంవత్సరం అందించిన సహాయ వివరాలు క్రింది లింక్ లో చూడండి..
http://epaper.sakshi.com/apnews/Avanigadda/19102010/Details.aspx?id=636810&boxid=25252184

ప్రతి ఏటా మాకు తోచిన సాయాన్ని అందిస్తున్నాము. మనసున్న ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములే...స్పందించే సహృదయులందరికి మా హృదయపూర్వక స్వాగతం....వివరాల కోసం www.urlctrust.com లో చూడండి...

13, అక్టోబర్ 2010, బుధవారం

నీవెక్కడ???

విరిసే వెన్నెలలో....
వీచే చిరుగాలిలో....
కురిసే చిటపట చినుకులలో....
చుట్టుముట్టిన నీ ఆలోచనలతో....
జాబిలమ్మను అడిగా నీ జాడ కొరకై !!
వచ్చే పున్నమికైనా చెప్పమని....!!

12, అక్టోబర్ 2010, మంగళవారం

ఏదో ఒక రాగం.....

ఈ పాట నాకు ఎంతో ఇష్టమైన పాటలలో ఒకటి. మొదట్లో ఈ పాట నాకు తెలుగులో తెలియదు, అప్పట్లో మేము మద్రాసులో అదేలెండి చెన్నయి లో వుండేవాళ్ళము. మా పెద్దాడు మౌర్య పుట్టక ముందే రోజు ఈ పాటని తమిళంలో రేడియోలో వచ్చేటప్పుడు వినేవాడు. చిన్నాడు సౌర్య కుడా అలానే పుట్టక ముందే విన్నాడు కాక పొతే అమెరికాలో వున్నప్పుడు కంప్యూటర్ లో ప్లే చేసి రోజు వినిపించేదాన్ని తెలుగులో.....

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

నా చూపుల దారులలో చిరు దివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు

ఏదో ఒక రాగం ||

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రావమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడు చమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం

ఏదో ఒక రాగం ||

గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం
జామ పళ్ళనే దోచే తోట జ్ఞాపకం

ఏదో ఒక రాగం ||

11, అక్టోబర్ 2010, సోమవారం

తస్మాత్ జాగ్రత్త....!!!

నాకు తెలిసిన ఒక కుటుంబం గురించి చెప్తాను ఇక్కడ....మనం మాములు గా అనుకుంటూ వుంటాము భార్య, భర్తలలో దేముడు ఒకరిని అటు ఒకరిని ఇటు కూర్చుతాడని, కాని ఇక్కడ ఇద్దరు ఒక్కటే...వాళ్ళకు వాళ్ళ పిల్లాడికి మంచి జరుగుతుందని కాని, డబ్బులు వస్తాయనుకుంటే డబ్బుల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడరు...అమ్మనాన్నని కుడా విడదీస్తారు. మంచి మానవత్వం అనేవి వీళ్ళకు అస్సలు తెలియదు. అన్నవదినలవి పదిహేను లక్షలు తిని అస్సలు ఇవ్వనక్కర లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు. వాళ్ళిద్దరికీ కుడా ఎన్నో గొడవలు పెట్టారు. అమెరికా తీసుకు వెళ్లి మూడు నెలలు ఇంట్లో వుంచుకుంటే మూడు నెలల్లో ముప్పైవేల డాలర్లు ఖర్చుపెట్టించారు వాళ్ళతో... తిరిగి ఒక్క పైసా ఇవ్వకుండా చాలా మాటలు మాట్లాడారు. జాతినీతి లేని ఇలాంటి వాళ్ళని చూడటం ఇదే ప్రధమం. వాడి చెల్లెలు,అక్క కుడా అంతే. అందుకే భార్య కుడా అలాంటిదే దొరికింది. అన్న కారు, సామానులు మొత్తం అన్ని తీసుకుని ఇప్పుడు ఒక్క పైసా ఇవ్వము నీకు పెళ్ళికి బోల్డు డబ్బులు ఇచ్చాను, మీ అబ్బాయికి సైకిలు కొని పెట్టాను అని చెప్పారు..... వాడు ఇంట్లో కూర్చుంటాడు పిల్లాడి పనులు, ఇంట్లో పనులు చేస్తాడు .... ఇక భార్య ఉద్యోగం వెలగబెడుతుంది బయట ఏదైనా సరే ....నాఅంతటిది లేదు కోట్లు సంపాదించాను అని గొప్పలు చెప్పుకుంటూ వుంటుంది. వాడి చెల్లెలి పెళ్ళికి వాడికి రూపాయి ఇవ్వడం చేతకాలేదు ఈ రోజు మాత్రం ప్రేమ కారిపోతూ వుంటుంది అక్క చెల్లెళ్ళ మీద...అక్క చెల్లెళ్ళు కుడా సొమ్ము తిన్న వాళ్ళని మాత్రం దూరం పెట్టి ఈ కసాయి వెధవని అందలం ఎక్కించారు. ఇలా అందరి సొమ్ము తింటే కోట్లు ఏం ఖర్మ మిలియన్లు సంపాదించవచ్చు. అందుకేనేమో వాళ్ళ అమ్మనాన్న ఇవి అన్ని చూడాల్సి వస్తుందనేమో ముందే పోయారు ఆ అదృష్టవంతులు...
వెయ్యి గద్దలను తిన్న రాబందు ఒక గాలివానకు పోతుంది అని....వీళ్ళ పాపం పండక పోదు దేముడు అనేవాడు వుంటే చూడకా పొడు...అందుకే తస్మాత్ జాగ్రత్త....!!! మీకు ఇలాంటి వాళ్ళు ఎదురు పడవచ్చు మీ ఇంట్లోనైనా, బయట అయినా.....ముందుగా మేల్కొని దూరంగా వుంచండి ఇలాంటి వెధవల్ని..... !!

1, అక్టోబర్ 2010, శుక్రవారం

వేదం లా

నాకు ఎంతో.......ఇష్టమైన పాటలలో ఇది కుడా ఒకటి ....

వేదంలా ఘొషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘొషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం
వేదంలా

రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఎలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరు
వేదంలా

శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తిథి మావహంచ విహితాం స్త్రిపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసుహు
పురుషోత్తమాం భుజభవ శ్రీఖంధరాశ్రేయసే

ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శృఇనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము
వేదంలా

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
వేదంలా

30, సెప్టెంబర్ 2010, గురువారం

చరిత్ర పునరావృతం...

ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న మాట అక్షరాల నిజమైంది నిన్నటి తీర్పుతో....చరిత్ర పునరావృతమైంది మరొక్కసారి...న్యాయదేవత పలుకుబడి, అధికారం, డబ్బులకు అమ్ముడుపోయి నిజాన్ని ఒప్పుకోలేక మూగబోయింది.
ఆయేషా కేసు తీర్పులో న్యాయం అన్యాయమైంది...అని అందరికి తెలుసు కాని ఎవరు ఏమి చేయలేరు....కళ్ళు చెవులు అన్ని వుండి కుడా ఏమి లేనివారమయ్యాము ఈ రోజు....ఆయేషా కేసు అయినా మొద్దు శీను కేసు అయినా మరోకరైనా అధికారం, ధనాశకు దాసోహమనక తప్పడం లేదు...చట్టం తనపని చేసుకుపోదు. అధికారానికి కొమ్ము కాస్తుందని మరొక్కసారి ఋజువైంది అంతే.....సత్యంబాబు కి శిక్ష వేయడం ఎంత వరకు సమంజసం?? అందరికి తెలిసిన నిజం, అబద్దపు సాక్ష్యాలు కోర్టుకి ఎందుకు తెలియలేదు? నిరపరాధికి శిక్ష పడకూడదన్న నైతిక న్యాయాన్ని ఎందుకు మర్చిపోయారు? తీర్పు చెప్పిన గౌరవనీయులైన న్యాయాధికారిగారు. పేదవాడికి అందుబాటులో లేని చట్టం ఎవరి కోసం? మేధావులు ఒక్కసారి ఆలోచించండి......న్యాయాన్ని నిలబెట్టండి......!!!

29, సెప్టెంబర్ 2010, బుధవారం

మధురానుభూతుల బాల్యం....

చిన్నప్పటి జ్ఞాపకాలంటే....మరల రాని మరపు రాని....మధురానుభూతులు...
స్కూలు ఎగ్గొట్టి చుట్టుపక్కల వాళ్లకి కబుర్లు చెప్పి గులాబీలు తెచ్చుకోవడం జ్ఞాపకమే...
అమ్మమ్మ తిడితే పుస్తకంలో రాసి అమ్మకు చూపటం జ్ఞాపకమే...
బొమ్మలాటలు...టీచరులా బెత్తం చాక్పీసులతో ఆడిన ఆటలు జ్ఞాపకమే...
బాదం కాయల వేటలు...పారిజాతాల దండలు గుచ్చడం జ్ఞాపకమే...
చెరువులో....కాలువల్లో....కొట్టిన ఈతలు జ్ఞాపకమే...
అమ్మానాన్న ఆటలు....చేసిన సత్యన్నారాయణ వ్రతాలు....పంచిన ప్రసాదాలు... జ్ఞాపకమే...
పాడిన పాటలు...చదివిన కథల పుస్తకాలు...తిన్న తిట్లు...అన్ని... జ్ఞాపకమే...
స్నేహితులతో గిల్లికజ్జాలు...చూసిన సినిమాలు...వేసిన బొమ్మలు... జ్ఞాపకమే...
మాస్టారితో తిన్న తన్నులు....చెప్పిన పాఠాలు...చేసిన అల్లరి...జ్ఞాపకమే...
వన భోజనాలు...వార్షికోత్సవాలు... జ్ఞాపకమే...
ఉత్తరాల్లో పంచుకున్న పెంచుకున్న అనుభూతుల అనుబంధాలూ... జ్ఞాపకమే...
అప్పటి ప్రతి క్షణం ఇప్పటికీ.....ఓ మధుర జ్ఞాపకమే...

28, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఓ తల్లి వ్యధ

నాకు తెలిసిన ఓ తల్లి చాలా బాగా బతికింది ఒకప్పుడు. ఇప్పుడు ఎలా బతకాలో తెలియని అయోమయం లో బతకాలా వద్దా అన్న సందిగ్ధం లో బతుకు వెళ్ళదీస్తోంది...రాని చావు కోసం ఎదురు చూస్తూ…….. ముగ్గురు ఆడపిల్ల తరువాత లేక లేక కొడుకు పుట్టాడని ఎంతో మురిసి పోయారు ఆ తల్లిదండ్రులు. అందరికన్నా చిన్నవాడని అపురూపం గా పెంచుకున్నారు. పెద్ద పిల్లలకి పెద్దగా చదువు చెప్పించక పోయినా చిన్నవాళ్ళిద్దరికీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేటట్లు టీచర్ ట్రైనింగ్ చెప్పించారు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం....కాక పొతే తరువాత పార్టీలని కొంత సొమ్ము, వ్యాపారమని కొంత సొమ్ము పెట్టి మొత్తం నాశనమైంది పిల్లలు పెరిగేసరికి. కొడుకు కి యాక్సిడెంట్ అయి కొన్ని నెలలు మంచం లోనే వుంటే బతుకుతాడో లేదో తెలియని కొడుకు కోసం ఆ తల్లి పడిన వేదన చెప్పనలవి కానిది. తల్లి, పెద్ద కూతురు వాళ్ళ పిల్లలు ఒక సంవత్సరం కష్ట పడితే కాని మామూలు మనిషి కాలేదు. పుట్టిన పిల్లాడికి చేసినట్లు అన్ని ఆ పాతికేళ్ళ కొడుకుకి ఎంతో ఓర్పుతో, ఓపిక తో ఆ తల్లి, అక్క, అక్క పిల్లలు చేసిన సేవలు మనిషి జన్మ ఎత్తిన వాడు ఎవడు మర్చి పోలేడు. కాని ఈ మనిషి అది మర్చి పోయి అక్క కూతురిని చేసుకోకుండా కట్నం కోసం వేరే ఆవిడని చేసుకుని ఆవిడ అడుగుజాడలలో తల్లికి, అక్క చెల్లెళ్ళకు దూరం గా ఉద్యోగాన్ని మార్చుకుని అస్సలు వీళ్ళు ఎవరో తెలియనట్లు బతుకుతున్న గొప్ప బాద్యత గల ఉపాద్యాయ వృత్తిలో వున్నాడు ఈ రోజు. కనీసం తల్లికి అవసరానికి ఆదుకోకుండా వున్న ఇల్లు అమ్మి ఆ డబ్బులు కుడా ఎంత మంది చెప్పినా వినకుండా కొడుకు కి ఇచ్చిన కన్నతల్లి నెల రోజుల నుంచి అనారోగ్యం పాలైతే కనీసం చూడటానికి కుడా రాని ఆ కొడుకుని ఎవరితో పోల్చాలి? ఎంత మంది ఎన్ని సార్లు ఫోనులు చేసి చెప్పినా నెల రోజుల నుంచి తల్లిని చూడటానికి సెలవు దొరకని ప్రభుత్వ ఉపాద్యాయుడు . బాధ్యతాయుతమైన వృత్తిలో వుండి ఎంతో ఆదర్శవంతుడిని అని చెప్పుకునే ఈ కొడుకుకి తనకోసమే జీవితాన్ని ధారపోసిన తల్లి చివరి దశలో వుంటే చూసుకోవాల్సిన బాధ్యతా లేదా!! ఇలాంటి కొడుకులకు బుద్ధి చెప్పే చట్టం ఏదైనా వుంటే ఎంత బావుంటుంది!!!! తల్లిని చూడటానికి కుడా పెళ్ళాం అనుమతి తీసుకునే ఇలాంటి కొడుకులున్న మన సమాజం లో కనీస మానవత్వపు విలువలు మంటగలుస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? పెళ్ళాం మీద ఈగ వాలనియని ఈ కొడుకు తన ప్రాణాన్నే ఫణంగా పెట్టి బతికించిన తల్లి ఋణం ప్రపంచంలో ఏ కొడుకు తీర్చుకోనంత బాగా తీర్చుకున్నాడు. మనం రోజు చూస్తూనే ఉన్నాము ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా సభ్య సమాజంలో జరుగుతూనే వున్నాయి కాని వీటికి పరిష్కారం ఏంటో మాత్రం అంతుపట్టడం లేదు……సమాధానం లేని ప్రశ్నలుగానే ఎన్నో జీవితాలు ముగుస్తున్నాయి……….!!

ఏమిచ్చినా తీర్చుకోలేని కల్మషం లేని తల్లి రుణాన్ని వెల కట్టకుండా కొడుకులు కూతుర్లు బాధ్యతలను మరచిపోరని ఆశతో.....

27, సెప్టెంబర్ 2010, సోమవారం

నీ జ్ఞాపకం....

ఎన్నో ఆలోచనలు…..గతకాలపు జ్ఞాపకాలు….
అక్షర రూపం ఇద్దామంటే పదాల అమరిక
పరుగిడిపోయింది అందనత దూరంగా ….
పాటలా పొందుపరుద్దామంటే …
పల్లవే కుదరనంది…..మరింకెలా రాసేది పాట?
గమకాల్లో అందామంటే గొంతు మూగబోయింది….
నీవు లేవన్న నిజాన్ని తట్టుకోలేక……!!!

9, సెప్టెంబర్ 2010, గురువారం

ఒక చిన్న మాట

మనిషికి, ఆ మనిషి లోని మానవత్వానికి తల వంచండి కాని డబ్బుకు, పై పై మెరుగులకు, హంగులకు, ఆర్భాటాలకు కాకుండా , మనసులో లేక పోయినా పైకి మీతో మర్యాద నటించే వారికి ఎంత విలువ ఇవ్వాలనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.... నిజం ఎప్పుడూ చేదుగానే వుంటుంది వినడానికి....పొగడ్తలు విని పొంగిపోతే ఆ విజయం తాత్కాలికమే కాని నిజమైన గెలుపు కాదు.....అదే నీ పతనానికి తొలి మెట్టు అవుతుంది....కష్టంగా వున్నా నిజాన్ని ఒప్పుకోడానికి ఎంతో పెద్ద మనసు వుండాలి. తప్పు చేసినప్పుడు సమర్దిన్చుకోకుండా లేదా పక్క వారి మీదకు నెట్టకుండా మన భాద్యత ఎంత అని ఒక్క సారి ఆలోచించుకుంటే అపార్ధాలకు, చెప్పుడు మాటలకు స్వస్తి చెప్పవచ్చు. చెప్పుడు మాటలు చెప్పే వారిది తప్పు కాదు దానిలో నిజం ఎంత అని ఆలోచించని మీదే క్షమించరాని తప్పు అవుతుంది.......కాదంటారా!!

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

పదవి - నడవడి

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడటం ఇంటికి ఒంటికి చాలా మంచిది. ఒక మాట మాట్లాడిన తరువాత దానిని వెనక్కి తీసుకోలేము కదా!! ప్రతి ఒక్క ఇంట్లోను సమస్యలు ఉంటాయి అలా అని ఇంటి సమస్యలను ఆఫీస్ లోనూ, ఆఫీస్ విషయాలను ఇంటిలోనూ కలపడం మంచిది కాదు. కనీసం వయస్సుకు తగినట్టుగా అయినా మన ప్రవర్తన ఉండాలి. మనం ఇబ్బందిలో ఉన్నామని ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సమంజసం? నువ్వు లేనప్పుడు నీ గురించి ఓ క్షణం ఆలోచించేటట్లు వుండాలి కాని హమ్మయ్య ఇప్పటికి ఈ పీడ తప్పింది అనిపించుకోకూడదు. మన మాటలు ఎదుటి వాళ్లకు ఆహ్లాదాన్నివ్వాలి కాని ఆక్రోశాన్నివ్వకూడదు. ప్రతి సంస్థలోనూ వుండే సమస్యలే ఇవి....సహోద్యోగులతోను, మనకన్నా తక్కువ స్థాయిలోని వారితోను మాట్లాడేటప్పుడు మన ప్రవర్తన అందరికి ఆమోదయోగ్యంగా ఉండేటట్లు చూసుకుంటే ఇంటా, బయటా చాలా సమస్యలు తీరి సంతోషంగా మనం ఉంటూ, మన చుట్టూ వున్న వారిని కుడా సంతోషపెట్ట వచ్చు.

2, సెప్టెంబర్ 2010, గురువారం

నీకు..నాకు ....

మాటలే లేని మౌనంలో.....
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న
మాటల నిశబ్ధానికర్ధం ఏమిటో...?

27, ఆగస్టు 2010, శుక్రవారం

స్వ'గతం'

పెళ్లి ఐయి ఇన్ని ఏళ్ళు గడిచినా.....పెళ్లి కి ముందు తరువాత జరిగినవి అన్నీ.. ఇంకా నిన్నో మొన్నో జరిగినట్లు ఆ జ్ఞాపకాలన్నీ మెదులుతూనే వున్నాయి...ఇంతకీ...నేను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో ఇప్పటికి నాకు అర్ధం కాదు.
నాన్నతో అన్న మాటలు, నన్ను ఇంట్లో నుంచి పంపిన రోజు వరకు జరిగిన ప్రతి చిన్న విష్యం కాని, పెళ్లి తరువాత నేను పడిన కొద్ది సంతోషము, చాలా ఎక్కువగా పడిన మాససిక వేదన మర్చిపోదామన్నా మరపు రావడం లేదు. మార్పు కొద్ది గా వచ్చినా అది నిజమో కాదో కూడా అర్ధం కానిది. ఏదో నన్ను సాధించడానికి అన్నట్లు అనిపిస్తుంది కాని ఇష్టం గా కాదు అని ఇప్పటికి అనిపిస్తూనే వుంది. నాన్న అన్నట్లు నన్ను కొద్దిగా కుడా జాలి లేకుండా పెంచితే బాగుండేదేమో....!! నాకు వుహాల్లో కన్నా వాస్తవంలో బతకడమే చాలా ఇష్టం. కష్టమైనా, సంతోషమైనా ఆనందాన్ని వున్నదానిలోనే వెదుక్కోడం ఇష్టం. మనకున్న ఈ చిన్ని జీవితంలో మళ్ళీ జన్మ వుందో లేదో తెలియని మరుజన్మ కోసం చూడకుండా చేసే పనిని ఆస్వాదిస్తూ వుంటే చాలు.......సంతోషంగానే ఉండాలని ....నాకై నేను ఎంచుకున్న దారిలో మంచి మార్పు కోసం జీవితం చివరి మజిలి వరకు ఎదురు చూస్తూ......

25, ఆగస్టు 2010, బుధవారం

హీరో ఫీల్.......అంటే ఇదే అనుకునే ఓ జీరో

కొంత మంది అనుకుంటూ వుంటారు.....ప్రపంచంలో అందరు వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు అని, కాని వాళ్లకు తెలియదు కదా వాళ్ళ ఇంట్లో వాళ్లకు కుడా ప్రతి క్షణం వీళ్ళ గురించి ఆలోచించే టైం ఉండదని. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే నోటికి ఏది వస్తే అది వాగడం అదో పెద్ద జోకులా ఫీల్ ఐపోడం, హీరో ఫోజు కొట్టడం, పెద్ద చిన్న తేడా లేకుండా ఏది పడితే అది వాడగం.....ఇలాంటి వాళ్ళు ఏళ్ళు వచ్చినా ఎదగని మనస్తత్వాలకు చిహ్నాలు.
ఇలాంటివే కాకుండా.... చెప్పుడు మాటలు వినడం తప్పు కాదు, కాని చెప్పిన దానిలో నిజం ఎంత? అని ఎవరినైనా మాట అనే ముందు కొద్దిగా ఓ క్షణం ఆలోచిస్తే చాలా మంచిది. పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా " కాలు జారితే తీసుకోగలం కాని నోరు జారితే వెనక్కి తీసుకోలేము" అని. అది ఎంత నిజమో మన అందరికి తెలుసు. ఎదుటి వాళ్ళ మీద జోకులు వేసుకోవచ్చు కాని అది ఆరోగ్యకరమైనదిగా వుండాలి కాని వాళ్ళని బాధ పెట్టేదిగా వుండకూడదు. కాస్త ఆలోచించండి.....మాట అనే ముందు......

14, ఆగస్టు 2010, శనివారం

బంగారుతండ్రీ......


హాయ్ బంగారుతండ్రీ...... ,
నీకు అందరికన్నా ముందే
పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశిస్సులు చెప్పాలని......
" ప్రతి క్షణం సంతోషం నీ సొంతం కావాలని......
నీ అల్లరిలో....మేము అన్ని మరచి.......
నీతో హాయిగా ఉండాలని......
ఎప్పటికి నీ ఆనందం ఇలాగే వుండాలని....."
శౌర్య కి ,
పుట్టినరోజు శుభాకాంక్షలు......
ప్రేమతో......

13, ఆగస్టు 2010, శుక్రవారం

జాగ్రత్త గా ఉండండి ఇలాంటి వాళ్ళతో.......

శాం వేజెండ్ల అని డెట్రాయిట్ లో ఉంటాడు, వీడితో చాలా జాగ్రత్త గా వుండండి ముఖ్యం గా అమెరికాలో వున్న వాళ్ళు అందరు. వాడు చెప్పేది ఒక్కటి కుడా నిజం వుండదు అన్ని అబద్దాలే. చాలా చాలా జాగ్రత్త గా వుండాలి వీడితో. ఒక కంపెనీ వుంది అన్ని నేనే చేస్తాను అని ఆదని ఇదని చెప్తాడు నమ్మకండి.
ఇలాగే ఇంకొంతమందితో అమెరికాలో బాగా దెబ్బలు తిన్నాను. హెచ్.ఎన్.సి సొల్యుషన్స్ అని చికాగోలో వుండేది. రఘుబాబు పోతిని అని ఒకడు చూసేవాడు.. వాడు కుడా ఈ శాం కి ఏమాత్రము తీసిపోడు. అమెరికా లో మొదటగా వాడే మోసం చేసింది. తొమ్మిది నెలలు పని చేయించుకుని రెండు నెలలకు ఇచ్చి ఇంక ఇవ్వలేదు. హెచ్ వన్ చేస్తానని చేయలేదు. లేబర్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేసినా కుడా ఏమి చేయలేదు అప్పట్లో. తరువాత వాడు కంపెనీ మూసుకున్నాడులెండి అది వేరే కత. తర్వాత రామస్వామి యనమదల అని చికాగోలోనే వాళ్ళ దగ్గర చేస్తే ముప్పైవేల వరకు మాకు ఎగ్గొట్టారు. ఎగ్గొట్టిన సంవత్సరంలోపే వాళ్లకు చాలా వుండేదిలెండి అప్పట్లో , మొత్తం పోయి ఉండటానికి ఇల్లు కుడా లేకుండా పోయింది. ఐపి పెట్టాడని చెప్పుకున్నారు.
మిగిలినవి మళ్ళి..... ఎప్పుడైనా......

10, ఆగస్టు 2010, మంగళవారం

నాన్నా...నీతో చెప్పాలని...

నీకు గుర్తు ఉందా నాన్నా ....!! నాకు నాభిప్రాయాలకి విలువ ఇచ్చి నీకిష్టం లేని పని చేయలేక, నా నమ్మకానికి విలువ ఇచ్చి నేనడిగినది చేయలేక, ఆ రోజు నన్ను ఇంట్లో నుంచి పంపిన రోజు గుర్తు ఉందా!!! ఆ తరువాత చాలా రోజులు నాకంటూ ఓ ఇల్లు లేకుండా పోయింది. నేనెప్పుడు నిన్ను ఏ విష్యం లోనూ ఇబ్బంది పెట్టాలనుకోలేదు కాని పరిస్థితులలా వచ్చాయి. నా నమ్మకానికి, తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళయినా, బయటి వాళ్ళయినా ఒక్కటే అన్న నా అభిప్రాయానికి, మంచి వాడయినా బాద్యత లేదు అన్న నీ అభిప్రాయానికి మద్యలో జరిగిన ఓ సంవత్సరంనర్ర సంఘర్షణ తరువాత నువ్వు అడిగిన మాట " నా ఆస్థి లేకుండా బతకగలవా" అని. నీ కోసం నాన్నా వున్నాను నీ ఆస్థి కోసం కాదు అని ఆనాడే చెప్పాను...ఎలా వున్నా ఏ పరిస్థితిలో వున్నా బతకగలిగేలా నన్ను పెంచావు. ఆస్తులు వున్నా, లేక పోయిన స్థితిలో కుడా దేనికి ఇబ్బంది పడకుండా కాలు కింద పెట్టకుండా పెంచావు....స్టేడియం లో క్రికెట్ మాచ్ అయినా, ఇసుకలో కుర్చుని నాటకం చూడటమయినా ఒకేలా ఆస్వాదించడం నేర్పావు..... కాని ముళ్ళలో వదిలేసావు ఆ రోజు..... అప్పటికి....నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది. ఆత్మీయులు, ఉత్తరాలు, పుస్తకాలు, సినిమాలు, అందరు మంచి వాళ్ళే అన్న నమ్మకం, ఎవరు బాధ పడినా చూడలేని నైజం.....అంతే కాని మనిషికి రెండు రూపాలని అప్పటికి నాకు తెలియదు. నువ్వు నన్ను అలా బయటికి పంపడం వలనే ఆరు నెలల్లో ఒక్కసారిగా అరవైఏళ్ల జీవితం చూసాను. దేనినైనా తట్టుకోగల మనః స్థైర్యాన్ని పొందగలిగాను. ఇప్పుడిలా ఉండగలిగాను అంటే అది మీ పెంపకం, అమ్మ సహకారం అడుగడుగునా నాకందడమే....... ఇంత బాగా పెంచినందుకు చాలా చాలా......... మళ్ళి జన్మలో కుడా మీ కూతురిగానే పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నీకో విష్యం తెలుసా నాన్నా!! నీకెంతో ఇష్టమైన నీ చిన్న మనుమడు పుట్టింది కుడా నువ్వు నన్ను ఇంట్లో నుంచి పంపిన
తా
రికునే !!! అది ఆగష్టు పద్నాలుగు గుర్తు వచ్చిందా!!

7, ఆగస్టు 2010, శనివారం

తడిఆరని జ్ఞాపకం

వాసు....!!
నువ్విప్పుడు లేక పోయినా నీతో పంచుకున్న చిన్ననాటి అనుభూతులు...ఎప్పటికి మరువలేని జ్ఞాపకాలుగానే వుంటాయి...లెక్కల్లో నాకన్నా తక్కువ వస్తాయని తెలుగులో నీక్కెక్కువ వస్తే టోటల్ ఫస్ట్ క్లాసు లో నీకని నువ్వు, ఏమైనా సరే తెలుగులో నాకెక్కువ రావాలని నేను...పోటి పడటం, రింగ్ ఆడేటప్పుడు నీ జట్టు ఎవరు వుండనంటే నేనుండటం, నిన్ను ఆటలు పట్టించడం, మీ అక్కకి మమ్మల్ని గాళ్ ఫ్రెండ్స్ అని చెప్పినందుకు బాగా పోట్లాడటం....స్కూల్ ఐనతరువాత కుడా అప్పటి నుంచి ఇప్పటి వరకు నీతో స్నేహాన్ని ఆస్వాదించడం, ఏదైనా మాట్లాడుకోగల దగ్గరతనం, బాలుని పెన్ ఫ్రెండ్ గా పరిచయం చేసి ఎనిమిది ఏళ్ళు చూడకుండా ఉత్తరాలు రాసుకోడం, నీ పెళ్లి లో చూడటం....ఆ రోజు ఎన్ని కబుర్లు... బాలు,రాము, శ్రీను, ప్రదీప్, అను......మర్చిపోలేనన్ని జ్ఞాపకాలు, నన్ను చూడాలని కంటికి చూపు పోయిందని రాసిన అబద్దపు ఉత్తరాలు, తిడతానని తెలిసినా చెప్పిన నిజాలు, ఆ మద్యన నేను వచ్చినప్పుడు అనుక్షణం నాతోనే ఉండి...నన్ను చిన్ననాటి రోజులలోకి తీసుకు వెళ్ళిన నిన్ను, నీ జ్ఞాపకాలను..... తడి ఆరని మనసుతో పదిలం గా భద్రపరచుకుంటాను...

6, ఆగస్టు 2010, శుక్రవారం

చిన్నప్పటి ఓ జ్ఞాపకం....

నాకు అంత బాగా గుర్తు లేదు నాలుగో, ఐదో చదివేటప్పుడు చంద్రహాసుడి కధ వుండేది...దానిలో మూలా నక్షత్రం లో పుడితే తల్లి కో, తండ్రి కో గండం అని ఎవరో అబద్దం చెప్తే అది నమ్మి చంద్రహాసుడిని చంపేయమని వాళ్ళ నాన్న చెప్తే అడవికి తీసుకుపోయి చంపలేక వదిలేస్తారు....ఆ నమ్మకం అబద్దమని తెలిసినా మూలా నక్షత్రం లో పుట్టిన నా చిన్నప్పటి స్నేహితుడు ఏ కష్టం లేకుండా వుండాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. (తనది మూలా నక్షత్రం అని తెలియదు కాని అప్పట్లో ఎవరో చెప్పినట్లు గుర్తు )

3, ఆగస్టు 2010, మంగళవారం

అశ్రుతర్పణం...

నీవు లేవని తెలిసిన క్షణం కాలమాగిపోలేదు
ప్రపంచమూ స్థంభించిపోలేదు....కాని...
మేమే స్తబ్దుగా అయిపోయాము...
నిర్లిప్తంగా... శూన్యంగా ...
మూగగా రోదించే మనసుకి
మరపు రాని నీ జ్ఞాపకాలతో
నీవు అనునిత్యం మాతోనే ఎప్పటికీ ఉంటావని....చెప్తూ....
తిరిగిరాని లోకాలకు అనుకోకుండా వెడలిన ప్రియ మిత్రమా!!
నీకివే మా కన్నీటి వీడ్కోలు......

22, జులై 2010, గురువారం

అమ్మాయి బాగుంది....!!





అమ్మాయి బాగుంది.... అందం గా నవ్వింది....
కబుర్లెన్నో చెప్పింది....ఆశలెన్నో రేపింది....
కలలెన్నో కన్నాను కలిసి ఉందామని.....మనసులో మాట చెప్తే కాదు.. పొమ్మంది...
అందాల బొమ్మా నీ మనసెందుకమ్మా ఇంత కఠినం... !!

21, జులై 2010, బుధవారం

అమ్మ

అమ్మ పాటలలో నాకెంతో ఇష్టమైన పాట ఇది....

ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం

అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి

అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి

అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు

అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు

అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి

అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని

శ్రీరామరక్ష
అంటూ నీళ్ళు పోసి పెంచింది

ధీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది

నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో

పాటలు నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో

20, జులై 2010, మంగళవారం

హైకు బరువు



బతుకు
బరువుతో కుంగిన సగటు మధ్యతరగతి సామాన్యుడు......
హైకు బరువుతో భారమైపోయిన బాంకు ఖాతాలతో....
ఈనాటి సాప్టువేరు ఇంజనీరు....

(మూడు ఏళ్లకు ఒక్కసారిగా పెరిగిన జీతాలు.......సరదాగా రాసింది...)

8, జులై 2010, గురువారం

ఏదో...చెప్పాలని!!!

ప్రతి క్షణం నేనాస్వాదించే అనుభూతిని..
నా అంతరంగాన్ని, ఆలోచనలను..
అనునిత్యం నీతో పంచుకోవాలని...
ఎప్పుడూ నీతోనే వుండాలని అనిపించే
నా మనసుకి ఎలా చెప్పను...??
నేను నీకెప్పటికీ ఏమి కానని!!

3, జులై 2010, శనివారం

మేషము







పుట్టినరోజులు

నా దగ్గర వున్న పుస్తకం లో నుంచి...
నచ్చితే చదవండి...లేదా మీ ఇష్టం....

శ్రీ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు రాసిన
"పుట్టినరోజులు" పుస్తకం లో నుంచి మీ కోసం....


2, జులై 2010, శుక్రవారం

పుట్టినరోజు





నా
ప్రియ నేస్తం
ఉమ
కి

పుట్టినరోజు శుభాకాంక్షలు

1, జులై 2010, గురువారం

నాకనిపించినది.....

జ్యోతిష్యం గురించి కొన్ని బ్లాగుల్లో చదివాను, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు రాసారు కాని అందరిని నమ్మమని చెప్పలేదు. కాని కొన్ని కామెంట్లు చాలా బాధ కలిగించేవి గా వున్నాయి. బ్లాగుల్లో కామెంట్లు రాసే వారికి ఓ విన్నపం. ఎవరికి అనిపించినది వాళ్ళు రాస్తారు దానికి నచ్చితే నచ్చింది అని లేదా మీకు తోచిన మంచి సలహా కాని ఇవ్వండి. అంతే కాని రాసిన వారిని కిన్చపరిచేటట్లు మాట్లాడకండి. ఇది ఒక కామెంట్లకే కాదు అన్నిటికి వర్తిస్తుంది. ఆఫీస్ లో మనకన్న క్రింది వారిని చిన్నతనం గా చూడటం, చెప్పుడు మాటలు వినడమే కాకుండా చెప్పే వారిని అందలం ఎక్కించడం, లేని వారిని హేళనగా మాట్లాడటం ఇలాంటివి చదువు, సంస్కారం వున్న మనం చేయతగని పనులు.
ఎవరి నమ్మకం వారిది. దానిని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. అలాగే ఎవరి వ్యక్తిత్వం వారికుంటుంది, దానికి హేళన చేసే అధికారం కుడా ఎవరికీ వుండదు. ఇది అందరు గుర్తు చేసుకుంటే కనీసం ఒకరి మనసైనా గాయపడకుండా వుంటుంది.

స్నేహా మాధుర్యం

మనిషినే దూరమయ్యా
కానీ నీ మనసుకు కాదు
ప్రపంచానికైనా దూరమౌతా
కానీ నీ పరిచయానికి కాదు
నేస్తమా... !! నీ మాటలకు దూరమయ్యా
కానీ నీ చెలిమికి కాదు
ఎప్పటికి నీ స్నేహా మాధుర్యాన్ని
ఆస్వాదిస్తూనే ఉండాలని....

(ఇది నాది కాదు, నా ఫ్రెండ్ పంపితే కొద్ది మార్పులు చేర్పుల తో....మీ కోసం...)

30, జూన్ 2010, బుధవారం

నేనేనా అన్న భావన!!!

నువ్వు చేసే ప్రతి పనిలోనూ...వేసే ప్రతి అడుగులోనూ...
నీ కోపంలో....నీ సంతోషంలో....నీ ఏడుపులో...
నీ ఆటల్లో...నీ పాటల్లో...నీ నవ్వుల్లో.....
నీ మాటల్లో...ఇలా అన్నిట్లో...
చిన్నప్పటి నన్ను మళ్లీ చూసుకుంటున్న అనుభూతి!!!
నిన్ను చూస్తుంటే.....బంగారు తండ్రీ!!!!

23, జూన్ 2010, బుధవారం

ఇబ్బందులు...

మా ఆఫీస్ లో కొంతమందికి పక్కన వాళ్ళు సిస్టం లో ఏమి చేస్తున్నారు, ఫోనులో ఏమి మాట్లుడుతున్నారు అనే విషయాల మీద వున్న ఇంటరెస్ట్ ఇంక వేటి మీదా వుండదు. కొద్దిగానైనా వారి అసహ్యకర ప్రవర్తన మార్చుకోరు. ఏమైనా అన్నా కుడా పట్టించుకోరు. అంటే దున్నపోతు మీద వాన కురిసిన చందాన అన్నమాట ఇలాంటి వాళ్లకు.

ఇంట్లో ఎంత గారాబంగా పెరిగినా బయట నలుగురితో శభాష్ అనిపించుకోవాలి గాని…

వీడెప్పుడు పోతాడా అని ఎదురు చూసేటట్లు ఉండకూడదు.

మన పెద్దలు చెప్పినట్లు కాలు జారితే వెనక్కి తీసుకోగలం కాని మాట జారితే తీసుకోలేము అని వీళ్ళకు ఎప్పుడు తెలుస్తుందో మరి .

మీ ప్రవర్తన ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా ఆహ్లాదాన్ని ఇవ్వాలి కాని అసహ్యాన్ని పెంచకూడదు. మరి ఈ నిజాన్ని వాళ్ళు ఎప్పుడూ తెలుసుకుంటారో!!.

ఈ నాటి పల్లె దుస్థితి














పల్లె ఏడుస్తోంది…..

దూరమౌతున్న అనుబంధాలను దూరం చేసుకోలేక….

బతకడానికి వలసలు పోతున్న కుటుంబాలను ఆపలేక…

మసకబారుతున్న మానవత్వపు విలువలు చూడలేక…

ఓట్ల కోసం వచ్చి వాగ్థానాల వర్షాన్ని కురిపించే

రాజకీయ నాయకుల రాక్షస నీతిని చూడలేక..

పాడి పంటలతో..పచ్చని పైరులతో…అష్టైశ్వర్యాలతో కళ కళలాడిన పల్లెలు ఒకప్పుడు.....
మరి ఇప్పుడు ......

ఎప్పుడు పడుతుందో తెలియని వానదేముని చల్లని చూపు కోసం…

ఏ ప్రళయం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో తెలియక

పండిన పంటకు కనీసం గిట్టుబాటు లేక

పంట పండించాలో లేదో తెలియని

అయోమయ స్థితిలో వున్న ఈ నాటి పల్లె రైతుని చూసి

గుండే చెరువైయ్యేలా పొగిలి పొగిలి ఏడుస్తోంది…ఈనాడు.....

ఆనాటి బంగారు పంటల పసిడి పల్లె


21, జూన్ 2010, సోమవారం

నీ తలపుల పరిమళాలు....

అలై పొంగి ఎదే నిండి
మదిలో ఉప్పొంగి....
జడివానలో తడిచి


సుడిగాలిలో ఎగిరి....
చిగురాకులా వణికి
చిరుజల్లు గా మారి....
విరి పానుపై 
నను చుట్టుముట్టేలే 
నీ తలపుల పరిమళాలు....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner